raghava lawrence

మీరు ఫోన్ చేస్తే చాలు ఆదుకోవడానికి నేను మా టీం రెడీ...

Submitted by arun on Mon, 10/29/2018 - 16:09

ప్రముఖ హీరో, కొరియోగ్రఫర్ ,డైరెక్టర్ లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తు ఎంతో మంది పేద రోగులకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన హార్ట్ పౌండేషన్ ద్వార 150 వ హార్ట్ సర్జరీ చేయించాడు. ఈ సందర్బ్డంగా లారెన్స్ ట్విట్ చేసాడు ఈ రోజు నేను చాలా హ్యాపిగా వున్నాను.. కారణం నేను చేయించిన 150 వ సర్జరీ సక్సెస్ అయింది.. చిన్నారి కావ్యశ్రీ హార్ట్ లో హోల్ వుంటే విజయవంతంగా ఆపరేషన్ చేయించాను ఈ విజయాన్ని అందరితో పంచుకోవటం చాలా సంతోషంగా వుంది. పాప కోసం ప్రార్థించిన అందరికీ ఆపరేషన్ సక్సెస్ చేసిన డాక్టర్లకు చాలా చాలా థ్యాంక్స్ అంటు ట్విట్ చేసారు.

కేరళకు లారెన్స్‌ భారీ విరాళం..!

Submitted by arun on Thu, 08/23/2018 - 12:03

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు.
 

లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!

Submitted by arun on Fri, 07/13/2018 - 17:41

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొంతకాలం పాటు ప్రకంపనలు రేపిన నటి శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్‌లో శ్రీ లీక్స్ అంటూ తనకు గుర్తొచ్చినప్పుడల్లా.. ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపుతోంది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్‌‌గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్ గురించి తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది.

కన్నకొడుకులా ఓ కుటుంబానికి సాయం చేసిన టాప్ హీరో

Submitted by arun on Thu, 02/08/2018 - 15:12

జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి  నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ గత ఏడాది చెన్నైలోని మెరీనా తీరంలో ప్రారంభమైన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా ఊపందుకుంది. ఆ సమయంలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంధ సంస్థలు, సినీనటులు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సేలంలో జరిగిన రైల్‌రోకోలో యోగేశ్వరన్‌ (17) రైలింజన్‌ పైకి ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు.

అభిమాని మృతితో అనూహ్య నిర్ణ‌యం తీసుకున్న లారెన్స్‌

Submitted by arun on Mon, 02/05/2018 - 10:56

తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఏ ప్రముఖుడూ తీసుకొని ఉండరు. అసలు విషయం ఏంటంటే..
ఆర్.శేఖర్ అనే లారెన్స్‌ అభిమాని ఆయనతో పిక్ తీసుకునేందుకు వెళ్లి చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తనకోసం రావద్దని స్పష్టం చేశారు.
 

ర‌జ‌నీకాంత్ పార్టీ లో చేరిన రాఘ‌వ‌ లారెన్స్

Submitted by arun on Fri, 01/05/2018 - 11:53

త‌లైవా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై  బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌ద్ద‌తు ప‌లికారు. ర‌జ‌నీకి అంతా మంచే జ‌రుగుతుంద‌న్నారు. ఆయ‌న ఒక మంచి రాజ‌కీయ నేత అని అభివ‌ర్ణిస్తూ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ‌ల్లో బాగా రాణిస్తారనే నమ్మకముంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ పార్టీ లో చేరిక‌లు షురూ అయ్యాయి. ర‌జ‌నీ పార్టీ పెట్టి ప‌ట్టుమ‌ని ప‌దిరోజుల‌కూడా కాకుండానే  బీజేపీ, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న పార్టీలో చేరేందుకు సిద్ధ‌మయ్యారు.  రజనీ ఏర్పాటు చేసే రాజకీయ పార్టీలో చేరుతున్నట్టు డైర‌క్ట‌ర్  రాఘవ లారెన్స్‌, 2.ఓ చిత్ర నిర్మాత రాజు మహాలింగం ప్రకటించారు.