Mohan Babu

మోహన్‌బాబు ఇంట్లో విషాదం

Submitted by arun on Thu, 09/20/2018 - 09:51

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

‘గాయత్రి’ సినిమాపై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 17:32

మోహన్‌బాబు నుంచి ఫుల్ లెంగ్త్ రోల్ మూవీ రాక చాలా రోజులే అవుతోంది. ఒకప్పుడు కలెక్షన్స్ కు..అదిరిపోయే డైలాగ్స్ కు కేరాఫ్ గా మారిన మోహన్ బాబు, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ గాయత్రి సినిమా చేశాడు. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినూత్న కథతో వచ్చిన గాయత్రి సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. గాయత్రిలో మోహన్ బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. టూ డిఫరెంట్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు.

మోహన్ బాబు కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు

Submitted by arun on Sun, 01/21/2018 - 11:45

మోహన్ బాబు కామెంట్స్ పై రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు ఆయన మాటల్లోని స్ఫూర్తిని గ్రహించి.. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని చెబుతుండగా... మరికొన్ని పార్టీలు మాత్రం.. మోహన్ బాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ అలా కామెంట్ చేయడం సరికాదంటున్నాయి. రాజకీయాల్లో 95 శాతం రాస్కెల్సే అన్న మోహన్ బాబు ఛీత్కారాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు మాటలను ప్రజల్లో పేరుకుపోతున్న అభిప్రాయాలుగా చూడాలని ఆంధ్రా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన మాటల్ని ఓ సవాలుగా తీసుకొని..

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మోహన్‌బాబు

Submitted by arun on Fri, 01/19/2018 - 18:09

సినీ నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న 95శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న మోహన్‌బాబు సినిమాలు వేరు రాజకీయాలు వేరన్నారు. అన్న ఎన్టీఆర్‌ నిజాయితీ పరుడున్న మోహన్‌బాబు అతనికి లంచం అంటే ఏమిటో తెలియదన్నారు.

నాన్నకు ప్రేమతో.. విష్ణు కొడుకుకు ఆస‌క్తిక‌ర పేరు!

Submitted by arun on Thu, 01/04/2018 - 16:07

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ బిడ‍్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడిగా పెట్టిన పేరును మంచు విష్ణును ఆసక్తికరమైన ట్వీట్ తో వెల్లడించారు. త‌మ ముద్దుల చిన్నారికి అవ్రామ్ భ‌క్త అని పేరు పెట్టిన‌ట్టు తెలిపారు. అవ్రామ్ అంటే ‘ఎవ‌రూ ఆప‌లేరు’ అని అర్థమని తెలియ‌జేశారు. ఈ చిన్నారిని అరియానా `బేబీ ల‌య‌న్‌`అని, వివియానా `బేబీ టెడ్డీ బేర్‌` అని పిలుస్తున్న‌ట్టు విష్ణు తెలిపారు. అదే సమయంలో కొడుకు పేరులో భక్త అన్న పదాన్ని చేర్చటం కూడా ఆసక్తికరంగా మారింది.