manchu Vishnu

జగన్ పై యువ హీరో సంచలన వాఖ్యలు..

Submitted by arun on Sat, 06/02/2018 - 11:25

ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు జరగుతున్న ఈ పాదయాత్రలో జగన్ కు ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే సినీ ప్రముఖుల వద్ద నుండి కూడా జగన్ కు మద్దతు లభిస్తుంది. తాజాగా నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వి రాజ్ పాదయాత్రలో కలిసి పాల్గొనగా జగన్ సీఎం అయ్యే ఛాన్స్ కనపడుతుందంటూ సూపర్ స్టార్ కృష్ణ అభివర్ణించాడు. అయితే జగన్ పాదయాత్రను కొనియాడడం ఇప్పుడు ఇంకో కుర్ర హీరో వంతయింది. 

'మా'పై నిప్పులు చెరిగిన మంచు విష్ణు

Submitted by arun on Thu, 04/19/2018 - 11:59

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. రోజురోజుకీ కొత్త పాత్రలు ఎంటరవుతున్నాయి. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ నడుస్తోంది. కొత్తగా రాజకీయ పాత్రలు కూడా వచ్చి చేరాయి. ఇఫ్పుడు తాజాగా హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో మా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు శ్రీరెడ్డిపై ఏ హక్కుతో నిషేధం విధించారు? తిరిగి ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. మా అధ్యక్షుడు శివాజీరాజాకి లేఖాస్త్రం సంధించిన మంచు విష్ణు శ్రీరెడ్డి ఇష్యూలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవహరించిన తీరును నిలదీశారు.

నాన్నకు ప్రేమతో.. విష్ణు కొడుకుకు ఆస‌క్తిక‌ర పేరు!

Submitted by arun on Thu, 01/04/2018 - 16:07

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ బిడ‍్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడిగా పెట్టిన పేరును మంచు విష్ణును ఆసక్తికరమైన ట్వీట్ తో వెల్లడించారు. త‌మ ముద్దుల చిన్నారికి అవ్రామ్ భ‌క్త అని పేరు పెట్టిన‌ట్టు తెలిపారు. అవ్రామ్ అంటే ‘ఎవ‌రూ ఆప‌లేరు’ అని అర్థమని తెలియ‌జేశారు. ఈ చిన్నారిని అరియానా `బేబీ ల‌య‌న్‌`అని, వివియానా `బేబీ టెడ్డీ బేర్‌` అని పిలుస్తున్న‌ట్టు విష్ణు తెలిపారు. అదే సమయంలో కొడుకు పేరులో భక్త అన్న పదాన్ని చేర్చటం కూడా ఆసక్తికరంగా మారింది.