dil raju

విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

Submitted by arun on Mon, 08/20/2018 - 12:43

ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ.  'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి 'అర్జున్ రెడ్డి'తో ఊపందుకుని తాజాగా విడుదలైన 'గీత గోవిందం'తో తారా స్థాయికి చేరుకుంది.  ఎప్పటికప్పుడు తన నటనతో, యాటిట్యూడ్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు విజయ్. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ 15 ఏళ్లలో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ అందరూ స్టార్లు అయ్యారని... 20 ఏళ్ల క్రితం 'తొలిప్రేమ' సినిమాతో యూత్ ను పవన్ కల్యాణ్ షేక్ చేశారని... ఇప్పుడు తనకు విజయ దేవరకొండ అలా కనిపిస్తున్నాడని దిల్ రాజు అన్నారు.

శ్రీనివాస కళ్యాణం ఎఫెక్ట్.. దిల్ రాజు షాకింగ్ నిర్ణయం..?

Submitted by arun on Mon, 08/13/2018 - 17:07

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి టాకే వస్తున్నప్పటికీ యూత్ నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. తమ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందని భావించిన దిల్ రాజు అండ్ టీమ్ ఈ పరిణామాలతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన టాక్ విని దిల్ రాజు షాకయ్యాడట. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడంతో అసలు ఫ్యామిలీ సినిమాలు తీయడం ఆపేద్దామా అని అనుకున్నారట. కానీ..

పవన్, మహేష్ ఇచ్చిన షాక్ లో దిల్ రాజు

Submitted by arun on Wed, 01/24/2018 - 16:25

పెద్ద హీరోల సినిమాలను నిర్మించాలని..డిస్టిబ్యూట్ చేయాలని మూవీ మేకర్స్ తెగ పోటీపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ఇక అలాంటి తప్పు చేయనంటున్నాడు. పెద్ద హీరోల పేర్లు చెబితేనే ఆమాడ దూరం పరిగెడుతున్నాడు. పవన్, మహేష్ ఇచ్చిన షాక్ తో ఇంకా కోలుకోలేకపోతున్నాడు.  

శ్రీనివాస క‌ల్యాణంలో సునీల్

Submitted by lakshman on Mon, 01/15/2018 - 04:43

హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్న సునీల్ త్వ‌ర‌లో  క‌మెడియ‌న్ గా తెర‌పై అల‌రించ‌నున్నాడు. క‌మెడియ‌న్ గా కెరియ‌ర్ ను మొద‌లుపెట్టిన సునీల్ అందాల రాముడితో హీరో అయ్యాడు. అప్ప‌టి నుంచి హీరోగా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అల‌రించాడు. అయితే గ‌త కొద్దికాలంగా సునీల్ హిట్ లేక అస‌హ‌నానికి గురై మ‌ళ్లీ క‌మెడియ‌న్ యాక్ట్ చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు.  ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సునీల్ మళ్లీ  క్యారెక్టర్ చేయబోతున్నాడు.దిల్ రాజు చాలా ఆసక్తితో నిర్మించబోతున్న శ్రీనివాస క‌ల్యాణంలో కూడా స్పెషల్ క్యార‌క్ట‌ర్ చేయ‌నున్నాడు. 

'రాజా ది గ్రేట్' విడుద‌ల వాయిదా?

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 17:34

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది కాలం విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం  'రాజా ది గ్రేట్‌', 'ట‌చ్ చేసి చూడు' చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో 'రాజా ది గ్రేట్' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

ఎన్టీఆర్ ఖాతాలో మ‌రో పాత టైటిల్‌?

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 19:31

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న సినిమాల‌కు హీరోయిజం ఉట్టిప‌డే టైటిల్స్‌నే కాకుండా క‌థ‌కు స‌రిపోయే టైటిల్స్‌ని కూడా ఎంచుకుంటుంటాడు. ఇంకా అవ‌స‌ర‌మైతే పాత సినిమా టైటిల్స్‌ని కూడా క‌థ డిమాండ్ చేస్తే వాడుకున్న సంద‌ర్భాలున్నాయి. అలాంటి జాబితాలో 'బృందావ‌నం', 'శ‌క్తి' చిత్రాల‌ను చెప్పుకోవచ్చు. ఇప్పుడీ ఖాతాలోనే మ‌రో పాత టైటిల్ తో తార‌క్ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్స్‌లో వినిపిస్తోంది.  

ముగ్గురు అగ్రహీరోల సినిమా హక్కులూ దిల్ రాజువే

Submitted by lakshman on Thu, 09/14/2017 - 16:26
2017లో టాలీవుడ్‌లో బాగా సంపాదించిన నిర్మాత ఎవరన్నా ఉన్నారంటే అది దిల్ రాజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఆరంభంలో శతమానం భవతి, ఆ తర్వాత నేను లోకల్, డీజే, తాజాగా ఫిదా సినిమాతో...