Telangana

వెలిప్రేమకు మరో యువకుడు బలి

Submitted by arun on Thu, 09/20/2018 - 14:15

ప్రస్తుతం కులాంతర వివాహాలు చేసుకున్నవారు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడులు చేస్తారో అని వణికిపోతున్నారు. మిర్యాలగూడ, ఎర్రగడ్డ తర్వాత హైదరాబాద్‌ సంతోష్ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి నిన్న పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్‌ను హుటాహుటిన ఉస్మానియాకు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ ప్రాణాలు కోల్పోయాడు. 2015 లో శ్రీకాంత్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు.

ఆశావహులకు ఆజాద్‌ ఝలక్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 13:21

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ గులాం నబీ ఆజాద్‌ను ఆ పార్టీ ఆశావహులు చుట్టుముట్టారు. గాంధీభవన్‌కు వచ్చిన ఆయన్ను టిక్కెట్లు తమకే ఇవ్వాలంటూ ఆయనకు దగ్గరగా వచ్చి అడగడంతో ఆజాద్‌ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. దీంతో తన దగ్గరకు వచ్చిన వారితో టిక్కెట్లు ఇంత త్వరగా ఇవ్వడం కుదరదని చెప్పారు. టిక్కెట్ల కోసం కాదు ముందు పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గుర్తించి టిక్కెట్లిస్తామన్నారు. గాంధీభవన్‌ చుట్టూ తిరగడం కాదని ముందుగా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. 

మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన యశోద వైద్యులు

Submitted by arun on Thu, 09/20/2018 - 12:52

తండ్రి చేతితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆస్పత్రి బృందం ప్రకటించింది. మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన డాక్టర్స్‌ టీమ్‌ ప్రస్తుతం ఆమె వెంటిలెటర్‌పైనే ఉందని తెలిపారు. అయితే నిన్నటితో పోల్చితే ఇప్పటికి పరిస్థితి మెరుగైందన్న వైద్యులు మరో 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఆస్పత్రికి రాగానే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. కాస్మోటిక్‌, న్యూరో, వాస్కులర్‌ సర్జరీలు సుమారు 6 గంటల పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి మాధవిని కాపాడేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారా...వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 09/20/2018 - 12:34

కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో స్థానాలపై అలక బూనిన సీనియర్‌ నాయకుడు వీ హనుమంతారావు.. కాసేపటి క్రితం పార్క్‌ హయత్‌ హోటల్‌ లో ఉన్న గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మెన్‌ పదవి వస్తుందని ఆశించానని కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని తనకు పదవి వస్తే కేసీఆర్‌ను ఓడిస్తాననే భయం కోవర్టుల్లో ఉందని వీహెచ్‌ వెల్లడించారు. అందుకే తనకు పదవి రాకుండా చేశారని ఆరోపించిన వీహెచ్‌ వారి పేర్లను డైరెక్ట్‌గా రాహుల్‌గాంధీ ముందే చెబుతానని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌‌కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత.. రేపు కాంగ్రెస్‌లోకి...

Submitted by arun on Thu, 09/20/2018 - 12:05

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తాజాగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అంతేకాదు ఆ పార్టీ తరఫున ఖానాపూర్ నుంచి రమేశ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌‌ ఈ నెల ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో ఖానాపూర్‌ టిక్కెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేటాయించడంతో రమేష్‌ రాఠోడ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

సోషల్‌ మీడియా వార్‌కు ప్రత్యేక గులాబీ దళం

Submitted by arun on Thu, 09/20/2018 - 11:48

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కి, సోషల్ మీడియా, ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పలువురు అభ్యరులపై సోషల్ మీడీయా వేదికగా జరుగుతున్న ప్రచారం పార్టీకి, తలనొప్పినగా మారింది. దీంతో ఆ నేతలకు తలంటిన పార్టీ అధినేత, అదే  సోషల్ మీడియా ద్వారా విపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఇక ప్రజా ఆశీర్వాద సభలకూ, డిజిటల్ హంగలు అద్దుతున్నారు కేసీఆర్. 

కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 11:32

కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఈ తెల్లవారు జామున 3 గంటలకు సమీపంలోని అటవీ నుంచి వచ్చిన ఎలుగుబంటి రోడ్లపై రౌండ్లు కొట్టింది. తర్వాత టవర్‌ సర్కిల్‌ లోని బీఎస్‌ఎన్‌ ఎల్‌ టవర్‌ వెనుక ఉన్న చిన్న ఆఫీస్‌లోకి వెళ్లి దాక్కుంది. దీంతో విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలుగుబంటిని పట్టుకునేందుకు నాలుగు గంటలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు వరంగల్‌ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం కరీంనగర్‌కు రప్పిస్తున్నారు. ఎలుగుబంటి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.

విషమంగానే మాధవి ఆరోగ్య పరిస్థితి...3 రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్న వైద్యులు

Submitted by arun on Thu, 09/20/2018 - 11:18

కన్నతండ్రి చేతిలో కత్తితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు.. ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. కాస్మోటిక్‌, న్యూరో, వాస్క్యులర్‌ సర్జరీల ద్వారా చికిత్స జరుగుతుందని ఇవి పూర్తయ్యాక కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. 3 రోజుల తర్వాతే మాధవి పరిస్థితి తెలుస్తుందని చెబుతున్నారు. మెడపై కత్తితో దాడి చేయడంతో నరాలు తెగిపోయాయని దీంతో రక్తస్రావం ఎక్కువైందని చెబుతున్నారు. 
 

కారెక్కిన వారికీ కాంగ్రెస్‌ పదవులు...టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి 3 కీలక పదవులు...

Submitted by arun on Thu, 09/20/2018 - 10:24

కాంగ్రెస్‌ కొత్త కమిటీలపై గొడవ మొదలైంది. వీహెచ్‌, పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గులాబీ కండువా కప్పుకున్న సురేష్‌ రెడ్డికి, పలు కమిటీల్లో చోటు కల్పించడం కూడా చర్చనీయాంశమమైంది.

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నూతన కమిటీలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు మండిపడ్డారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో సీనియర్ నేత  వీహెచ్ తీవ్ర స్ధాయిలో అసంతృప్తి చెందారు. గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన, వాహనం కోసం కూడా ఎదురుచూడకుండా  నాంపల్లి సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం

Submitted by arun on Thu, 09/20/2018 - 10:12

ముందస్తు సమరానికి కాంగ్రెస్‌ సరికొత్త దళం సిద్దమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించగా, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. అలకమీదున్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా చెలరేగిపోవాలని కర్తవ్య బోధ చేసింది కాంగ్రెస్. పొత్తులు, ఎత్తులు, రాహుల్‌తో వరుస సమావేశాలతో ముందస్తు దూకుడు పెంచిన టీ. కాంగ్రెస్ ‌నేతలు, యుద్ధానికి సైన్యంగా ఏర్పడ్డారు. పార్టీ వర్గాలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న  ఎన్నికల కమిటీలను ప్రకటించి, సమరంలో దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది ఏఐసీసీ.