Telangana

కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్‌లో దారుణం

Submitted by arun on Wed, 06/20/2018 - 14:25

హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాలు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్‌కుమార్‌ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాలు విరగ్గొట్టాడు. డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాలు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకొన్నాడు.

ప్రేమ వ్యవహారం.. భవనంపై నుంచి దూకిన యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 13:34

హైదరాబాద్ ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాలిటెక్నిక్ చదువుతున్న సనా తన తల్లిదండ్రుల కళ్ల ముందే భవనంపై నుంచి దూకింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామం. సన ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్‌ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది.

జులై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 ప్రారంభం : కేటీఆర్

Submitted by arun on Wed, 06/20/2018 - 13:14

అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్‌ ప్రారంభమైంది, ట్రయల్ రన్ లో భాగంగా  మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. మెట్రో ఫేజ్-2 పనులను పరిశీలించారు.  ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి  కేటీఆర్ స్పష్టంకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు.

తెలంగాణ టీచర్లకు రోగాలు

Submitted by arun on Wed, 06/20/2018 - 11:20

తెలంగాణ టీచర్ల బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. కోరుకున్నచోట పోస్టింగ్‌ కోసం ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. బదిలీల్లో హెల్త్‌ సర్టిఫికెట్‌ ఆయుధంగా మారడంతో అక్రమాలకు పాల్పడ్డారు. నోటిఫికేషన్‌లో లొసుగుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని మార్గం తప్పారు. ఎన్నడూ సిక్‌ లీవ్‌ పెట్టనివాళ్లు సైతం పెద్దపెద్ద రోగాలున్నట్లు దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు. లేని రోగాలను ఉన్నట్లుగా నకిలీ ధృవపత్రాలు సమర్పించారు.

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/20/2018 - 11:02

కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్‌లోని ఆరెంజ్ ట్రావెల్స్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో చెలరేగిన మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌లోని బస్సుల గ్యారేజిలో షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులు ఏవీ లేకపోవడంతో ఆస్తి నష్టం జరుగలేదు.
 

కోటాపై క్లారిటీ...తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్లు

Submitted by arun on Wed, 06/20/2018 - 08:32

 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బీసీ ఓటర్ల గణన పూర్తికావడంతో... రెండు మూడ్రోజుల్లో బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసేందుకు పనులు మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపించేందుకు వ్యూహం

Submitted by arun on Wed, 06/20/2018 - 08:25

సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ముందుగా పంచాయతీ పోల్స్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈజీగా గట్టెక్కవచ్చని లెక్కలేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురే లేకుండా పోతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

నా కోరిక తీర్చు.. రైతుబంధు చెక్కు ఇస్తా!

Submitted by arun on Wed, 06/20/2018 - 08:13

నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మహిళా రైతును తహసీల్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. తన కోరిక తీరిస్తేనే రైతు బంధు పథకం కింది చెక్కు ఇస్తానని, లేదంటే భూమిపై సివిల్ దావా వేయిస్తానని బెదిరించాడు. రోడ్డు ప్రమాదంలో కాళ్లూ చేతులూ విరిగిన భర్తతో భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న మహిళ దీన గాధ ఇది. ఆ మహిళపై తహసీల్దార్ కన్నేసి తన కామవాంఛను బయటపెట్టాడు. అయితే, ఆ మహిళ అతనిపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. వివరాల్లోకెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం, చిన్నిపాడులో బాధితురాలి తల్లికి సర్వే నంబర్‌ 57/ఏలో 1.06 ఎకరాల భూమి ఉంది.

హస్తినకు చేరిన టీ.కాంగ్రెస్ పంచాయతీ...ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేయనున్న సీనియర్ల

Submitted by arun on Wed, 06/20/2018 - 07:58

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. గతకొంత కాలంగా పీసీసీ చీఫ్ వర్సెస్.. ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. 

ఉత్తమ్‌ బస్సు యాత్రకు బ్రేక్‌?

Submitted by arun on Wed, 06/20/2018 - 07:16

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకూ గడ్డం గీసుకోనంటూ ప్రతినబూని.... పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు... సీనియర్లు చెక్‌ పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. మూడు విడతల్లో 38 నియోజకవర్గాలను చుట్టేసిన ఉత్తమ్‌ను... నాలుగో విడత యాత్ర చేపట్టొద్దని అధిష్టానం ఆదేశించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఉత్తమ్‌ ఢిల్లీ టూర్ తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.