Andhrapradesh

పేలిన గ్యాస్‌.. అగ్నికి ఆహుతైన కుటుంబం

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 10:38

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో జరిగింది. శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ దంపతులు. వారికీ  నితిన్‌, భవ్య ఇద్దరు  సంతానం. శనివారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోయింది. కాగా, గ్యాస్‌ ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

నేడు ప్రజాసంకల్ప యాత్రపై మాట్లాడనున్న వైయస్ విజయమ్మ

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 08:37

వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర, ఇటీవల జగన్ పై జరిగిన దాడి  గురించి మీడియాతో మాట్లాడనున్నారు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ. జగన్ పై దాడి జరిగిన తరువాత మొదటిసారి విజయమ్మ మీడియా ముందుకు వస్తున్నారు. ఇదిలావుంటే 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన 11న బయలుదేరి అదే రోజు రాత్రికి పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు సోమవారం ఉదయం నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు.

నేడు ఏపీ మంత్రివర్గ విస్తరణ

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 07:55

నేడు(ఆదివారం) ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్‌ నరసింహన్‌. ఉండవల్లిలోని సీఎం గ్రీవెన్స్‌ హాల్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రులుగా శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూఖ్‌తో పాటు ఇటీవలే మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు కుమారుడు కిడారి శ్రవణ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మైనారిటీ కోటానుంచి ఎమ్మెల్యే చాంద్‌ బాషా, షరీఫ్‌, జలీల్‌ ఖాన్‌లు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫరూఖ్‌కే మంత్రి పదవి దక్కింది.

జనసేన తీర్థంపుచ్చుకున్న కాంగ్రెస్ నేత..

Submitted by chandram on Sat, 11/10/2018 - 16:28

ఎట్టకేలకు జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమ‍క్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బాలరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జనసేనని పవన్ తెలిపారు. తనదీ, నాదేండ్ల మనోహర్‌ది, బాలరాజుది ఒకటే భావస్వారూప్యతని పవన్ వ్యక్యనించారు. గిరిజనుల అభివృద్ధి కోసం బాలారాజు సేవలను, అనుభవాన్ని పార్టీలో వినియోగించుకుంటామని జనసేనాని వెల్లడించారు.
 

రేపు మీడియా ముందుకు వైఎస్ విజయమ్మ

Submitted by arun on Sat, 11/10/2018 - 16:23

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై దాడి తర్వాత తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రానున్నారు. రేపు ఉదయం వైఎస్ విజయమ్మ మీడియా ముందుకు రానున్నారు. జగన్ పై దాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై విజయమ్మ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాడి నుంచి కోలుకుంటున్న జగన్ రేపు రాత్రికి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఎల్లుండి నుంచి విజయనగరంలో ప్రజా సంకల్పయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటి వరకూ  వైఎస్‌ జగన్‌ 294 రోజులుపాటు పాదయాత్ర చేశారు. 
 

పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో అద్భుతం...బాబా చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి

Submitted by arun on Sat, 11/10/2018 - 15:34

అనంతపురం పుట్టపర్తిలో అద్భుతం జరిగింది. సత్యసాయి జనరల్ ఆసుపత్రి మెయిన్ గేటుకు ఆనుకుని ఉన్న సేవాదళ్ గదిలో ఉన్న బాబా చిత్రపటం నుంచి విభూతి రాలుతోంది. ఇది గమనించిన సేవాదళ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు బాబా ఫోటోను దర్శించుకుని రాలిన విభూతిని తీసుకుని పోతున్నారు. బాబా జయంతి సమీపిస్తుండడంతో ఇలా విభూతి రాలడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు.
 

నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా

Submitted by chandram on Sat, 11/10/2018 - 13:12

సర్వ సాధారణంగా అయితే  ట్రాఫిక్ పోలీసుల వద్ద, ప్రభుత్వ పరమైన చర్యలను ఉల్లగిస్తే జరిమానా విధింపు ఉంటుంది. అయితే ఒక ఊరిలో అయితే ఆడవాళ్లు నైటీలు ధరిస్తే మాత్రం అక్కడ జరిమాన చెల్లించల్సిందే. ఇందంత ఏ ప్రపంచంలోనో, దేశంలోనో కాదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. ఈ ఉరిలో తొమ్మండుగురు మంది పెద్ద మనుషులు కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ తీర్మాణంలో పొద్దుగల 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రాంతానా ఆడవాళ్లు నైటీ వేసుకోరాదని ఖరాఖండిగా అందరి సమక్షంలో  తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లగిస్తే రూ. 2వేల రూపాల జరిమాన విధించారు.

వైసీపీలోకి మాజీ మంత్రి

Submitted by arun on Sat, 11/10/2018 - 12:26

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన  సీ.రామచంద్రయ్య తర్వలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  చేశారు. ఎల్లుండి నుంచి వైసీపీ అధినేత జగన్‌ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర  విశాఖ జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

Submitted by chandram on Sat, 11/10/2018 - 12:12

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త సోమేశ్వర గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. దేవనకోండ మండలం కె.వెంకటాపురం శివారులో ఈ ఘటన జరిగింది. సోమేశ్వర గౌడ్‌ను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపేశారు. ఈ దాడిలో ఆయన కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడితో ఇంటికి వెళ్తున్నప్పుడు సోమేశ్వర గౌడ్ కంట్లో కారం కొట్టి ప్రత్యర్థులు చంపేశారు. మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్న రాహుల్‌గాంధీ

Submitted by arun on Sat, 11/10/2018 - 11:40

కాంగ్రెస్‌ అధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 23న అమరావతికి రానున్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందులో రాహుల్‌ గాంధీ పాల్గొనున్నారు. ఈ విందు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, తేజస్వి యాదవ్‌ సహా 10 మంది జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే రోజు టీడీపీ నిర్వహించే ధర్మపోరాట దీక్షలో జాతీయ నేతలు పాల్గొనున్నారు.