Andhrapradesh

సాగర తీరంలో నేవీ మార్‌థాన్

Submitted by chandram on Sun, 11/18/2018 - 12:11

విశాఖ సాగర తీరం ఆరంజ్ మయంగా మారింది.  నేవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న 5, 10, 21, 42కే మార్‌థాన్‌కు నగర వాసులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. బీచ్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ మార్‌థాన్‌లో యూత్‌తో పాటు వృద్ధులు హుషారుగా పాల్గొన్నారు. హుద్‌ హుద్ బీభత్సంతో అతలాకుతలమైన విశాఖ వాసుల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపించేందుకు నేవీ అధికారులు ఈ మార్‌థాన్ చేపట్టారు. విశాఖ బీచ్ రోడ్డు మెత్తం కోలహాలంగా మారింది. అధికారులు, ప్రజలు, పిల్లలు అందరు  మార్‌థాన్‌కు పెద్దఎత్తున ప్రజలు కన్నుల పండుగా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15000 మంది పాల్గోనేవారు 4 రన్స్ లో చేస్తున్నారు. 

అమరావతిలో శరవేగంగా తాత్కాలిక హైకోర్టు నిర్మాణం

Submitted by chandram on Sun, 11/18/2018 - 10:48

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మిస్తున్న సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు నిన్న పరిశీలించారు. హైకోర్టు నిర్మాణాలపై ప్రధాన న్యాయమూర్తితో పాటు అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి తర్వాత అమరావతిలో ఏపీ హైకోర్టు ప్రారంభమవుతుంది. ఏపీ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మిస్తున్న సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు.

విశాఖపై కీలక నిర్ణయం తీసుకున్న ధోని

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 07:54

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీకి విశాఖతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ ధోనీ విశాఖ వైయస్ రాజేశేఖర్ రెడ్డి స్టేడియంలోనే ఆడాడు. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహి సెంచరీతో చెలరేగిపోయిన సంగతి అందరికి తెలిసిందే.  ఆ తర్వాత ధోనీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.  తాజాగా విశాఖతో ధోని తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు.

జగన్‌ సీఎం కావడం ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:07

చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్‌సీపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. నగరి ఎమ్మెల్యే రోజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు.  రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై నగరి ఎమ్మెల్యే రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ఆమెను అభినందించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తధ్యమని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు ఝలక్

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:06

విజయవాడలో స్వాతంత్ర సమరయోధుడి భూకబ్జా కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది. బోండా ఉమపై కేసు నమోదు చేయాలని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.  పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడాన్నితప్పుబట్టిన హైకోర్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని గతంలో బాధితుడు కోటేశ్వరరావు  పోలీసులను ఆశ్రయించాడు. బోండా ఉమ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోటేశ్వరరావు కోర్టును ఆశ్రయించాడు.

తెలిసీ తెలియకుండా మాట్లాడకూడదని వెళ్ళిపోయా : జగన్

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 18:39

గతనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ దాడి గురించి వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. తాజగా పాదయాత్రలో భాగంగా పార్వతీపురం బహిరంగసభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా తనపై జరిగిన దాడి విషయంపై మొదటిసారి స్పందించారాయన.. విశాఖ ఎయిర్పోర్టులో తనపై హత్యా యత్నం జరిగింది. ఈ దాడిని నేనే చేయించుకున్నానని, దాడి చేసిన వ్యక్తి(శ్రీనివాసరావు) వైసీపీకి చెందిన వ్యక్తేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధేసిందని అన్నారు.

రోజా బర్త్ డే స్పెషల్.. రాజన్న క్యాంటీన్లు

Submitted by chandram on Sat, 11/17/2018 - 17:00

ఏపీ నగరి ఎమ్మెల్యే రోజా పుట్టినదిన వేడుకలు తన కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. తన నియోజకవర్గమైన నగరిలో తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా తనే స్వయంగా స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజన్న క్యాంటీన్ల పేరుతో 2 మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించారు. రూ.4 రూపాయలతో భోజనం అందించనున్నారు. రానున్న రోజుల్లో కూడా మరో రెండు మొబైల్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. రోజా మాట్లాడుతూ తన పుట్టినరోజు పేదప్రజలకోరకు క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. తన పుట్టినరోజు శుభాక్షాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి

Submitted by chandram on Sat, 11/17/2018 - 16:31

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మానసిక స్థితి నిలకడగా ఉందని, ఇకపై తను ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో శనివారం ఎర్పాటుచేసిన బహిరంగసభలో విజయసాయి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికావడం ఖాయం, అలాగే ఎపీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ అధికారపగ్గాలు చేపట్టిన మరుక్షణమే ఎమ్మెల్యే రోజాకు కీలక పోస్ట్ వర్తిస్తుందని ప్రకటించారు. మహిళల సమస్యలపై రోజా పోరాటం మరువలేనివని ఆయన గుర్తుచేశారు.

సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన మాజీ జేడీ

Submitted by nanireddy on Fri, 11/16/2018 - 18:38

ప్రభుత్వ అనుమతి లేనిదే  ఏపీలో సీబీఐ దర్యాప్తు చేయకూదదని చంద్రబాబు ప్రభత్వం జీవో జారీచేసింది.అయితే ప్రభుతం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కానీ ఎందుకు రద్దు చేశారో చెప్పాలని అన్నారు. సీబీఐ సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల అవినీతికి పాల్పడే వారు మరింత రెచ్చిపోతారని తెలిపారు. ప్రతి కేసు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలంటే కుదరదని.. ఇది సీబీఐకి ప్రతిబంధకమని ఆయన అభిప్రాయపడ్డారు. 

సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఉండవల్లి

Submitted by nanireddy on Fri, 11/16/2018 - 17:44

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ దాడులు చేయాలంటే ఏపీ ప్రభుత్వ అనుమతి తెప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై నేరుగా సీబీఐ దాడులు చేయొచ్చని అన్నారు. అయితే సిబిఐ దర్యాప్తుకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఏ విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని అన్నారు. దాడులు చేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పసరని చెబితే ఆ జీవో చెల్లదన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కల్యాణ్‌ సింగ్‌ సర్కార్‌, పప్పూ యాదవ్‌ కేసుల్లో ఇదే తరహాలో జరిగిందని అయన గుర్తు చేశారు.