Andhrapradesh

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే..

Submitted by nanireddy on Mon, 09/24/2018 - 19:26

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ లను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలతో.. ముగ్గురు నేరుగా దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులను హత్య చేసింది శ్రీనుబాబు, స్వరూప, అరుణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా  ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి.

3వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌ పాదయాత్ర

Submitted by arun on Mon, 09/24/2018 - 16:23

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ,  ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  మరో అరుదైన మైలురాయిని దాటింది. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలో రావి మొక్క నాటిన జగన్‌ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్‌ ఆశిష్కరించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి...అరుణ నేతృత్వంలోనే అరకు ఆపరేషన్‌

Submitted by arun on Mon, 09/24/2018 - 15:15

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరుకు దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న అరుణ.. దాడికి పది రోజుల క్రితమే అరుకు ఏరియాకు వచ్చినట్టు పోలీసులు సమాచారం సేకరించారు. మహిళా దళానికి నేతృత్వం వహిస్తున్న అరుణ... పక్కా వ్యూహంతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న అక్కిరాజు హరగోపాల్‌... అలియాస్‌ ఆర్కే ఆదేశాలతోనే ఎమ్మెల్యే సర్వేశ్వర్రావ్, మాజీ ఎమ్మెల్యే సోమలను అరుణ దళం కాల్చి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అసెంబ్లీలో సర్వేశ్వరరావు చివరి మాటలు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:37

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రజా సమస్యలపై పోరాడడంలో  ఎప్పుడూ ముందుడే వారు. అసెంబ్లీలో తరుచూ ఆయా సమస్యల్ని ప్రస్తావించేవారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కిడారి సర్వేశ్వరరావు వెలుగు కాంట్రాక్టు ఉద్యోగుల గురించి మాట్లాడారు. వెలుగు కాంట్రాక్టు ఉద్యోగులకు..ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీలో కిడారి సర్వేశ్వరరావు మాట్లాడిన చివరి మాటల్ని ఓసారి వినండి.
 

కిడారి హత్య జరిగి 24 గంటలు గడవక ముందే...మావోలకు భారీ ఎదురుదెబ్బ

Submitted by arun on Mon, 09/24/2018 - 11:01

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. కిడారి హత్య జరిగి 24 గంటలు గడవక ముందే.. మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఏడుగురు మావోలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు, పైప్‌బాంబ్స్‌ నిర్వీర్యం చేశారు. పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

Tags

మమ్మల్ని గన్స్‌తో రౌండప్‌ చేశారు: ఎమ్మెల్యే డ్రైవర్‌

Submitted by arun on Mon, 09/24/2018 - 10:43

అరకులో ఇద్దరు ప్రజాప్రతినిధులు మావోల చేతిలో దారుణంగా హతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శివేరి సోమ డ్రైవర్ చిట్టిబాబు సంఘటన జరిగిన తీరును మీడియాకు వివరించాడు. తమని తుపాకులతో రౌండప్‌ చేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్‌ కే చిట్టిబాబు మీడియాకు తెలిపారు. సిబ్బంది నుంచి ఆయుధాలను తీసుకున్న తర్వాత అందరినీ బందించారని సర్వేశ్వరరావును, సోమాను అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకుపోయారని సోమా డ్రైవర్ తెలిపాడు.

మావోల హిట్‌లిస్టులో ఉన్న సర్వేశ్వరరావు...గతంలో పలుసార్లు....

Submitted by arun on Mon, 09/24/2018 - 10:29

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మృతి చెందారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.  

రగులుతున్న విశాఖ మన్యం

Submitted by arun on Mon, 09/24/2018 - 10:13

విశాఖ మన్యం రగిలిపోతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే సివారి సోమ హత్యలతో.. ఏజెన్సీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అరకు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతదేహాలకు ఈ ఉదయం పోస్ట్‌మార్టం పూర్తి అయింది. కిడారి మృతదేహాన్ని అంబులెన్సులో పాడేరుకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం కిడారి, సోమ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అరకుకు చేరుకోనున్నారు. ఇందుకోసం భారీ భద్రతను కల్పిస్తున్నారు. 

ఎమ్మెల్యే కిడారి హత్య.. ఎస్సైపై వేటు..

Submitted by nanireddy on Mon, 09/24/2018 - 09:37

నిన్న(ఆదివారం) మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా మృతిచెందిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక డుంబ్రిగుడ ఎస్‌ఐపై వేటు వేశారు. ప్రజాప్రతినిధులకు సరైన రక్షణ కల్పించలేదనే కారణంతో  ఎస్‌ఐ అమ్మన్‌రావుపై వేటు వేశారు అధికారులు. ఇదిలావుంటే మావోయిస్టుల దుశ్చర్యకు నిరసనగా నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి  ప్రజాసంఘాలు. దీంతో అరకులోయాలో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. నిన్న పోలీస్ స్టేషన్ పై దాడి జరగడంతో అరకులోయలో 144 సెక్షన్ విధించారు. 

చావు గురించి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చివరి మాటలు..

Submitted by nanireddy on Mon, 09/24/2018 - 07:19

మావోయిస్టుల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములు బలైపోయారు. నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో 50 మందికి పైగా మావోయిస్టులు అందులో దాదాపు 30 మంది మహిళా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ మృతిచెందారు. ఇక కిడారి హత్యకు ముందు ఆయన మాట్లాడిన మాటలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మన్యంలో ప్రబలిన విషజ్వరాలపై రాజకీయం చేయకుండా వారికీ అండగా నిలవాలని.. వీలైతే వారిని ఆసుపత్రిలో చేర్పించి సాయం అందించాలని కోరారు. అంతేకాదు.. అందరూ ఏదో ఒకరోజు శవమై పోవలసిందేనని.. తనతోపాటు అందరూ సమాధి కావలసిందేనని.. అది కొంత ఎక్కువో తక్కువో ఉండొచ్చు అని అన్నారు.