naga chaitanya

కొత్త చిత్రం సవ్యసాచి సినిమా రివ్యూ

Submitted by arun on Fri, 11/02/2018 - 14:49

కొత్తదైన ఆలోచనతో ..వచ్చిన కొత్త చిత్రం సవ్యసాచి.  సినిమా.. కి మూలం...‘మేధావి తన తెలివిని మంచి కోసం వాడాలి కానీ, వినాశనం కోసం కాదు.. అలాంటి మేధావితనం అతన్నే నాశనం చేస్తుంది’ . ఈ ఆలోచనకి  మంచి కథనం తోడై ఉంటే ఇంకా ఎంతో మేరుగై వుండేది ఈ సినిమా. ప్రతీకారం అనే భావాన్ని సినిమాగా చేసిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి’. ఇందులోని  ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే విషయము మూలంగా ..కథ కొంత ఫ్రెష్ గా అనిపించింది.  వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనేతే....తల్లి గర్భంలో ఏర్పడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోయే ఒక లోపం ఇది.... ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు.

తొలిరోజు దుమ్మురేపిన శైలజారెడ్డి అల్లుడు.. చైతు కెరీర్‌లో ....

Submitted by arun on Fri, 09/14/2018 - 14:33

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టుకుంది. పాజిటివ్ అంచనాల మధ్యన విడుదల అయిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించారు. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగచైతన్య కెరీర్‌లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు.

తొలిరోజు వసూళ్లు:

టాలివుడ్ క్యూట్ కపుల్ మధ్య పోటీ

Submitted by arun on Sat, 07/07/2018 - 14:09

టాలివుడ్ క్యూట్ కపుల్స్ మధ్య ఇప్పుడు టగ్గాఫర్ వార్‌ నడుస్తోంది. పెళ్లి తర్వాత హీరోయిన్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే హీరో మాత్రం కాస్త వెనుకబడ్డాడు. అందుకే కాస్త లేటైనా సరే ఆడియన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈసారి తనకు టైమొచ్చిందంటున్నాడు ఆ హీరో. ఇంతకీ ఆ క్యూట్‌ కపుల్స్‌ ఎవరు? వారి మధ్య వార్‌ ఏంటీ?

క్యూట్ బ్యూటీ సమంతాకి పెళ్లి తర్వాత బాగా కలిసొచ్చింది. వరుసగా రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో సమంతా హిట్లు కొట్టింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇటు టాలివుడ్ లో అటు కోలివుడ్ లో సమంతా సత్తా చాటుతోంది. మరోవైపు సమంతా హబ్బీ నాగచైతన్య మాత్రం ప్లాప్ తో సతమతమవుతున్నాడు.

ఏనిమిదేళ్ల ప్రేమ‌కి థ్యాంక్స్

Submitted by lakshman on Sun, 04/01/2018 - 23:34

సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. తన భర్త చైతన్యతో కలిసి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌‌లో సెల్ఫీ దిగిన ఆమె అభిమానులకు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాకు సెల్ఫీలు దిగడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దిగాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ పార్క్‌లోనే 8 ఏళ్ల క్రితం మా మధ్య ప్రేమ మొదలైంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని మా నమ్మకం. అందుకే ఈ ప్లేసుకు థాంక్స్ చెప్పుకోవడానికే తిరిగి ఇక్కడకు వచ్చాము... అని సమంత తెలిపారు.

అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతోన్న గండం

Submitted by arun on Fri, 01/12/2018 - 15:06

ఒక్క హీరోకు ఫ్లాప్ పడితే ఏమో అనుకోవచ్చు. కానీ గుండుగుత్తగా అక్కినేని ఫ్యామిలీ ఫ్యామిలీయే ఫ్లాప్ ల్లో ఇరుక్కుంది. ఒక్క హిట్ కోసం తండ్రి నాగార్జున నుంచి తనయులు చైతు,అఖిల్ వరకు అల్లాడుతున్నారు. ఒక్క చైతు పెళ్లి మ్యాటర్ తప్పించి..పోయిన ఏడాది అక్కినేని ఫ్యామిలీలోని ఏ హీరోకు కలిసి రాలేదు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, చైతూ, అఖిల్ ను దురద్రుష్ట్యం వెంటాడుతోంది. ఒక్కరికి హిట్ ఒకరికి ఫ్లాప్ అని కాకుండా ఈ హీరోలంతా ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. దీంతో ఇటు అక్కినేని హీరోలు, అటు ఫ్యాన్స్ లో నిరాశ నిండుకుంది.

అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.

తెలుగు తెర‌పై మ‌రోసారి మాధ‌వ‌న్‌?

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 12:29

లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ప్రేమ‌క‌థా చిత్రం 'స‌ఖి' (త‌మిళ అనువాద చిత్రం) ద్వారా తెలుగువారికి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు మాధ‌వ‌న్‌. ఆ చిత్రం విజ‌యం సాధించ‌డంతో చాక్లెట్ బోయ్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌రువాత వ‌చ్చిన త‌మిళ అనువాద చిత్రాలు 'చెలి', 'ర‌న్' కూడా మాధ‌వ‌న్ ఖాతాలో విజ‌యాల్ని చేర్చాయి. 'ప‌ర‌వ‌శం', 'డుమ్ డుమ్ డుమ్‌', 'అమృత‌', 'యువ' త‌దిత‌ర త‌మిళ అనువాద చిత్రాల‌తో ఇక్క‌డివారిని సుప‌రిచితుడైన‌ మాధ‌వ‌న్‌.. 2010లో వ‌చ్చిన తెలుగు చిత్రం 'ఓం శాంతి'లో ఆర్ జె మ్యాడీగా అతిథి పాత్ర‌తో ప‌ల‌క‌రించాడు.

యుద్ధం శరణం రివ్యూ

Submitted by lakshman on Sun, 09/17/2017 - 20:29

నిర్మాణ సంస్థ‌: వారాహి చలన చిత్రం

తారాగణం: నాగౖచెతన్య, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్‌, శ్రీకాంత్‌, మురళీశర్మ, వినోద్‌కుమార్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్‌: కృపాకరన్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
కథ: డేవిడ్‌ ఆర్‌. నాథన్‌
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: రజనీ కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ మారిముత్తు
విడుదల తేదీ: 08.09.2017

చైతూ, సమంత పెళ్లి విషయంలో క్లారిటీ

Submitted by lakshman on Thu, 09/14/2017 - 16:00
టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంట ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వారి ప్రేమ పయనం త్వరలో పెళ్లి వైపు అడుగులు వేయబోతోంది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మహేశ్ బాబు తన సినిమాలో నటించిన నమ్రతను ప్రేమించి..

చైత‌న్య నాలుగో ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అవుతుందా?

Submitted by nanireddy on Tue, 09/05/2017 - 19:42

యువ‌కథానాయ‌కుడు నాగ‌చైతన్య కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలున్నాయి. అలాగే ఘోర‌మైన ప‌రాజ‌యాలున్నాయి. అయితే.. ఫ్లాప్ అయిన సినిమాల‌లో కొత్త ద‌ర్శ‌కులు టేకాఫ్ చేసినవే ఎక్కువ‌. వాసువ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో చేసిన 'జోష్‌', అజ‌య్ భుయాన్ డైరెక్ష‌న్‌లో చేసిన 'ద‌డ‌', వివేక్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బెజ‌వాడ' చిత్రాలు నాగ‌చైత‌న్య కెరీర్‌లో మ‌ర‌క‌లుగా మిగిలాయి.