giddi eswari

మావోల హిట్‌ లిస్ట్‌లో మరో 15 మంది ప్రజా ప్రతినిధులు

Submitted by arun on Wed, 09/26/2018 - 10:40

విశాఖ మన్యం.. గజ గజ వణికుతోంది. కిడారి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలతో భయంకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా సాగుతోన్న కూంబింగ్‌ మరోవైపు మావోయిస్టు వారోత్సవాలతో గరిజనం అల్లాడిపోతున్నారు. ఇవాళ ఏజెన్సీకి డీజీసీ ఠాకూర్‌ వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

పవన్‌పై గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/08/2018 - 12:01

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పవన్ విశాఖలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె పవన్‌పై పలు విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదని ఈశ్వరి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చుక్కెదురు

Submitted by arun on Thu, 01/04/2018 - 11:24

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి బృందాన్ని పంచాయతీ గిరిజనులు అడ్డగించారు.