Rape Attempt

ఎఫైర్: ఆ సంబంధం కోసం ఇంటికొస్తే... దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ

Submitted by arun on Fri, 08/17/2018 - 09:48

వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలో జరిగింది. తాలూకా సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.

హెచ్‌సీయూలో దారుణం..విద్యార్థినిపై సామూహిక అత్యాచారయత్నం

Submitted by arun on Sat, 03/17/2018 - 13:04

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్  MA ఫస్ట్ ఇయర్ చదువుతున్న కేరళ యువతిపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. నల్లగండ్ల చెరువు దగ్గరకు తన ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన యువతిని.. గుర్తుతెలియని కొంతమంది యువకులు బెదిరించి.. రేప్ అటెంప్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. ఇటు సమాచారం అందుకున్న గచ్చీబౌలీ పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే అత్యాచార యత్నానికి పాల్పడ్డవారంతా.. భవన నిర్మాణ కార్మికులుగా అనుమానిస్తున్నారు. 
 

కీచక సీఐపై వేటు

Submitted by arun on Thu, 01/04/2018 - 11:14

విశాఖలో కీచక సీఐపై వేటు పడింది. త్రీటౌన్ సీఐ బెండు వెంకటరావు ఓ మహిళ పై లైగింగ దాడికి యత్నించడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఓ కేసులో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించిన మహిళ పై సీఐ వెంకటరావు అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత మహిళ సీపీ యోగానంద్ ను ఆశ్రయించింది. సీఐ తనతో వ్యవహరించిన తీరును సాక్ష్యాధారాలతో సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు  విచారణ చేపట్టిన  పోలీసులు ఆరోపణలో నిజమేనని తేలడంతో  సీఐను సస్పెండ్‌ చేశారు.