ramcharan

'రంగ‌స్థ‌లం' షూటింగ్ స్పాట్‌లో చిరు, రాజ‌మౌళి

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 14:56

'ధృవ' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'రంగ‌స్థ‌లం'. 1985 అనేది దీనికి ఉప‌శీర్షిక‌. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, ఆది పినిశెట్టి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లో జ‌రుగుతోంది.

రాజ‌మౌళి బాట‌లో సుకుమార్‌

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 12:04

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అంటే.. అది 'మ‌గ‌ధీర' సినిమానే. చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన రెండో సినిమా ఇది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా పాత రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది.'మ‌గ‌ధీర' త‌రువాత చ‌ర‌ణ్ కెరీర్‌లో విజ‌యాలైతే ఉన్నాయి కానీ.. అవి 'మ‌గ‌ధీర' స్థాయికి చాలా దూరంలోనే ఉన్నాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న 'రంగ‌స్థ‌లం'.. సెంటిమెంట్ ప్ర‌కారం 'మ‌గ‌ధీర' రేంజ్ హిట్‌ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు అంటున్నారు ప‌రిశీల‌కులు.

ర‌వితేజ‌తో మ‌రోసారి?

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 17:04

ఇక కాజ‌ల్ ప‌ని అయిపోంద‌నుకుంటున్న టైంలో.. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌.  ప్ర‌స్తుతం.. తెలుగులో త‌న తొలి క‌థానాయ‌కుడైన క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి 'ఎమ్మెల్యే' చిత్రంలో న‌టిస్తోందీ అమ్మ‌డు. అలాగే త‌మిళంలో 'క్వీన్' రీమేక్ లోనూ న‌టిస్తోంది.

స‌మంత‌.. ఆరు సినిమాల తర్వాత‌

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 15:00

క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మై ఏడేళ్ల‌యినా.. సమంత‌కున్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తెలుగునాట నెం.1 హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, త‌మిళ చిత్రాల‌తో క‌లుపుకుని మొత్తం ఏడు సినిమాల‌తో బిజీగా ఉందిప్పుడు. ఇదిలా ఉంటే.. త‌న కెరీర్ ప్రారంభంలో సోలో హీరోయిన్‌గానే ఎక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ గ‌త మూడేళ్లుగా ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది.