ramcharan

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

Submitted by arun on Tue, 11/06/2018 - 14:40

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మొదటగా ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అడ్వాణీ నటించింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించింగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు.

రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే!

Submitted by arun on Mon, 11/05/2018 - 16:08

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాలేదు. 'స్టేట్‌ రౌడీ' 'వినయ విధేయ రామ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. ఈనెల6న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృం‎దం ప్రకటించారు.

మామ డ్యూటి చేస్తున్న రామ్ చరణ్: ఉపాసన

Submitted by arun on Fri, 10/12/2018 - 12:46

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లో లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించాడు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా తెలిపారు. తన మేనకోడలితో చెర్రీ కేక్ కట్ చేయించే పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఉపాసన.. ‘మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేశారు.

గాలిలో ఎగురుతూ పవన్ కు విషెస్ చెప్పిన రామ్ చరణ్ !

Submitted by arun on Sun, 09/02/2018 - 13:57

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒళ్లుగగుర్బొడిచే విన్యాసాలు చేశాడు. గాల్లో పారాచూట్ విన్యాసాలు చేస్తూ బాబాయ్‌ని విష్ చేశారు. చెర్రీ సాహసోపేతమైన పారాగ్లైడింగ్‌ చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన చరణ్ తరుపున ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘ప్రియమైన బాబాయ్‌.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్‌ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా - రామ్‌ చరణ్‌’ అంటూ ట్వీట్ చేశారు.

రాజ‌మౌళి చిత్రంలో చ‌రణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లివే..!

Submitted by arun on Fri, 06/01/2018 - 15:14

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

మెగా హీరో వ‌ర్సెస్ నంద‌మూరి హీరో

Submitted by arun on Wed, 01/17/2018 - 15:15

టాలీవుడ్‌లో నంద‌మూరి హీరోల‌కు, మెగా హీరోల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు ఫ్యామిలీల‌కు చెందిన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఉండే హ‌డావిడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ రోజు థియేట‌ర్ల వ‌ద్ద ఆయా హీరోల అభిమానుల‌తో పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల హీరోలు న‌టించిన సినిమాలు ఒకేసారి థియేట‌ర్ల‌లోకి వ‌స్తే బాక్సాఫీస్ వార్ ఇంకెలా ఉంటుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కీర్తి సురేష్‌, స‌మంత‌కి ఒకేలా..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:59

2018 సంక్రాంతి క్రేజీ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, స‌మంత‌కి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్ర‌మైతే.. మ‌రొక‌టి త‌మిళ చిత్రం. కీర్తి న‌టిస్తున్న ఆ తెలుగు చిత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టిస్తున్న 25వ చిత్ర‌మైతే, త‌మిళ చిత్ర‌మేమో సూర్య న‌టిస్తున్న 'తానే సేరంద కూట్ట‌మ్‌'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీల‌కమైన సినిమాలే.

చ‌ర‌ణ్‌కి భ‌లే సూట‌య్యిందే

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 15:42

'ధృవ' విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 'ఎవ‌డు' త‌రువాత స‌రైన‌ హిట్ లేని చ‌ర‌ణ్‌కి ఈ సినిమా అందించిన విజ‌యం ప్ర‌త్యేక‌మైన‌ది కూడా. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ 'రంగ‌స్థలం' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సృజనాత్మ‌క ఆలోచ‌న‌ల‌కు పెట్టింది పేరైన సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు.

తెర‌పైకి చిరు చిన్న‌ల్లుడు?

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 15:23

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. చిరు త‌రువాత నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, వెంక‌ట్ రాహుల్ ('అలియాస్ జాన‌కి' ఫేమ్‌), సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్ తెలుగు తెర‌పై సంద‌డి చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మ‌రో పేరు చేరుతోంది. ఈ సారి చిరంజీవి చిన్న‌ల్లుడు, శ్రీజ భర్త క‌ళ్యాణ్ తెరంగేట్రం చేయ‌నున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తున్న వార్త‌.

'సైరా'.. రెగ్యుల‌ర్ షూటింగ్ అప్ప‌ట్నుంచే

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 11:49

'ఖైదీ నెం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు త‌న 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్నారు. 'సైరా న‌ర‌సింహారెడ్డి' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గ‌త నెల లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యింది. అలాగే చిరు పుట్టిన‌రోజున ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంతో వ‌చ్చిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల్ని అల‌రించింది.