social media

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/09/2018 - 16:09

తన అభిమానులకు షాకిచ్చింది నటి శ్రీరెడ్డి. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్ పదో తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 16మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా వార్తలొచ్చాయి. 

పవర్‌స్టార్‌ను బన్నీ అంత మాటన్నారా? ఎందుకు?

Submitted by arun on Thu, 06/07/2018 - 12:23

కెరీర్‌లో ఎద‌గ‌డానికి బ‌న్నీకి త‌నవంతు సపోర్ట్ అందించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అయితే కొన్నాళ్ళ క్రితం ఓ ఆడియో వేడుక‌లో ప‌వన్ గురించి మాట్లాడ‌మని అభిమానులు గోల చేయ‌గా, అప్పుడు నేను చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ మాట దాటేశాడు బ‌న్నీ . దీంతో అల్లు అర్జున్‌కి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ధ్య వైరం ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇటీవల ఫిలిం ఛాంబ‌ర్‌లో దీక్ష‌కి దిగిన ప‌వన్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ అక్క‌డికి రావ‌డంతో పాటు ఆయ‌న‌ని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు. దీంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది.

పెళ్ళి వార్త‌లపై స్పందించిన త్రిష‌

Submitted by arun on Wed, 05/30/2018 - 13:37

టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మళయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మన్ తో త్రిషకు ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. అతడ్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించు కుందని ఇందుకోసమే భారీ స్థాయిలో షాపింగ్ చేస్తోందని కూడా ప్రచారం జరిగింది. దీనిపై త్రిష తాజాగా స్పందించింది. కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. పెళ్లి ఆలోచ‌న నా మ‌న‌సులో ఇప్ప‌టి వ‌ర‌కు లేదు.

మంత్రి కేటీఆర్‌ సహాయానికి అభినందల వెల్లువ

Submitted by arun on Mon, 04/09/2018 - 15:54

ఆ చిన్నారికి పట్టుమని పదినెలలు కూడా నిండలేదు. ఇంతలోనే కంటికి కొండంత కష్టం. అండగా ఉంటుందనుకున్న ఆరోగ్య శ్రీ ఆదుకోలేదు. అనుకోకుండా తారసపడిన భరత్‌ అనే వ్యక్తి... ఆలోచన ఆ చిన్నారికి వచ్చిన కష్టాన్ని గట్టెక్కించింది. కార్పోరేట్‌ హాస్పిటల్‌లో కాసులు చెల్లించలేని ఆ నిరుపేద తల్లిదండ్రులకు మంత్రి కేటీఆర్‌ ఆపద్భందువయ్యాడు. ఏంటా చిన్నారి కథ..? ఎవరా భరత్‌..? మంత్రి చేసిన సహాయం ఏంటి..?

ఇతన్ని ప్రేమిస్తున్నా: నమ్రత

Submitted by arun on Thu, 04/05/2018 - 16:49

తన భర్త మహేశ్‌ బాబుపై ఉన్న ప్రేమను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉండగా... అతని ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన నమ్రత 'ఐ లవ్ దిస్ మేన్' అని పేర్కొంది. దీంతో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు.

న్యాయం కోసం ఫిలింనగర్‌లో నగ్నంగా నిలబడ‌తా

Submitted by lakshman on Thu, 04/05/2018 - 01:51

దర్శకుడు శేఖర్ కమ్ములతో వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
  టాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. అందుకే నేను వాటిని లీక్ చేస్తున్నాను. మీడియా సాక్ష్యంగా నేను అన్ని విషయాలు బయటపెడుతా. నా వద్ద కొన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కొన్నింటికి ఆధారాలు లేవు.

సోషల్ మీడియా ద్వారా రక్షణ: మహిళా అధికారుల నియామకం

Submitted by lakshman on Mon, 04/02/2018 - 00:00

ముంబై పోలీసులు 8 మంది మహిళ అధికారులను ఆయా పోలిస్ స్టేషన్‌లకు ఇంచార్జీలుగా నియమించారు. ఈ 8 మంది మహిళా అధికారులు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. అంతేకాదు శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. మహిళ పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తాము ప్రమాదంలో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు అవసరమైన జాగ్రత్తలను కూడ సోషల్ మీడియా ద్వారా బాధితులకు చేరవేస్తారు.

వీడియో: మహిళా డాన్సర్‌తో చిందులేసిన ఆర్జేడీ నేత

Submitted by arun on Mon, 03/19/2018 - 12:19

రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) నేత ఓ మహిళా డ్యాన్సర్‌తో చిందులేయడం వివాదాస్పదంగా మారింది. మహిళా డాన్సర్‌తో చిందులేస్తూ ఆర్జేడీ నేత అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆర్‌జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్‌ డ్యాన్సర్‌ డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు. ఈ నెల మార్చి 10 న బీహార్ గోపాల్గంజ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుకలో  రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

త‌ప్పుడు పోస్టులు పెడితే జైలుకు పంపిస్తా

Submitted by arun on Sat, 03/10/2018 - 11:55

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను టీఆర్ఎస్ లోనే పుట్టానని చివరి వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు తెలిపారు.