samantha

రంగ‌స్థ‌లం 3 రోజుల కలెక్షన్ ఎంతంటే

Submitted by lakshman on Mon, 04/02/2018 - 22:55

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవుటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి.

ఏనిమిదేళ్ల ప్రేమ‌కి థ్యాంక్స్

Submitted by lakshman on Sun, 04/01/2018 - 23:34

సమంత - నాగ చైతన్య ప్రస్తుతం యూఎస్ఏలో వెకేషన్ గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్టు చేసిన ఓ సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. తన భర్త చైతన్యతో కలిసి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌‌లో సెల్ఫీ దిగిన ఆమె అభిమానులకు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాకు సెల్ఫీలు దిగడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దిగాల్సి వచ్చింది. ఈ సెంట్రల్ పార్క్‌లోనే 8 ఏళ్ల క్రితం మా మధ్య ప్రేమ మొదలైంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని మా నమ్మకం. అందుకే ఈ ప్లేసుకు థాంక్స్ చెప్పుకోవడానికే తిరిగి ఇక్కడకు వచ్చాము... అని సమంత తెలిపారు.

రాజ‌మండ్రిలో ‘యు టర్న్’ తీసుకున్న సామ్

Submitted by lakshman on Sun, 02/18/2018 - 14:45

సినిమాల్లో పీహెచ్ డీ  చేసిన స‌మంత రాజ‌మండ్రిలో యూట‌ర్న్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన సామ్ టాప్ హీరోల‌తో 
 వ‌రుస సినిమాల‌తో హిట్లు కొట్టింది. కానీ తాను ఎన్ని బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టినా త‌న‌కు ఓ చిరకాల కోరిక ఉన్న‌ట్లు మీడియాకు చెప్పింది.   సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ‘యు టర్న్’ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ క్యార‌క్ట‌ర్ చేయాల‌ని ఆశ‌గా ఉందంటూ చెప్పుకొచ్చింది. 

'రంగ‌స్థ‌లం' రామ‌ల‌క్ష్మి వ‌చ్చేసింది

Submitted by arun on Fri, 02/09/2018 - 12:08

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రామ‌ల‌క్ష్మి పాత్ర చేస్తున్న స‌మంత‌కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ పిల్లెదురు వ‌స్తుంటే మా ఊరికి 18సం. వ‌య‌స్సు వ‌చ్చిన‌ట్టుంట‌దండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామ‌ల‌క్ష్మేనండి అంటూ చ‌ర‌ణ్ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతుండ‌గా, ఎంతో ఇంప్రెసివ్‌గా ఉన్న లుక్స్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

రామలక్ష్మి గా రాబోతున్న సమంత

Submitted by arun on Fri, 02/09/2018 - 10:30

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సమంత పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ‘మా రామలక్ష్మిని శుక్రవారం 11 గంటలకు కలవండి’ అంటూ ఓ పోస్టర్‌ని అభిమానులతో షేర్ చేసింది యూనిట్. కాగా ఈ విషయాన్ని మన సమంత మళ్ళీ గుర్తుచేసేందుకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టింది. 

హీరోయిన్ సమంత చేతికి ఏమైంది? ఎందుకు కట్టు కట్టుకుంది?

Submitted by arun on Wed, 01/31/2018 - 11:42

'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె చేతికి ఏమైందో అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే...కొన్ని కీలకమైన సీన్స్‌తో పాటు రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రీసెంట్‌గా కంప్లీట్‌ అయిన రాజమండ్రి షెడ్యూల్‌లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న సమంతకు ఓ రోజు హెవీ వర్క్‌ వల్ల కాస్త చెయ్యి నొప్పి అనిపించిందట. అందుకనే ఆమె కట్టు కట్టించుకున్నారు. ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూశారుగా.. అందులో ఉన్నది సమంత హ్యాండే.

సమంత ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందా..?

Submitted by lakshman on Tue, 01/30/2018 - 14:21

2019 ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల‌కోసం అన్వేష‌ణ ప్రారంభించాయి. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ క‌న్ను సింకిద్రాబాద్ ఎమ్మెల్యే స్థానం పై ప‌డిన‌ట్లు టాక్. అక్క‌డ  క్రిస్టియన్ సామాజిక వ‌ర్గం దే పై చేయి. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి క‌న్వెర్ట‌డ్ క్రిస్టియ‌న్ గా ఉన్న జ‌య‌సుధ‌తో పోటీ చేయించి విజ‌యం సాధించింది. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ అదే ఎత్తుగ‌డ‌తో పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది. 

మెడ‌పై క‌త్తిపెట్టి షాకిచ్చిన స‌మంత

Submitted by arun on Thu, 01/04/2018 - 15:53

అక్కినేని స‌మంత క‌త్తిప‌ట్టుకొని పీక‌ను కోసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నాలు వ‌ర్కౌట్ అవుతాయో లేదో ఏప్రిల్ 27న వ‌ర‌కు ఆగాల్సిందే. ఓ వైపు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా దూసుకుపోతున్న స‌మంత మూసదోరిణిలా కాకుండా సినిమాల్లో కొత్త‌ద‌నం కోరుకుంటుంది. అందుకే కాబోలు సూప‌ర్ డీల‌క్స్ అనే ప్ర‌యోగాత్మ‌క‌మైన సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో స‌మంత క్యార‌క్ట‌ర్ ఇలా ఉండ‌బోతుందంటూ టీజ‌ర్ ను విడుద‌ల చేసి షాకిచ్చింది చిత్ర‌యూనిట్.

అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.

నాలుగేళ్ల 'అత్తారింటికి దారేది'

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 11:08

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే అత్తారింటికి దారేది చిత్రం'. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా.. అత‌ని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే టైటిల్ పెట్ట‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుద‌ల‌కి ముందు లీక‌యినా.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించడం అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాలో కంటెంట్ బ‌లంగా ఉంటే..