keerthi suresh

వరద బాధితులకు కీర్తిసురేశ్ భారీ సాయం

Submitted by arun on Tue, 08/21/2018 - 10:19

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. కాగా ‘మహానటి’ సినిమాతో భారీ సక్సెస్‌ని అందుకున్న మళయాలీ భామ కీర్తీ సురేష్ కేరళ బాధితులకు భారీ సాయాన్ని అందజేసింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.10 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్, బట్టలు, నిత్యావసర వస్తువులు, మందుల కోసం మరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది.
 

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్

Submitted by arun on Wed, 01/03/2018 - 15:48

టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సన్ గ్రూప్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, ఇతర కథానాయికలకు కీర్తి సురేశ్ గట్టిపోటీనే ఇస్తోందని చెప్పాలి.     

కీర్తి సురేష్‌, స‌మంత‌కి ఒకేలా..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:59

2018 సంక్రాంతి క్రేజీ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, స‌మంత‌కి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్ర‌మైతే.. మ‌రొక‌టి త‌మిళ చిత్రం. కీర్తి న‌టిస్తున్న ఆ తెలుగు చిత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టిస్తున్న 25వ చిత్ర‌మైతే, త‌మిళ చిత్ర‌మేమో సూర్య న‌టిస్తున్న 'తానే సేరంద కూట్ట‌మ్‌'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీల‌కమైన సినిమాలే.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ @ 10

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 13:24

నేచుర‌ల్ స్టార్ నానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌ను సొంతం చేసుకుని 'డబుల్ హ్యాట్రిక్ హీరో' అనే పేరు కూడా సంపాదించేశాడు. ప్ర‌స్తుతం నాని 'ఎం.సి.ఎ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు.

విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ కేర‌ళ కుట్టిలే హీరోయిన్‌గా న‌టించ‌డం. 'ఎం.సి.ఎ'లో 'ఫిదా' ఫేమ్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. 'కృష్ణార్జున యుద్ధం'లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రూ కూడా మ‌ల‌యాళ చిత్రం 'ప్రేమ‌మ్‌'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌లే కావ‌డం విశేషం.  

రెండు సీక్వెల్స్‌లో కీర్తి సురేష్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 13:31

టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా రెండు చోట్లా బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో కీర్తి సురేష్‌ ఒక‌రు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆమె న‌టించిన మూడో తెలుగు చిత్రం సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఆ చిత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం.

విశాల్ 25వ చిత్రంగా 'సండ కోళి2'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 12:23

13 ఏళ్ల క్రితం విడుద‌లైన 'చెల్ల‌మే' (తెలుగులో 'ప్రేమ చ‌ద‌రంగం')తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు విశాల్‌. రెండో చిత్ర‌మైన 'సండ కోళి' (పందెం కోడి)తో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న విశాల్‌.. ఇప్పుడు త‌న 25వ చిత్రంగా ఆ సినిమాకి సీక్వెల్ అయిన 'సండ కోళి 2' చేస్తున్నాడు. ఇవాళే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

 ఈ సంక్రాంతికి రెండు సినిమాలు

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 18:02

'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రంతో పాటు 'మ‌హాన‌టి'లో మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో న‌టిస్తూ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ‌. అంతేకాకుండా.. త‌మిళంలోనూ సినిమాలు చేస్తున్న కీర్తి ప్ర‌స్తుతం అక్క‌డి అగ్ర‌క‌థానాయ‌కుల్లో ఒక‌రైన సూర్య‌తో క‌లిసి 'తాన సేరండ్ర కూట్ట‌మ్' అనే సినిమాలో న‌టిస్తోంది.

17 ఏళ్ల త‌రువాత‌..

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 17:15

రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే త‌మిళ‌ క‌థానాయ‌కుడు సూర్య‌. అందుకే.. 20 ఏళ్ల త‌న సినీ ప్ర‌యాణంలో 40 చిత్రాలే చేశాడు. వీటిలో దాదాపు ప‌ది సినిమాల్లో అతిథి పాత్ర‌ల్లో మెరిసాడు. ప్ర‌స్తుతం 'తాన సేరండ్ర కూట్ట‌మ్' అనే త‌మిళ సినిమాలో చేస్తున్నాడు సూర్య‌. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని మొద‌ట అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే అదే నెల‌లో సూర్య త‌మ్ముడు కార్తీ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం 'ఖాకీ' (త‌మిళంలో 'తీర‌న్ అధికారం ఒండ్రు')ని విడుద‌ల చేయ‌నున్నారు.

'మ‌హాన‌టి'లో మోహ‌న్‌బాబు?

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 15:22

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం'తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలినీ పాండే, దుల్క‌ర్ స‌ల్మాన్‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు పాత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎస్వీఆర్ లాగే విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన మోహ‌న్‌బాబు..

ప‌వ‌న్‌..మ‌ళ్లీ అలాగే!

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 14:46

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌ర‌వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ప‌వ‌న్‌కిది 25వ చిత్రం కావ‌డంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మ‌రింత ఎక్కువ‌గానే ఉంది.