attack

మేం ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ స్థాయిలో ప్లాన్‌ చేసేవాళ్లం

Submitted by arun on Fri, 10/26/2018 - 14:39

జగన్‌పై దాడి ఘటనపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. పిల్ల కుంకను పంపి.. హత్యకు ప్లాన్‌ చేస్తామా అని అన్నారు. ఏదైనా చెయ్యాలనుకుంటే చేతిపై గుచ్చి రమ్మని పిల్లాడిని పంపుతామా అని ప్రశ్నించారు. మేం హత్యకు ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ స్థాయిలో ఉంటుందని.. వైసీపీ ఇకనైనా డ్రామాలు ఆపాలని అన్నారు. 
 

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన హిజ్రాలు...

Submitted by arun on Wed, 08/08/2018 - 17:50

హైదరాబాద్‌లో హిజ్రాలు రెచ్చిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్.. నార్సింగి పోలీస్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్గురోడ్డు సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది..డబ్బులు అడిగితే ఇవ్వనందుకు వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. హిజ్రాల దాడి నుంచి బాధితుడు పారిపోయేందుకు ప్రయత్నించిగా.. పట్టుకుని దాడి చేశారు. కాళ్లతో తన్నడమే కాకుండా చెప్పులతో చితకబాదారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రేమజంటపై జవాన్ దాడి...అత్యాచారయత్నం

Submitted by arun on Wed, 07/25/2018 - 16:32

హైదరాబాద్‌లో ఓ జవాను ప్రేమ జంటపై దాడి చేశాడు. అంతేకాదు యువతిపై అత్యాచార యత్నం చేశాడు. హైదరాబాద్ అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మొన్న సాయంత్రం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఓ ప్రేమ జంట అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన జవాన్ ఆ యువకుడిపై దాడి చేశాడు. దీంతో అతను పారిపోగా యువతిపై అత్యాచార యత్నం చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడే గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ బాధితురాలి అరుపులు విని అక్కడికి వచ్చాడు. జవానుని పట్టుకోబోగా అతను కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయే యత్నంచేశాడు.

పనిమనిషిని అంత దారుణంగా..

Submitted by arun on Sat, 06/30/2018 - 14:24

తనకు ఎన్నో ఏళ్లుగా ఉపాధిని కల్పిస్తూ.. కష్టాల్లో తోడుగా ఉన్న యజమాని పట్ల విశ్వాసం చూపిన ఓ పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంటి యజమాని కొడుకు, కోడలు.. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తన కొడుకు-కోడలితో కలిసి నివసించేది. అయితే కోడలితో అత్తకి ఎప్పుడూ పడేది కాదు. మద్ధతుగా ఉండాల్సిన కొడుకు కూడా కోడలికే వంత పడటంతో ఆ జంటను ఇంటి నుంచి పంపించేసింది ఆ మహిళ..ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది. కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు.

Four men slit transgender's throat

Submitted by admin on Sun, 09/10/2017 - 19:48
  • హైద్రాబాద్‌లో దారుణం.. కోరిక తీర్చలేదని హిజ్రా గొంతు కోశాడు

హైదరాబాద్‌ః భాగ్యనగరంలో దారుణం జరిగింది. తన ఇంటికి పొరుగున నివాసముంటున్న హిజ్రాను కోరిక తీర్చమంటూ ఓ వ్యక్తి బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో గొంతు కోసి దాడి చేశాడు. నగరంలోని బంజారాహిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో సంగీత(పేరు మార్చాం) అనే 21 ఏళ్ల హిజ్రా నివాసముంటోంది. స్థానికంగా ఉండే కొందరు యువకులు ఆమెను పలు విధాలుగా దూషిస్తూ.. వేధించేవారు. ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కుని వెళ్లేవారు.