Jr NTR

రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..ఫోటో వైరల్!

Submitted by arun on Mon, 06/18/2018 - 12:33

గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఖాతా తెరిచిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఉన్న ఫోటో షేర్ చేశాడు.  ఈ ఫోటోకి మంచి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. 

జూనియర్ ఎన్టీఆర్ రెండో కుమారుడి.. ఫొటో చూడండి!

Submitted by arun on Fri, 06/15/2018 - 16:42

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు మరో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని... తన కుటుంబం మరింత పెద్దదయిందని చెప్పాడు. 2011లో ఎన్టీఆర్ దంపతులకు తొలి కుమారుడు జన్మించాడు. అతని పేరు అభయ్. ఇప్పుడు రెండో కుమారుడు పుట్టడంతో ఎన్టీఆర్ బంధుమిత్రులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాజాగా ఎన్టీఆర్ రెండో కుమారుడి ఫొటో వెలుగు చూసింది. ముద్దులొలుకుతున్న చిన్నారిని మీరూ చూడండి. 

రెండోసారి తండ్రైన ఎన్టీఆర్‌

Submitted by arun on Thu, 06/14/2018 - 14:10

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్ర‌ణ‌తి కొద్ది సేప‌టి క్రితం పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్రణతి, ఎన్టీఆర్ దంపతులకి ఇప్పటికే అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, మ‌రోసారి వారికి కుమారుడే పుట్టాడు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఎన్టీఆర్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్‌ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక సోదరుడు హీరో కల్యాణ్ రామ్‌ ఎన్టీఆర్‌కు విషెస్ తెలియజేశారు. 

అభయ్‌ని ఎవరూ కాపాడలేరు: ఎన్టీఆర్

Submitted by arun on Sat, 06/09/2018 - 17:33

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకి సంబంధించిన కొన్ని విషయాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఎన్టీఆర్‌కు తన కుమారుడు అభయ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అభయ్‌ ఫొటోలను, ఇతర విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు ఎన్టీఆర్‌. తాజాగా ఆయన అభయ్‌కుసంబంధించిన ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్‌ని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం’ అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. అభయ్‌ పాలు తాగుతున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు ఎన్టీఆర్‌.  దీనికి ప్రతిగా హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ స్పందిస్తూ..

ఎన్టీఆర్‌కు సవాల్‌ విసిరిన మోహన్‌లాల్ ‌!

Submitted by arun on Thu, 05/31/2018 - 17:02

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్యకు సవాలు విసిరారు. ఇటీవల కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి ఎక్సర్‌సైజ్‌లు చేసి తమ సన్నిహితులకు సవాలు విసిరారు. తాజాగా మోహన్ లాల్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తాను రాథోడ్ ఫిట్‌నెస్ సవాలును స్వీకరించానని..

బిగ్ బాస్ 2లో పార్టిసిపెంట్స్ లిస్ట్ ఇదే..!

Submitted by arun on Thu, 05/31/2018 - 12:45

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్‌' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనుండగా, 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటెస్టంట్స్‌కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్.

ఎన్టీఆర్ టీడీపీలోనే ఉండాలి: నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 03/31/2018 - 17:34

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వార్తల్లో నిలిచిన హీరోయిన్ మాధవీలత... మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జానాలకు మంచి చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పింది. అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తెలిపింది. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆపడని, ధారాళంగా మాట్లాడుతూనే ఉంటాడని మాధవి కితాబిచ్చారు.

ఎన్టీఆర్ తో.. పూజా హెగ్డే.. తకధిమితోం!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:45

డీజే సినిమాలో గ్లామర్ తో అభిమానులను అల్లాడించిన అందాల భామ పూజా హెగ్డే.. ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ వారు.. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు.

‘తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్’

Submitted by arun on Thu, 03/01/2018 - 12:46

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉంది. ఆయన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఇకపోతే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఉన్నారు. అయితే, ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడుగా యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చేయాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదీ కూడా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే.

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది

Submitted by arun on Thu, 02/22/2018 - 14:15

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్. ఇండస్ట్రీలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. కాని కాని ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అంతా తారుమారైంది. దీంతో తారక్ తో చేసే సినిమాలో కాస్టింగ్ స్టోరీ ఇలా ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్. వీటికి దర్శకధీరుడు రాజమౌళి టెన్షన్ పెడుతున్నాడు. ఇన్ని రకాల టెన్సన్స్ తో తారక్ సినిమా త్రివిక్రమ్ కిఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లవుతోంది.