arun jaitley

విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు...ఇంగ్లండ్ వెళ్లే ముందు అరుణ్ జైట్లీని...

Submitted by arun on Thu, 09/13/2018 - 11:54

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని చెప్పారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడుతూ మాల్యా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ రావడానికి ముందు ఆర్థిక మంత్రి జైట్లీని చాలాసార్లు కలిశానని, బ్యాంకు రుణాల చెల్లింపుకు సంబంధించిన అనేక ఆఫర్లు ఇచ్చానని తెలిపారు. అయితే మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆ వివరాలను తాను ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు.

మళ్లీ ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టునున్న అరుణ్ జైట్లీ...  

Submitted by arun on Fri, 08/03/2018 - 12:23

కొంత విరామం తర్వాత కేంద్రమంత్రి గా ఉన్న అరుణ్ జైట్లీ మళ్లీ ఆర్థిక శాఖ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోనున్నారు. ఆగస్టు రెండో వారంలో జైట్లీ విధుల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానిమోదీ కేబినేట్ లో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు.  కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న జైట్లీని మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై సంచలన ప్రకటన

Submitted by arun on Wed, 07/04/2018 - 13:16

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టమైంది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఏపీకి ఇచ్చేశామని, ఇక ఇచ్చేదేమీ లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ అధికారికంగా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం గమనించాల్సిన విషయం.

జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమాపణలు

Submitted by arun on Mon, 04/02/2018 - 17:29

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో జైట్లీ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై అరుణ్‌జైట్లీ కోర్టు పరువునష్టం దావా వేయడంతో...కేజ్రీవాల్‌ ఎక్కువ కాలం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఢిల్లీ సీఎం...అరుణ్‌జైట్లీకి సారి చెబుతూ లేఖ రాశారు.

అరుణ్ జైట్లీ - సుజ‌నా చౌద‌రి భేటీలో నిజం లేదంట‌

Submitted by lakshman on Sat, 03/24/2018 - 16:13

కేంద్ర  ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టీని ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి క‌ల‌వ‌లేదంటూ సీఎం ర‌మేష్ వివ‌రణిచ్చారు. జైట్లీ - సుజ‌నా క‌లిశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. 
దిగ‌జారుడు రాజ‌కీయానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తుందంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ఓ వైపు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఏపీలో ఒక‌లా, పార్ల‌మెంట్ లో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌నిపించేలా టీడీపీ - బీజేపీతో లాలూచి ప‌డిన‌ట్లు స‌మాచారం. 

ప్ర‌త్యేక‌హోదా..ఏపీ ప్ర‌భుత్వంపై బాంబు పేల్చిన జైట్లీ

Submitted by lakshman on Sun, 03/18/2018 - 09:47

ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌న రూటును మార్చుకుంద‌ని  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. 14వ ఆర్ధిక సంఘం సూచ‌న‌ల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జైట్లీ స్ప‌ష్టం చేశారు. కానీ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. 

కేంద్రంపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

Submitted by lakshman on Tue, 03/13/2018 - 18:05

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి చ‌ర్చించారు. నాడు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్రతిప‌క్షంలో బీజేపీ ఎన్నో హామీల్ని ఇచ్చింద‌ని, ఆ హామీల్లో ఎన్ని నెర‌వేర్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వలేమ‌ని చెప్పిన కేంద్ర ఆర్ధిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న‌పై తూర్పార‌బ‌ట్టారు. 

ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి ఈ-వే బిల్లు

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:53

ఏప్రిల్ 1 నుంచి ఎల‌క్ట్రానిక్ -వే బిల్లును త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. దీంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలపాటు  పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్‌–3బీ, జీఎస్టీఆర్‌–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని  భావించామన్నారు.  

జీఎస్‌టీ మండలి స‌మావేశం.. కీల‌క నిర్ణ‌యం..

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:37

ఢిల్లీలో 26వ జీఎస్టీ మండలి స‌మావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అథ్య‌క్ష‌త‌న‌ జ‌రిగింది. జీఎస్టీ రిట‌ర్న్ ల స‌ర‌ళీక‌ర‌ణపై ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. అందుకే ఈ అంశంపై మ‌రో స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. మూడు నెల‌ల పాటు జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 

బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ

Submitted by arun on Wed, 03/07/2018 - 18:18

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణవారు విభజన కోరుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయన్నారు.