Trivikram Srinivas

టీజ‌ర్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్

Submitted by arun on Wed, 08/15/2018 - 10:32

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘అర‌వింద స‌మేత‌’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.

పవన్ తో పెరిగిన దూరం పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు !

Submitted by arun on Mon, 05/28/2018 - 11:22

అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ‘అజ్ఞాతవాసి’ తరువాత తమ మధ్య దూరం పెరిగింది అని వస్తున్న వార్తల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన దర్శకుడుని కౌగలించుకుని ముద్దులు పెట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చే సంస్కృతి పవన్ కు లేదని అదేవిధంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ దర్శకుడుని తక్కువగా చూస్తూ పవన్ దూరం పెట్టడని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు త్రివిక్రమ్. 

‘పంజాగుట్ట’ రూమ్‌లో త్రివిక్రమ్

Submitted by arun on Thu, 02/01/2018 - 11:55

చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి .. రచయితగా నిలదొక్కుకునే రోజుల్లో త్రివిక్రమ్ పంజాగుట్టలోని ఒక రూమ్ లో ఉండేవారు. ఈ రూమ్ లో కూర్చునే ఆయన రెడీ చేసిన కథలకు .. అందించిన మాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సెంటిమెంట్ తోనే ఆ రూమ్ కి అప్పటి నుంచి ఆయన రెంట్ కట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే కూర్చుని ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.

మ‌ర‌క‌ మంచిదే

Submitted by lakshman on Mon, 01/29/2018 - 23:52

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న‌పై ప‌డ్డ మ‌ర‌కను తుడిపేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్  త‌న మాట‌ల‌తో మ‌నసును హ‌త్తుకునే మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ తో  ప‌క్క సినిమాలు, న‌వ‌ల‌ల్ని కాపి చేసి సినిమాలు తీస్తాడ‌నే అప‌వాదు ఉంది. అయినా త్రివిక్ర‌మ్ మాత్రం ఖండించే ప్ర‌య‌త్నం చేయలేదు. నాటి అ..ఆ నుంచి నేటి  అజ్ఞాతవాసి కాపీ కొట్టిన స్టోరీనేని అర్ధం చేసుకోవ‌చ్చు. ఏం కాపీ కొట్టిన , ఎవ‌రు ఏం అనుకున్నా ప‌ట్టించుకోని మాట‌ల‌మాంత్రికుడిపై  అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో కాపీ విష‌యం లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు ఫిల్మిన‌గ‌ర్ వ‌ర్గాల టాక్. 

త్రివిక్రమ్,దేవిశ్రీ మధ్య మనస్పర్ధాలు..దేవిశ్రీకి పోటీగా రంగంలోకి అనిరుద్

Submitted by arun on Wed, 01/17/2018 - 13:22

పైకి కనిపించడంలేదు కానీ..దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తోంది. హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న వీళ్లద్దరు ఇప్పుడు విరోదులుగా మారిపోయారు. పంతం నీదా నాదా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ది హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ సినిమా అంటే అందులో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవినే అనే అంతలా ముద్ర పడింది. కానీ వీళ్ల బంధానికి మధ్యలోనే బ్రేక్ పడింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలో ఇద్దరికి మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ దేవిశ్రీని పక్కన పెట్టాశాడు.

చిక్కుల్లోపడ్డ బోయపాటి, త్రివిక్రమ్

Submitted by arun on Fri, 01/05/2018 - 12:31

బోయపాటి శ్రీను..త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఎన్టీఆర్..రామ్ చరణ‌్ సినిమాలు ఒఫ్పుకోవడంతో ఊహించని ఒత్తిడిని ఫేస్ చేయనున్నారు. దాదాపు మెడ మీద కత్తపెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఈ ఇద్దరు డైరెక్టర్లకు వచ్చిపడింది. డైడ్ లైన్ గంటను మెడకుకట్టుకుని మరీ తర్వాత ప్రాజెక్టుకు వర్కచేయాల్సిన పరిస్థితిలో పడ్డారు. బోయపాటి..త్రివిక్రమ్ ను తిప్పలు పెడుతోంది కూడా ఒక డెరెక్టర్ కావడం విశేషం. 

పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు..

Submitted by arun on Tue, 01/02/2018 - 15:44

అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు. మోహాం చూపించడమే బంగారమైంది. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. ఐనా ఇంతకు ప్రమోషన్స్ మొదలెట్టలేదు. ఏమో ఓ సాంగ్ ను ప్రేక్షకుల మీదకి వదిలి చేతులు దులుపుకున్నాడు.