mahesh babu

భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:18

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. గురువారమే అమెరికాలో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇండియాలో విడుదలకు ముందు రోజే అక్కడ 2000 షోలు ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో తొలి రోజే భరత్‌ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత మహేశ్ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు వచ్చినట్టు టాక్. కాగా మొదటి రోజున భరత్ అనే నేను 58 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది .

‘భరత్ అనే నేను’పై కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 13:03

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా..హై ఎక్స్ పెక్సేషన్స్ తోనే రిలీజవుతుంది. కానీ భరత్ అనే నేను సినిమా మాత్రం ఇంకాస్త ప్రత్యేకం. అందుకే ఈ సినిమా మహేశ్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో సందడి చేస్తోంది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ మరింత జోష్‌లో ఉన్నారు.

‘భరత్ అనే నేను’ ఆడియన్స్ రివ్యూ...బ్లాక్ బస్టర్ హిట్!

Submitted by arun on Fri, 04/20/2018 - 10:57

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 20న (ఈరోజు) థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీజర్, ట్రైలర్స్ అదిరిపోవడంతో పాజిటివ్ బజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌కి పైగా విడుదలైన ఈ మూవీ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ యూఎస్ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఇరగదీశాడని.. ఫస్టాఫ్‌, సెకండాఫ్ అని కాకుండా ఓవరాల్‌గా ‘భరత్ అనే నేను’ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వరుస ట్వీట్లు వస్తున్నాయి.

‘భరత్‌ అనే నేను’ రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 10:49

చిత్రం: భరత్‌ అనే నేను 
నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్‌.. శరత్‌కుమార్‌.. రమాప్రభ.. దేవరాజ్‌.. ఆమని.. సితార.. పోసాని కృష్ణమురళి.. రవిశంకర్‌.. జీవా.. యశ్‌పాల్‌ శర్మ.. రావు రమేష్‌.. అజయ్‌.. బ్రహ్మాజీ తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్‌, తిరు 
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌ 
కళ: సురేష్‌ సెల్వరాజన్‌ 
సాహిత్యం: రామ జోగయ్యశాస్త్రి 
నిర్మాత: డీవీవీ దానయ్య 
దర్శకత్వం: కొరటాల శివ 
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
విడుదల తేదీ:20-04-2018

రిలీజ్‌కు ముందే రికార్డు

Submitted by arun on Mon, 04/16/2018 - 15:32

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘ భరత్ అనే నేను ‘ విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో లను ప్రదర్శించ నున్నట్టు ఈ మూవీ యూనిట్ తెలిపింది. అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్య కన్నా ఎక్కువ థియేటర్లలో ” భరత్ అనే నేను ” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది.

మహేష్ బాబుపై మాధవీలత హాట్ కామెంట్ !

Submitted by arun on Sat, 04/14/2018 - 12:27

నటి శ్రీరెడ్డి వ్యవహారం తరువాత అనేకమంది హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకు జరుగుతున్న అన్యాయాలు గురించి అదేవిధంగా తాము ఎదుర్కుంటున్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఈనేపధ్యంలో హీరోయిన్ మాధవీలత నిన్న ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొంటూ తమ పై జరుగుతున్న అన్యాయాలను టాప్ హీరోలు ఎందుకు పట్టించుకోలేదు అంటూ ప్రశ్నలు కురిపించింది. మన హీరోలు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించరో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని మాధవీలత వాపోయారు.  దాదాపు పదేళ్లక్రితం తనకు స్వయంగా జరిగిన ఒక తీవ్ర అవమానాన్ని ఏకరువుపెట్టారు.

కత్తి మహేష్ పై నిప్పులు చెరుగుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!

Submitted by arun on Mon, 04/09/2018 - 12:50

ఇటీవల పవన్ కల్యాణ్ అభిమానులకు, క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరిగిన వివాదం ఏమిటో అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ ట్వీట్స్ చేయడం, వాటికి కత్తిని బెదిరిస్తూ పవన్ అభిమానులు ఫోన్లు చేయడం వంటి ఎపిసోడ్.. సుమారు 2 నెలలపాటు నడిచింది. ఆ తర్వాత అభిమానులకు, కత్తి మహేష్‌కు మధ్య కొన్ని చర్చలు జరగడంతో.. అప్పటి నుంచి కత్తి మహేష్.. పవన్ కల్యాణ్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయడం తగ్గించాడు. పొలిటికల్‌గా ప్రతి రోజు పవన్ నామస్మరణ ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నాడు.

ఇతన్ని ప్రేమిస్తున్నా: నమ్రత

Submitted by arun on Thu, 04/05/2018 - 16:49

తన భర్త మహేశ్‌ బాబుపై ఉన్న ప్రేమను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉండగా... అతని ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన నమ్రత 'ఐ లవ్ దిస్ మేన్' అని పేర్కొంది. దీంతో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు.

భ‌ర‌త్ అనే నేను' ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

Submitted by arun on Sun, 03/25/2018 - 11:18

సూపర్ స్టార్  మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న  భరత్ అనే నేను సినిమాలో తొలిపాట విడుదలైంది.  ఏప్రిల్ 20న విడుదలవుతున్న ఈ మూవీ  ప్రమోషన్ పై చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియో, టీజర్ ని విడుదల చేసి ప్రేకక్షల్ని ఆట్రాక్ట్ చేశారు. ఇఫ్పుడు  దేవి శ్రీ స‌మ‌కూర్చిన తొలి బాణీ విడుద‌లైంది. ఈ సాంగ్ మ‌హేష్ ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుత విద్యా విధానం..

న‌ట‌న ప‌రంగా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతా

Submitted by lakshman on Thu, 03/15/2018 - 08:25

టాలీవుడ్ ప్రిన్స్.. యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే.. సౌత్ ఇండియాలోనే కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ ఉంది. కొందరు బాలీవుడ్ హీరోయిన్లు కూడా మనోడితో స్టెప్పులేసేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి హీరోతో ఇప్పటివరకూ నటించే అవకాశాన్ని పొందలేదు కానీ.. మహేష్ ను ఫాలో అవుతున్న హీరోయిన్ ఒకరున్నారు. ఆమే.. అనుపమా పరమేశ్వరన్.