Assam

అతి ఎక్కువగా వరదలు!

Submitted by arun on Thu, 11/15/2018 - 15:35

భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదో మీకు తెలుసా!  అతి ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం. కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క ఆధారం అని  భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి కొంత బలాన్ని ఇస్తున్నాయి...శ్రీ.కో.

నదిని ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు.. వీడియో

Submitted by arun on Fri, 09/28/2018 - 13:16

మనసుంటే మార్గముంటుందని ఎలాంటి అవరోధాన్నైనా అవలీలగా అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు సోటియా గ్రామానికి చెందిన విద్యార్ధులు.  వీరంతా ప్రతి రోజు దగ్గర్లోని పాఠశాలకు వెళ్లంటే గైలడరి నదిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. అక్కడ వంతెన నిర్మించకపోవడంతో చిన్న చిన్న వంట పాత్రల సహాయంతో ఈదుకుంటూ అవతలకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా వాటి సహాయంతోనే ఇళ్లకు చేరుతున్నారు. 

ఏటీఎంలో ఎలుకలు పడ్డాయ్.!

Submitted by arun on Tue, 06/19/2018 - 11:52

ఏటీఎంల నుంచి  జనాలకు డబ్బు రాకపోయినా ఎలుకలకు మాత్రం మేత బాగా దొరుకుతోంది. ఎటీఎంలలో ఉంచిన నగదును ఎలుకలు చిత్తు కాగితాలుగా కొరికి వేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టిన్సుకియా లైపులిలోని ఓ ఏటీఎంలో 12 లక్షల రూపాయలను ఎలుక తినేసింది. గత నెల 20 నుంచి అవుట్ ఆఫ్‌ ఆర్డర్‌లో ఉన్న ఈ ఏటీఎమ్‌ను బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఏటీఎంలోకి చొరబడిన ఎలుక అందులో ఉన్న నోట్లను తినేసింది. నాలుగు రోజుల క్రితం ఏటీఎం రిపేరు చేసేందుకు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని ఖంగుతున్నారు. ఎలుకలు తిన్న  వాటిలో 500, రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Tags

కన్నకూతురిపై అత్యాచారం..కోర్టులోనే భార్య హత్య

Submitted by arun on Sat, 06/16/2018 - 15:50

కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ మానవమృగం... తన భార్యను కోర్టు రూమ్‌లోనే దారుణంగా హతమార్చాడు. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆవరణలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డిబ్రూగఢ్ డీఎస్‌పీ  ప్రదీప్‌ సైకియా అందించిన సమాచారం  ప్రకారం నిందితుడు పూర్ణ నహర్‌ డేకా  కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇటీవల బెయిల్‌ పై విడుదలయ్యాడు.  ఈ కేసులో ఫిర్యాదుదారుగా అతని భార్య   రీటా నహర్ దేకా కోర్టు హాజరైంది. అకస్మాత్తుగా  నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి  గొంతు కోశాడు.  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు  వైద్యులు ప్రకటించారన్నారు.

అసోం 3.29 కోట్ల జనాభాలో 1.9 కోట్ల మంది మాత్రమే భారతీయులు

Submitted by arun on Tue, 01/02/2018 - 13:29

మ‌న‌దేశంలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)క‌లిగిన ఏకైక రాష్ట్రం అస్సాం. ఇత‌ర దేశాల నుంచి అస్సాంకు వ‌ల‌స‌లు పెరిగిపోయాయి. దీంతో భార‌తీయులు ఎవ‌రు, విదేశీయులు ఎవ‌రు అనే విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీం కోర్ట్  ఎన్ ఆర్ సి అనే జీవోను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ జీవో లో అస్సాంలో ఉన్న స్వ‌దేశీయులు, విదేశీయులు సైతం తాము చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన భార‌త జాతీయుల‌మంటూ త‌మ పేర్ల‌ను జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) న‌మోదు చేసుకోవాలి. అలా న‌మోదు చేసుకున్న పేర్ల‌ను సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్షించి వారిని భార‌తీయులుగా గుర్తిస్తారు.  ని ప్ర‌వేశ పెట్టింది.