sexual harassment case

తెరపైకి వచ్చిన బాలీవుడ్‌ చీకటి కోణం...బీటౌన్‌ను షేక్‌ చేస్తోన్న తనుశ్రీ దత్తా కామెంట్స్‌

Submitted by arun on Mon, 10/08/2018 - 14:32

బాలీవుడ్‌ వెలుగుజిలుగుల వెనుక ఉన్న చీకటివ్యవహారాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. చీకటి తెరపై  కొన్ని నెలల క్రితం  రాధికా ఆప్టే, ఉషాఝాదవ్‌ తదితరులు ఈ తేనెతుట్టెను కదిలించారు. అది  కాస్త గడ్డిమంటలా ఉవ్వెత్తున ఎగసి.. అంతలోనే చల్లారిపోయింది. మంటలు ఆరిపోయాయిగానీ నిజమనే నిప్పు మాత్రం నివురుగప్పి అలాగే ఉండిపోగా ఆశిక్‌ బనాయా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న తనుశ్రీ దత్తా ఆ నిప్పును మరోసారి రగిలించారు. అందరూ పెద్దమనిషిగా భావించే నానాపాటేకర్‌ తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణ చేయడం హాట్‌టాపిక్‌గా మారడంతో పాటు పలు ప్రకంపనాలు సృష్టిస్తోంది.

అమ‌లాపాల్ పై లైంగిక వేధింపులు

Submitted by lakshman on Thu, 02/01/2018 - 16:21

హీరోయిన్ అమ‌లాపాల్  పై లైంగిక వేధింపులు జ‌రిగాయి. డాన్స్ స్కూల్ య‌జ‌మాని అయిన అళ‌గేశ‌న్ త‌నతో అస‌భ్యంగా, ప‌రుష‌ప‌ద‌జాలంతో అశ్లీలంగా మాట్లాడ‌ని మొర‌పెట్టుకుంది. అంతేకాదు మ‌లేషియాలో ఉన్న త‌న ఫ్రెండ్స్ తో డిన్న‌ర్ కి వెళ్లాల‌ని కోరాడ‌ని తెలిపింది. ఈ సంద‌ర్బంగా త‌న పై వ‌చ్చిన వేధింపులపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అమ‌లా పాల్ మ‌హిళ‌ల‌కు రక్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉంటే అమ‌లాపాల్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.  

కీచకులుగా మారిన సహచరులు..నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ..

Submitted by arun on Tue, 01/23/2018 - 12:08

తననే పెళ్లి చేసుకోవాలంటూ, తోటి అధ్యాపకురాలిని లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతం బయటపడటం కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో కలకలం రేపుతోంది. అవివాహితురాలైన ఓ యువతి, మెరిట్ పై కాంట్రాక్టు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 2017 జూలైలో ఉద్యోగంలో చేరారు. ఆమెను చూసి మోహించిన ముగ్గురు తోటి ప్రొఫెసర్లు, తనను పెళ్లి చేసుకోవాలంటే, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత అధ్యాపకురాలు.. ఉద్యోగం వదలిపోతున్నట్టు సన్నిహితులతో చెప్పి వాపోయారు. ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులకు చెప్పాలని, తాము కూడా తోడుంటామని వారు చెప్పారు. ఇందుకోసం సోమవారం ఆమె వెళుతుండగా..

hmtv చేతిలో గజల్ శ్రీనివాస్ రాసలీలలు

Submitted by arun on Tue, 01/02/2018 - 18:12

గజల్ శ్రీనివాస్‌ లైంగిక ఆరోపణలు కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పోలీసులకు అందించిన సాక్ష్యాలను hmtv exclusive గా సంసాదించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కేవలం  hmtv దగ్గర మాత్రమే ఉంది. గజల్ శ్రీనివాస్‌‌పై ఫిర్యాదు చేసిన బాదితురాలు సమర్పించిన ఆధారాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు.

ఈ గజల్ గలీజ్.. నగ్నంగా ఉండాలని మసాజ్‌ చేయాలంటూ వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదు

Submitted by arun on Tue, 01/02/2018 - 13:19

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్

Submitted by arun on Tue, 01/02/2018 - 12:25

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.