passed away

స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూత‌

Submitted by lakshman on Wed, 03/14/2018 - 11:29

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూశారు. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన త‌న ప‌రిశోద‌న‌ల‌తో స‌త్తాచాటుకున్నారు.  మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరీరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు.   

ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత

Submitted by arun on Fri, 03/02/2018 - 15:14

ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు అన్నిటికి మించి సాంఘిక సేవాకార్యకర్త శ్రీ దేవరాజు రవి మార్చి 2వతేదీ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలో కన్నుమూశారు.  దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కధలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. 1959 లో రామం అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. మూడు కవితా సంపుటాలు, రెండు కధా సంపుటాలు వెలువరించారు.  సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకోడమేకాక నిష్పక్షపాత సమీక్షలు కావడంతో సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి!

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూత

Submitted by arun on Thu, 03/01/2018 - 12:37

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా నాయని కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాబడి, పాఠశాల మ్యాగజైన్లు ప్రారంభించారు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల అనురక్తి కలిగిన ఆయన 23 ఏళ్ల వయసులో యామినీకుంతలాలు పేరుతో మొదటి నవల రాశారు. నవలలతో పాటు కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. సినీ గేయ రచయితగానూ పనిచేశారు. మహర్షి సినిమాలోని సుమం ప్రతి సుమం సుమం పాటను రాశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి కృష్ణమూర్తి స్వగ్రామం. కృష్ణమూర్తి అంత్యక్రియలను రేపు స్వగ్రామం చౌడేపల్లిలో నిర్వహించనున్నారు.

హన్మంతరావు నటించిన చిత్రాలు...

Submitted by arun on Mon, 02/19/2018 - 12:41

తెలుగు సినీ పరిశ్రమ.. మరో కమెడియన్ ను కోల్పోయింది. ప్రముఖ హాస్యనటుడు.. గుండు హనుమంతారావు.. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత

Submitted by arun on Wed, 02/07/2018 - 10:21

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. డెంగ్యూతో బాధపడుతూ రెండు రోజులముందు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

ఇంటి నుంచి బ‌య‌లుదేరి శ‌వ‌మై తేలిన ప్ర‌ముఖ న‌టుడు

Submitted by lakshman on Tue, 01/16/2018 - 17:19


   ఇంటి నుంచి గోవాకు బ‌య‌లు దేరిన ప్ర‌ముఖ న‌టుడు శ‌వ‌మై క‌నిపించాడు. అయితే స్థానికుల స‌మాచారంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఎలా చ‌నిపోయాడు..? ఎందుకు చ‌నిపోయాడు అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

హీరో విక్రమ్‌ ఇంట విషాదం

Submitted by arun on Mon, 01/01/2018 - 14:52

ప్రముఖ నటుడు విక్రమ్‌ ఇంట విషాదం నెలకొంది. హీరో విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్‌రాజ్‌ వయసు 80 ఏళ్లు. విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ కూడా పలు క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌లో న‌టించి అభిమానుల ఆద‌రాభిమానం పొందారు. నృత్య రంగంలోను ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. అయితే ఆదివారం సాయంత్రం 4గం.ల‌కు విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ (80) అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో విక్ర‌మ్ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు నెల‌కొన్నాయి. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ వినోద్ రాజ్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ, కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేశారు. ఈ రోజు వినోద్ రాజ్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.