raviteja

బంపర్ ఆఫర్ కొట్టేసిన 'ఆర్‌ఎక్స్‌ 100' హీరోయిన్

Submitted by arun on Sat, 11/03/2018 - 10:49

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్నిచేసిన పాయల్‌ రాజ్‌పుత్‌. పాయల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడు. కాగా పాయల్‌ తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశారు. రెండో సినిమాతోనే మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ‌రవితేజ హీరోగా వి ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టి. రామ్‌ నిర్మాత. ఇందులో ఓ కథానాయికగా 'నన్ను దోచుకుందువటే 'ఫేం నభా నటేష్‌ కనిపించనున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా పాయల్‌ను దర్శక, నిర్మాతలు ఎంచుకున్నారు. ఆమె అయితే ఈ పాత్రకు బాగా సరిపోతారని వారు భావించారట.

టచ్ చేసి చూడు సినిమా రివ్యూ

Submitted by arun on Fri, 02/02/2018 - 13:11

రాజాది గ్రేట్ తో త‌న స్టామీనా ఏంటో నిరూపించుకున్న ర‌వితేజ టచ్ చేసి చూడుతో శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాడు. రైటర్ వ‌క్కంతం వంశీ క‌థ‌తో డైర‌క్ట‌ర్ విక్ర‌మ్ సిరికొండ ఈ సినిమాను తెరకెక్కించాడు. మ‌రి దాదాపు రెండు సంవత్స‌రాల త‌రువాత రాజాదిగ్రేట్ తో హిట్ కొట్టిన మాస్ మ‌హ‌రాజా అదే జోరును కొన‌సాగిస్తాడా లేదా అనేది తెలుసుకుందాం. 

రెజీనా మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డుతుందా?

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 12:24

సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభిన‌యం.. ఈ రెండూ ఉంటే స‌రిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. పాపం.. చెన్నై చిన్న‌ది రెజీనా విష‌యంలో అదృష్టం ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉంటోంది. అందుకే.. ఒక‌టీ ఆరా విజ‌యాలు వ‌చ్చినా.. స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం అవ‌కాశాలు పొంద‌లేక‌పోతోందీ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టివ‌ర‌కు డ‌జ‌ను తెలుగు చిత్రాలు చేసిన రెజీనాకి.. వాటిలో ఐదు సినిమాలు విజ‌యాలు అందించాయి. అయిన‌ప్ప‌టికీ ర‌వితేజ మినహా మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు ఆమెకి ఆఫ‌ర్ ఇవ్వ‌లేదు. దాంతో స్టార్ మెటీరియ‌ల్ అనిపించుకోలేక‌పోయింది రెజీనా.

టాకీ పూర్తిచేసుకున్న 'రాజా ది గ్రేట్‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:06

'బెంగాల్ టైగ‌ర్' త‌రువాత బాగా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ.. ప్ర‌స్తుతం 'రాజా ది గ్రేట్‌'లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. 'ప‌టాస్‌', 'సుప్రీమ్' చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల రాయ‌ఘ‌డ్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్‌తో 'రాజా ది గ్రేట్' టాకీ పూర్త‌య్యింద‌ని.. ఇక పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం కేర‌ళ వెళుతున్నామ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

'రాజా ది గ్రేట్' విడుద‌ల వాయిదా?

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 17:34

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది కాలం విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం  'రాజా ది గ్రేట్‌', 'ట‌చ్ చేసి చూడు' చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో 'రాజా ది గ్రేట్' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

ర‌వితేజ‌తో మ‌రోసారి?

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 17:04

ఇక కాజ‌ల్ ప‌ని అయిపోంద‌నుకుంటున్న టైంలో.. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంది అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌.  ప్ర‌స్తుతం.. తెలుగులో త‌న తొలి క‌థానాయ‌కుడైన క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి 'ఎమ్మెల్యే' చిత్రంలో న‌టిస్తోందీ అమ్మ‌డు. అలాగే త‌మిళంలో 'క్వీన్' రీమేక్ లోనూ న‌టిస్తోంది.

మూడేళ్లు వ‌రుస‌గా..

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 13:00

ఈ త‌రం ద‌ర్శ‌కులు మూడేళ్ల పాటు వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం అనేది అరుదైన విష‌యంగా మారిపోయింది. అయితే, ఓ యువ ద‌ర్శ‌కుడు మాత్రం స‌క్సెస్‌ఫుల్‌గా మూడేళ్ల పాటు ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న నుంచి ఓ సినిమా ఉండేలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ యువ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు.. 'పటాస్‌', 'సుప్రీమ్‌'తో వ‌రుస విజ‌యాలు అందుకున్న అనిల్ రావిపూడి.

రేపు 'రాజా ది గ్రేట్' టైటిల్ ట్రాక్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 12:05

'ప‌టాస్‌', 'సుప్రీమ్' చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో 'రాజా ది గ్రేట్ 'చేస్తున్నాడాయ‌న‌. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశి ఖ‌న్నా ఓ పాట‌లో త‌ళుక్కున మెర‌వనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత‌మందిస్తున్నారు.

ఒకే రోజున‌ రెండు సినిమాలు

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 16:15

'ఊహలు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ రాశీ ఖ‌న్నా. తొలి చిత్రంలో హోమ్లీ లుక్స్‌తో క‌ట్టిప‌డేసిన రాశి.. ఆ త‌రువాత గ్లామ‌ర్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్'.. ఇలా రాశి న‌టించిన ప్ర‌తి చిత్రంలోనూ ఆమె గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 'హైప‌ర్' త‌రువాత దాదాపు ఏడాది గ్యాప్ తో రాశి కొత్త చిత్రం రాబోతోంది. ఆ సినిమానే 'జైల‌వ‌కుశ‌'. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో నివేదా మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ఇదిలాఉంటే..

రెండు నెల‌లు.. నాలుగు సినిమాలు..

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 11:37

 'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయిక మెహ‌రీన్‌. ఆ సినిమా విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం అయినా.. మెహ‌రీన్ నుంచి మ‌రో సినిమా రాలేదు.  అలాగ‌ని ఆమె ఖాళీగా లేదు. చేతి నిండా సినిమాల‌తో బిజీగానే ఉంది. అన్నీ కుదిరితే.. రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాల‌తో మెహ‌రీన్ సంద‌డి చేసే అవ‌కాశం ఉంది.