pradeep

ఊహించని షాక్‌ : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Fri, 01/19/2018 - 15:44

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రదీప్ ‌...డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాక ప్రదీప్‌కు రెండు వేల ఒక వంద రూపాయల జరిమానా విధించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణ నిమిత్తం  ప్రదీప్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసును విచారించిన కోర్టు...  ప్రదీప్ డ్రెవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

నాంపల్లి కోర్టుకు హాజరైన యాంకర్‌ ప్రదీప్‌

Submitted by arun on Fri, 01/19/2018 - 11:53

న్యూఇయర్‌ రోజు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్‌ ప్రదీప్‌ నాంపల్లి కోర్టు హాజరయ్యాడు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులకు కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్‌ ఇవాళ కోర్టు ముందు అటెండ్‌ అయ్యాడు. బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌లో ప్రదీప్‌కి అత్యధికంగా 178 పాయింట్లు రావడంతో మరి కోర్టు జరిమానాతో సరిపెడుతుందా? లేక జైలుశిక్ష విధిస్తుందో కాసేపట్లో తెలియనుంది.

పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరైన యాంకర్ ప్రదీప్

Submitted by arun on Mon, 01/08/2018 - 15:34

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్ వారం రోజుల తర్వాత టచ్‌లోకి వచ్చాడు. తండ్రితో కలిసి గోషామహల్ పోలీసు‌స్టేషన్‌కు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రదీప్‌కు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రదీప్‌కు మూడు డాక్యుమెంటరీలను చూపించనున్నారు. కౌన్సెలింగ్ రూమ్‌లో తన తండ్రితో కలిసి ప్రదీప్ మొదటి వరుసలో కూర్చున్నాడు.

యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు ఈరోజే డెడ్‌లైన్‌

Submitted by arun on Mon, 01/08/2018 - 10:57

డ్రంక్  అండ్  డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడి..తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్  ప్రదీప్ నేడు  బేగంపేట ట్రాఫిక్  పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్ కు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రదీప్‌కు  పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సాయంత్రం లోపు ఎప్పుడైనా కౌన్సింగ్‌కు హాజరుకానున్నారు. దీంతో ఇవాళ అన్న ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరవుతాడా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్‌

Submitted by arun on Sun, 01/07/2018 - 10:39

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం అందించారు.

ప్రదీప్ చిన్నపిల్లాడు... వదిలేయండి

Submitted by arun on Sat, 01/06/2018 - 15:03

నవ్విస్తాడు.. కవ్విస్తాడు.. జోకులేస్తాడు.. పంచ్‌లేస్తాడు.. సలహాలిస్తాడు.. అవగాహన కల్పిస్తాడు.. రోడ్డు మీద మనం ఎలా నడచుకోవాలో.. మన స్టైల్లో.. తన స్టైల్ మిక్స్ చేసి.. మనకర్థమయ్యేలా చెప్తాడు.. అతడే అడ్మిన్ హెచ్. ఎవరీ అడ్మిన్ హెచ్.. అనేగా మీ డౌట్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లందరికీ తెలుసు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హృదయాలు దోచేస్తున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్ బుక్ పేజీని.. రన్ చేసే వ్యక్తే అడ్మిన్ హెచ్. ఈ పేజీ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లయినా.. ఈ మధ్యకాలంలోనే అడ్మిన్ హెచ్ హైలెట్ అయ్యాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. అని డైరెక్ట్‌గా చెప్తే ఎవరూ వినరని..

ప్రదీప్‌కు రేపటితో డెడ్‌లైన్‌..కౌన్సిలింగ్‌కు రాకుంటే అరెస్టే

Submitted by arun on Fri, 01/05/2018 - 14:48

యాంకర్‌ ప్రదీప్‌పై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో కౌన్సిలింగ్‌కు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్‌ జారీ చేస్తామంటున్నారు. ప్రదీప్‌ కౌన్సిలింగ్‌‌కు రేపటితో గడువు ముగియనుంది. ఈలోగా కౌన్సిలింగ్‌‌కు హాజరుకాకపోతే కోర్టులో చార్జీషీట్‌ వేస్తామంటున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అరెస్ట్‌ తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో ప్రదీప్‌కు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు.

యాంకర్‌ ప్రదీప్‌ ఎక్కడ ?

Submitted by arun on Wed, 01/03/2018 - 11:16

న్యూఇయర్‌ సందర్భంగా జూబ్లీహిల్స్  రోడ్డు నెంబరు 45లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన టీవీ యాంకర్ ప్రదీప్ పోలీస్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. శనివారం లోగా ఎప్పుడైనా కౌన్సిలింగ్ కు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే, మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన ప్రదీప్ కు బ్లడ్ ఆల్కహాల్ శాతం 178 ఉంది. సాధారణంగా బ్లడ్ ఆల్కహాల్ శాతం 35 దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. దీంతో విషయంలో ఏంచేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

పూటుగా మ‌ద్యం సేవించి డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ యాంక‌ర్ ప్ర‌దీప్

Submitted by arun on Mon, 01/01/2018 - 10:58

తెలుగురాష్ట్రాల్లో న్యూఇయ‌ర్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.  అయితే హైద‌రాబాద్ లో కొత్త‌సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ తనిఖీల్లో ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టుడు ప్ర‌దీప్ డ్రంకన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన‌ట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో రాత్రి 3 గంటల సమయంలో పూటుగా తాగిన ప్ర‌దీప్ కారున‌డుపుకుంటూ వ‌స్తుండ‌గా ట్రాఫిక్ పోలీసులు అడ్డ‌గించి  బ్రీత్ ఎన‌లైజ‌ర్ చెక్ చేశారు. అయితే ఈ టెస్ట్ లో ప్ర‌దీప్ కు 178పాయింట్లు వ‌చ్చాయి. దీంతో  ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.