drunk and drive

మందుబాబుపై పోలీసుల మమకారం.. ఇంతకీ ఏం చేశారంటే

Submitted by arun on Sat, 08/11/2018 - 12:35

హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ఐదు చోట్ల  ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ మద్యంతాగి తూలుతున్న మందుబాబుకే కారు స్టీరింగ్ అప్పగించారు. పక్క సీట్లో ట్రాఫిక్ పోలీస్ కూర్చుని కోటీశ్వరుడిపై మమకారం
 చూపించారు. పోలీసుల నిర్వాకంపై జనం విస్మయం చెందారు. 

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టాలీవుడ్ సింగర్...

Submitted by arun on Sat, 07/28/2018 - 09:37

జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 178 ఎంజీ వచ్చింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చే రోడ్డులో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ తాగిన మైకంలో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం మోతాదు 178 పాయింట్లు వచ్చింది. రాహుల్  పోలీసులకు సహకరించకుండా వాగ్వివాదానికి దిగాడు. అతనిపై కేసు బుక్ చేసి.. కారును సీజ్ చేశారు. ఆ సమయంలో యాంకర్‌, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. లైసెన్స్‌ కూడా లేకుండానే రాహుల్‌ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది.

మద్యం మత్తులో పోలీసులపై యువకుడి దాడి

Submitted by arun on Sat, 02/10/2018 - 11:04

హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ లో మద్యం రాయుడు హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పూటుగా మద్యం సేవించిన మద్యం బాబు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు నిరాకరించి దురుసుగా ప్రవర్తించాడు.  బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా.. 185 పాయింట్లు చూపించింది. వాహనాన్ని ఆపినందుకు మద్యం మత్తులో ఉన్న అంకిత్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డ అంకిత్‌పై ఐపీసీ 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 

అసలే పోలీస్..ఆపై మందేశాడు

Submitted by arun on Tue, 01/30/2018 - 12:40

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనేది ఓ నానుడి. ఇది పోలీసోళ్ళకి బాగా వర్తిస్తుంది. మద్యం తాగి వాహనాలు నడొపొద్దని చెప్పే పోలీసులు... తమ దగ్గరికి వచ్చే సరికి ఆ రూల్‌ను పక్కన పెట్టేస్తున్నారు. కొందరు పీకలదాకా తాగి వీరంగం వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ మందు తాగిన పోలీస్ అధికారి సృష్టించిన బీభత్సమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం..!

Submitted by arun on Thu, 01/18/2018 - 12:08

విజయవాడలో అర్ధరాత్రి వోక్స్‌ వేగన్‌ కారు బీభత్సం సృష్టించింది. పిన్నమనేని పాలీ క్లినిక్‌ దగ్గర అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిలయన్స్‌ జియో ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు శాఖమూరి ప్రవీణ్‌ చౌదరి పేరుతో రిజిస్ట్రేషనై ఉంది. ఇక కారు నడుపుతున్న యువకుడు కృష్ణతేజను అరెస్ట్‌ చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. 

యువతి వీరంగం

Submitted by arun on Wed, 01/17/2018 - 10:46

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. 20 నిమిషాలపాటు కారు దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. చివరికి ఆమె స్నేహితులు వేరే వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.

మద్యం హానికరం..నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దు: యాంకర్‌ ప్రదీప్‌

Submitted by arun on Mon, 01/08/2018 - 16:30

మద్యం ఆరోగ్యానికి హానికరమని యాంకర్ ప్రదీప్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి పట్టుబడ్డ ప్రదీప్.. సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ తన తండ్రితో కలిసి హాజరయ్యారు. కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు.  ‘‘ఈ రోజు కౌన్సెలింగ్‌ సెషన్‌కు హాజరు కావాలని మెసేజ్‌ వచ్చింది. అందుకే వచ్చాను. ఇప్పటివరకు రాలేదంటని అంతా అనుకుంటున్నారు. తప్పించుకుంటున్నానని.. అజ్ఞాతంలోకి వెళ్లానని రకరకాలుగా అంటున్నారు. అలాంటిదేమీ లేదు. పోలీసులు నాకు కేటాయించిన తేదీని బట్టే ఇక్కడికి వచ్చాను.

కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్‌

Submitted by arun on Sun, 01/07/2018 - 10:39

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం అందించారు.

ప్రదీప్‌కు జైలు తప్పదా ?

Submitted by arun on Mon, 01/01/2018 - 14:08

న్యూ వేడుకలు సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదా ? డిసెంబర్‌ 31లోపు పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా మందుబాబులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మందు కొట్టి చిందులు వేశారు. కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రముఖ తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం సేవించారు. బ్రీతింగ్‌ ఎనలైజర్‌లో 30పాయింట్లకు మించితే పోలీసులు జైలుకు పంపుతారు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్‌ డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అలా ఇలా కాదు మోతాదుకు మించి 6 రెట్లు ఎక్కువ మందు కొట్టారు యాంకర్ ప్రదీప్‌.