Pawan

పవన్‌కో రూల్‌ నాకో రూలా?: రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 09:45

ఎవరు ఏది మాట్లాడమంటే..అది మాట్లాడటానికి తాను కీలుబొమ్మను కాదంటోంది రేణు దేశాయ్. పవన్ పై విమర్శలొస్తే తానెందుకు స్పందించాలంటూ..మరోసారి ఫ్యాన్స్ దుమ్ము దులిపింది రేణూ. తనను ప్రశాంతంగా బ్రతకనివ్వరా అంటూ..అభిమానులను ఎడాపెడా వాయించేసింది.
 
పవన్ కల్యాణ్ కో రూల్ నాకో రూలా అంటూ రేణు దేశాయ్ మరోసారి అభిమానులపై ఫైర్ అయ్యింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పవన్‌ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కి రేణూ దేశాయ్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా పవన్ అభిమానులు దానిపై స్పందించమని సోషల్ మీడియాలో రేణూని వేధిస్తున్నారట.

వైసీపీ + బీజేపీ + జ‌న‌సేన = 2019 ఎన్నిక‌లు..?

Submitted by lakshman on Sat, 03/17/2018 - 03:37

ఏపీలో  అంతా అనుకున్న‌ట్లే జ‌రుగుతుంది. గ‌త కొద్ది కాలంగా టీడీపీ  - బీజేపీకి పొస‌గ‌డంలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాన్ని వేడిపుట్టించారు.  

చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ చాలా నయం

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:28

ఈ మాట మేం కాదు అనేది… జనాలే అంటున్నారు. ఎందుకంటే.. వాస్తవాలను కాస్త పరిశీలనలోకి తీసుకుంటే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి సాధించింది ఏమీ లేదు. 18 శాతం ఓట్లు సంపాదించారు కానీ.. వాటిని అధికారం దిశగా మళ్లించే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేకపోయారు. చివరికి ఉన్న పార్టీని కూడా.. కాంగ్రెస్ లో కలిపేశారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారన్న ఆరోపణలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. దానికి తోడు.. తన రాజకీయ ప్రస్థానంలో..

టీడీపీ అవినీతి ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా ప‌వ‌న్

Submitted by lakshman on Thu, 03/15/2018 - 00:39

ఎన్న‌డూ లేని విధంగా టీడీపీ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ పార్టీ ఆవిర్భావ‌స‌భ‌లో మాట్లాడిన తీరును చూస్తుంటే ...ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క ఇప్ప‌టి నుంచి ఓ లెక్క అన్నచందంగా ఉన్న‌ట్లు పొలిటిక‌ల్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం సాధించేదిశ‌గా అడుగులు వేస్తున్న ప‌వ‌న్ టీడీపీ అవినీతి  - అక్ర‌మాల చిట్టాను బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. 

ప‌వ‌న్ ను మెచ్చుకున్న చంద్ర‌బాబు

Submitted by arun on Thu, 02/15/2018 - 13:37

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం జరిగిన టీడీపీ నేతల సమన్వయ కమిటీలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ జేఏసీపై స్పందించారు. పవన్ కల్యాణ్‌ పోరాటంలో అర్థం ఉందని సమావేశంలో పాల్గొన్న నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మేలు చేయాలనే కాంక్షతో పవన్ ముందుకెళ్తున్నారని సీఎం మెచ్చుకున్నారు. 

సీఎం కేసీఆర్ స‌హ‌జ‌ నటుడైతే పవన్ సినీనటుడు

Submitted by lakshman on Fri, 01/26/2018 - 22:40

తెలంగాణ ప‌ర్య‌ట‌న ముగించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ మాట్లాడుతూ  ప‌వ‌న్ కు ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతి గురించి తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.  అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని గుర్తు చేశారు. 
 ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికేదిక్కులేదు, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. 

కరువు యాత్రను కడదాకా లాగుతారా..మధ్యలోనే రాంరాం చెబుతారా?

Submitted by arun on Fri, 01/26/2018 - 18:54

అసలు సేనాధిపతి రణక్షేత్రం ఏమిటి? నాలుగేళ్లు దాటుతున్నా జనసేనకు పార్టీపరమైన సంస్థాగత నిర్మాణం లేదు. జనసేన అంటే ఇంకా ఒక్క పవన్‌కల్యాణ్‌ మాత్రమే వేదికల మీద కనపడుతున్నాడు. ఇంకా ఆయనలో ఓ క్లారిటీ మిస్‌ అవుతూనే ఉందని ఫ్యాన్స్‌ ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఇంతకీ తన ఎజెండా ఏమిటి? సమస్యల కేస్‌ స్టడీ చేస్తున్నానని చెబుతూ జనానికి కనెక్ట్‌ అవుదామనుకుంటున్న పవన్‌ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్ని సమస్యలను టచ్‌ చేసి చూడు... అన్నట్టుగానే కరువు యాత్రలో కూడా క్లారిటీ మిస్‌ అవుతారా? కన్ఫ్యూజన్‌ లేకుండా ముందుకు సాగుతారా?

పవన్‌ యాత్రకు స్ఫూర్తి ఇదేనా?

Submitted by arun on Fri, 01/26/2018 - 18:47

జనసేనాని పవన్‌కల్యాణ్‌ కరువు యాత్రను అనంతపురం నుంచి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న పవన్‌ యాత్రపై అభిమానులు, కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీటన్నింటి మధ్య పవన్‌ టూర్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుంది.? తన ఉనికికి ఆయువు పట్టుగా ఉన్న ఉత్తరాంధ్ర నుంచో లేక సొంత జిల్లా నుంచో కాకుండా... అనంతపురం నుంచి ఎంచుకోవడం వెనుకున్న అసలు నిజమేంటి? గతంలో ఆదరించిన పార్టీల్లాగేనే అనంతవాసులు పవన్‌ను ఆదరిస్తారా? అక్కున చేర్చుకుంటారా? 

ప‌వ‌న్ - క‌త్తి మ‌హేష్ వివాదంలోకి చిరంజీవిని లాగిన కేతిరెడ్డి

Submitted by lakshman on Tue, 01/16/2018 - 06:31

 క‌త్తిమ‌షేష్ -  ప‌వ‌న్ క‌ల్యాణ్ వివాదం  ఇప్ప‌ట్లో ముగిసే దాఖ‌లాలు లేవ‌ని నెటిజ‌న్లు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ప‌వ‌న్ సినిమాలు , వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేసిన క‌త్తి 16వ తేదీవ‌ర‌కు వెయిట్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో క‌త్తిహేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఏం మాట్లాడ‌తారు.వివాదానికి పుల్ స్టాప్ పెట్టేస్తారా..అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. అయితే సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి..మెగ‌స్టార్ చిరంజీవికి లేక రాశారు. ప‌వ‌న్ -మ‌హేష్ వివాదం లో చిరంజీవి జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

పవన్ కల్యాణ్‌ న్యూఇయర్ ట్రీట్..‘కొడకా కోటేశ్వరరావు..’ వచ్చేసింది

Submitted by arun on Sun, 12/31/2017 - 20:03

అజ్ఞాతవాసి సినిమాలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర్రావు సాంగ్‌ విడుదలైంది. సాంగ్ రిలీజ్‌‌పై టీజర్‌తో అమాంతం అంచనాలు పెంచేసిన పవన్‌ మొత్తం ఫుల్‌ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ పాట నవ్వులతో, పవన్ కల్యాణ్‌ మేనరిజమ్స్‌తో పవన్‌కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంది. శర్మా అంటూ పవన్ మాట్లాడుతూ కొడకా కోటేశ్వరావు అంటూ సాగే ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పవన్ న్యూఇయర్ ట్రీట్ ఇచ్చారు. అంతేకాదు ఈ పాట పాడుతున్న ఫుల్ వీడియో అభిమానులకు కనువిందు చేస్తోంది. సినిమాలో ఈ సాంగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.