mehreen

మెహరీన్‌ రైలు కష్టాలు

Submitted by arun on Sat, 06/30/2018 - 11:16

యువ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసి, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్ కు రైల్లో ఓ భయానక అనుభవం ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తున్న ఆమె, సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట. అయితే నిర్మాతలు తన కోసం బుక్‌ చేసిన బెర్త్‌ను అప్పటికే ఒక వ్యక్తి ఆక్రమించుకోవడం, అతను పుల్‌గా మద్యం తాగి ఉండడంతో నటి మెహరీన్‌ భయంతో వణికిపోయింది. చాలా సమయం అలానే రైలులో నిలబడే ప్రయాణం చేసింది.

అప్పుడు మ‌హాల‌క్ష్మీ.. ఇప్పుడు మేఘ‌న‌..

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 14:28

'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చూసిన వారెవ‌రైనా అందులో మ‌హాలక్ష్మీ పాత్ర‌లో న‌టించిన మెహ‌రీన్‌ని అంత ఈజీగా మరిచిపోలేరు. అంత‌గా త‌న అందంతో, అభిన‌యంతో క‌ట్టిప‌డేసిందీ పంజాబీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పూర్త‌యినా ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. అయితేనేం.. ఇప్పుడు ఈ చిన్న‌ది న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'మ‌హానుభావుడు', 'రాజా ది గ్రేట్‌', 'c/o సూర్య‌', 'జ‌వాన్‌'. వీటిలో ముందుగా రాబోతున్న సినిమా 'మ‌హానుభావుడు'.

'c/o సూర్య‌'పై నాని కేర్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 19:41

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం 'c/o సూర్య‌'. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి 'నా పేరు శివ' ఫేమ్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని ఈ సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు త‌న ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ఖాతాల ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.

'మ‌హానుభావుడు'కి నో క‌ట్స్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 15:53

'గ‌మ్యం', 'ప్ర‌స్థానం', 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ర‌న్ రాజా ర‌న్‌', 'ఎక్స్ ప్రెస్‌ రాజా', 'శ‌త‌మానం భ‌వతి' చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల న‌టుడు అని పేరు తెచ్చుకున్నాడు శ‌ర్వానంద్‌. ఈ యువ క‌థానాయ‌కుడి నుంచి వ‌స్తున్న తాజా చిత్రం 'మ‌హానుభావుడు'. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది.

టాకీ పూర్తిచేసుకున్న 'రాజా ది గ్రేట్‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:06

'బెంగాల్ టైగ‌ర్' త‌రువాత బాగా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ.. ప్ర‌స్తుతం 'రాజా ది గ్రేట్‌'లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. 'ప‌టాస్‌', 'సుప్రీమ్' చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల రాయ‌ఘ‌డ్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్‌తో 'రాజా ది గ్రేట్' టాకీ పూర్త‌య్యింద‌ని.. ఇక పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం కేర‌ళ వెళుతున్నామ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

'జ‌వాన్' సెట్‌లో ద‌ర్శ‌కేంద్రుడి సంద‌డి

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 12:28

ఈ ఏడాది ప్రారంభంలో 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంతో ప‌ల‌క‌రించారు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ప్ర‌స్తుతం 'సై సై స‌య్యారే' అనే టీవీ కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా 'జ‌వాన్' సెట్స్‌కి విచ్చేశారు. అంతేకాకుండా.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్‌ల‌పై ఓ షాట్ తీసి యూనిట్ స‌భ్యుల‌కు విషెస్ చెప్పారు.

ఈ విష‌యాన్ని 'జ‌వాన్' ద‌ర్శ‌కుడు బీవీఎస్ ర‌వి ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న 'జ‌వాన్‌'ని న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. 

'రాజా ది గ్రేట్' విడుద‌ల వాయిదా?

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 17:34

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది కాలం విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం  'రాజా ది గ్రేట్‌', 'ట‌చ్ చేసి చూడు' చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో 'రాజా ది గ్రేట్' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

రేపు 'రాజా ది గ్రేట్' టైటిల్ ట్రాక్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 12:05

'ప‌టాస్‌', 'సుప్రీమ్' చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో 'రాజా ది గ్రేట్ 'చేస్తున్నాడాయ‌న‌. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశి ఖ‌న్నా ఓ పాట‌లో త‌ళుక్కున మెర‌వనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత‌మందిస్తున్నారు.

 మారుతికి అది ప్ల‌స్స‌వుతుందా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:34

'ఈరోజుల్లో', 'బ‌స్‌స్టాప్‌', 'కొత్త జంట‌', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యూత్ చిత్రాల స్పెష‌లిస్ట్‌ మారుతికి అత‌ని గ‌త చిత్రం 'బాబు బంగారం' రిజ‌ల్ట్‌ షాక్ ఇచ్చింది. దీంతో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు మారుతి. అందుకే.. ప్ర‌స్తుతం వ‌రుస‌ విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న శ‌ర్వానంద్‌తో 'మ‌హానుభావుడు' సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ‌రీన్‌ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

రెండు నెల‌లు.. నాలుగు సినిమాలు..

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 11:37

 'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయిక మెహ‌రీన్‌. ఆ సినిమా విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం అయినా.. మెహ‌రీన్ నుంచి మ‌రో సినిమా రాలేదు.  అలాగ‌ని ఆమె ఖాళీగా లేదు. చేతి నిండా సినిమాల‌తో బిజీగానే ఉంది. అన్నీ కుదిరితే.. రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాల‌తో మెహ‌రీన్ సంద‌డి చేసే అవ‌కాశం ఉంది.