Suicide

విషాదం...ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Submitted by arun on Fri, 06/01/2018 - 12:33

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అర్బన్‌ సీఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన బొనిగెల శారద(34) తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా పొన్నూరులోని 31వ వార్డులో నివాసం ఉంటోంది. గురువారం అర్థరాత్రి తనతో పాటు తన పిల్లలపై వంటనూనె, డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

అన్నదాతను వెంటాడిన దురదృష్టం... రూ.33 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

Submitted by arun on Mon, 05/28/2018 - 14:56

ఖరీఫ్ సీజన్ వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో పొలం బీడు కావాల్సిందేనంటూ కంటతడి పెట్టుకున్నాడు.  అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు  ఆ బక్కచిక్కిన రైతుకు కొండంత అండగా నిలిచింది.  కాని విధి వక్రీకరించి ... ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము దొంగల పాలు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ పేద రైతు గుండె పగిలింది. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య

Submitted by arun on Fri, 03/30/2018 - 15:28

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయ్. విశాఖ జిల్లాకు చెందిన రాజశేఖర్‌కు రాణి అనే యువతితో వివాహామైంది. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలోనే రాజశేఖర్‌ అశ్వినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్‌. చనిపోయే ముందు కారణాలను సెల్పీ వీడియోలో వివరించాడు.
 

భర్తకు ప్రియుడితో చేసిన పాడుపని వీడియోలు..

Submitted by arun on Fri, 03/16/2018 - 16:06

కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే జగిత్యాల మండలం ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో ధర్మారావు పేటకు చెందిన ధర్మరాజు (27)కు పెళ్లయింది. కానీ, ఆ పెళ్లికి ముందే ఆమె తన పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మహేశ్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగించింది.

ఫీజుల భూతానికి బ‌లైన మరో చిట్టితల్లి

Submitted by arun on Fri, 02/02/2018 - 11:21

స్కూల్ యాజమాన్యం ధనదాహం మరో విద్యార్ధినిని బలి తీసుకుంది. ఫీజు కట్టలేదనే కారణంతో 9వ తరగతి విద్యార్ధినిని పరీక్ష రాసేందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జేఎల్‌ఎస్‌ నగర్‌లో చోటుచేసుకుంది.

విజయవాడ సూర్యారావుపేటలో విషాదం..

Submitted by arun on Wed, 01/31/2018 - 12:35

విజయవాడ సూర్యారావుపేటలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో ఇటీవల చేరిన సత్యరాణి, ఆమె భర్త రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ దంపతుల మృతికి ఆర్థిక కారణాలే కారణమని భావిస్తున్నారు.

రెండు ప్రాణాలను బలితీసుకున్న ప్రేమ

Submitted by arun on Fri, 01/19/2018 - 15:52

ప్రేమ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కలిసి బతకలేమనుకొన్న జంట ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో కన్నవారి ఆశలను కలలు చేసి తనువు చాలించుకున్నారు. ఆనందాన్ని పంచాల్సిన పిల్లలు విషాదాన్ని నింపి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగింది.
 

హైదరాబాద్‌లో బ్లూవేల్‌ కలకలం

Submitted by arun on Sun, 12/31/2017 - 17:23

అదో హిప్నాటిక్ గేమ్. సరదాగా ఆట మొదలవుతుంది..చిన్న చిన్న సవాళ్లను విసురుతుంది.. ఆటను వ్యసనంగా మారుస్తుంది.. ఇక ఫైనల్ టాస్క్ మాత్రం ప్రాణాలకు ముగింపు పలుకుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్‌కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. రాజేంద్ర నగర్‌ సన్‌సిటీలోని మిఫుల్‌ టౌన్‌ విల్లాకు చెందిన వరుణ్ బ్లూవేల్‌ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు.