Suicide

ఆ ముగ్గురి వేధింపులకే శిల్ప బలి

Submitted by arun on Sat, 11/10/2018 - 10:53

తిరుపతిలో సంచలనం సృష్టించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ ముగిసింది. శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. శిల్ప సోదరి శృతి ఫిర్యాదు ఆధారంగా 4 నెలల పాటు దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు మొత్తం 47 మందిని విచారించారు. ఆమె ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని తేల్చారు. దీంతో ముగ్గురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. 

జగిత్యాల విద్యార్థుల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్...సినిమా ఎఫెక్ట్‌తో బలైన ప్రాణాలు

Submitted by arun on Mon, 10/01/2018 - 15:54

జగిత్యాల జంట మరణాల కథ.. అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ఆత్మహత్యల వెనుక ఈ మధ్యే వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ.. ఆర్‌ ఎక్స్ హండ్రెడ్‌ కాన్సెప్ట్‌ ఉందని.. పోలీసుల విచారణలో తేలింది. రవితేజ, మహేందర్‌ లు ఇద్దరూ అమ్మాయిలతో చాటింగ్‌ చేసేవారన్న జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ.. ఇవి కేవలం ఆత్మహత్యలే కాదని స్పష్టం చేశారు. మహేందర్‌ గతంలో ఆర్‌ ఎక్స్ హండ్రెడ్‌ మూవీ హీరోలా చనిపోతానంటూ చాలా సార్లు అన్నట్లు విచారణలో తేలిందని.. చెప్పారు. ఆ సినిమాలోని హిట్‌ సాంగ్‌ను ఎక్కువగా వినే మహేందర్‌.. మత్తుకు అలవాటు పడ్డాడని తెలిపారు. 

ఒక ప్రేమ ... రెండు ప్రాణాలు

Submitted by arun on Mon, 10/01/2018 - 10:02

వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని ఎక్కడ కాదంటారోనని ఎవరికివారే మానసిక ఆవేదనకు గురయ్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మాయిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు.

ప్రేయసి పెళ్లి చెడగొట్టి.. ప్రేమికుడి ఆత్మహత్య

Submitted by arun on Wed, 09/19/2018 - 13:18

ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ఉద్రిక్తం చోటు చేసుకుంది. వెంకటకృష్ణ అనే యువకుడి ఆత్మహత్యకు.. ప్రియురాలి బంధువుల బెదిరింపులే కారణమని, మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. యువతి బంధువుల ఇళ్లపై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఏఎస్సైతో పాటు పలువురు గాయపడ్డారు. 

కోరిక తీర్చుకొని ఆమె సంసారంలో నిప్పులు పోశాడు..

Submitted by arun on Wed, 09/12/2018 - 13:47

పచ్చని కాపురంలో ఓ ప్రబుద్ధుడు చిచ్చురేపా డు. సజావుగా సాగుతున్న వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేశాడు.. స్నానం చేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీసి... వాటితో బెదిరించి లోబర్చుకున్నాడు... విషయం భర్తకు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటు భర్త.. అటు లోబర్చుకున్న యువకుడి వేధింపులు పడలేక మహిళ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఆత్మహత్యకు కారకుడైన వెంకటేష్‌ (19) అనే యువకుడిని మంగళవారం బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతిలో విషాదం...

Submitted by arun on Wed, 09/05/2018 - 14:37

ఆర్ధిక ఇబ్బందులు తాళ లేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పర్సాల వీధికి చెందిన లీలా కుమారి  పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. లీలాకుమారి కుమారుడు గంగాధర్‌  టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గంగధార్ రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పులు భారీగా పెరిగిపోవడంతో  తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరి నిమిషంలో రుయా ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు.

Tags

పరీక్షలో ఫెయిలైనందుకు యువ వైద్యురాలు ఆత్మహత్య

Submitted by arun on Tue, 08/07/2018 - 11:24

తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో తనను వేధిస్తున్నారంటూ ముగ్గురు ప్రోఫెసర్లపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన పీజీ పరీక్షలో శిల్పా ఫెయిల్ అయ్యారు. అయితే తనను కావాలనే ఫెయిల్ చేశాంరటూ ఆరోపించిన శిల్పా  రీవాల్యూయేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.  ఇందులో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే సొంతూరు పీలేరు చేరుకున్న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో  శిల్ప ఫెయిల్‌ అయింది.

అతడి ఆత్మహత్యను 2 వేల మంది లైవ్‌లో చూశారు

Submitted by arun on Wed, 08/01/2018 - 14:34

సమాజంలో మనిషి అనేవాడే మాయమైపోతున్నాడు. తోటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే ఓ యువకుడు లైవ్‌లో ప్రాణాలు తీసుకుంటుంటే చోద్యం చూశారే తప్ప ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నా సెల్ఫీలు తీసుకున్నారే తప్ప.. ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఆ ఘటనల్ని మర్చిపోకముందే మరొక దారుణం బయటపడింది. ఈసారి గుర్గావ్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రాణాలు తీసుకుంటుంటే సినిమా చూసినట్లు చూశారే తప్ప ఎవరూ కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. 

బిల్డింగ్‌పై నుంచి దూకి ఫిల్మ్ రైటర్ ఆత్మహత్య

Submitted by arun on Thu, 07/12/2018 - 11:28

బాలీవుడ్ సినిమా రచయిత 32 ఏళ్ల రవిశంకర్ అలోక్ ముంబైలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ అందేరీలో నివాసం ఉంటున్న అలోక్‌ బుధవారం మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో తను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అలోక్‌ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టమన్నారు. కాగా నానా పటేకర్‌ నటించిన అబ్‌ తక్‌ చప్పాన్‌ చిత్రాని రవి స్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడని సమాచారం.
 

అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.