Vijayawada

3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు

Submitted by arun on Thu, 07/05/2018 - 17:11

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గృహ నిర్మాణశాఖ అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేపట్టింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద  రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి.

బెజవాడలో శాడిస్ట్ పోలీస్

Submitted by arun on Wed, 07/04/2018 - 17:51

బెజవాడలో ఓ శాడిస్ట్ కానిస్టేబుల్ వేధింపులు తాళలేక అతడి భార్య ఆత్మహత్యా యత్నం చేసింది. భర్త మురళి వేధింపులను తట్టుకోలేని భార్య లక్ష్మీ ప్రసన్న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె శరీరం 90 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 

కేసీఆర్ మొక్కు చెల్లించిన ముక్కు పుడకలో 57 వజ్రాలు

Submitted by arun on Thu, 06/28/2018 - 14:20

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విజయవాడ కనకదుర్గమ్మను సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కేసీఆర్‌కు ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేకంగా చేయించిన ముక్కుపుడకను.. తలపై పెట్టుకుని మేళతాళాల మధ్య.. ఆలయంలోకి ప్రవేశించారు. తర్వాత ముక్కుపుడకను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు.. కేసీఆర్‌ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. 

కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్

Submitted by arun on Thu, 06/28/2018 - 13:17

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెజవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం ఏయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు.. మంత్రి దేవినేని ఉమా ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన నేరుగా గేట్ వే హోటల్‌కు వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ముక్కుపుడక కూడా సమర్పించుకోనున్నారు. 40 నిముషాల పాటు అమ్మవారి సన్నిధిలోనే గడపనున్నారు. 

రేపు విజయవాడలో పర్యటించనున్న కేసీఆర్‌

Submitted by arun on Wed, 06/27/2018 - 15:15

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. తెలంగాణ మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్‌ ...కనకదుర్గమ్మను దర్శించుకుని ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను కేసీఆర్‌ వరుసగా తీర్చుకుంటున్నారు. ఇక తన విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది.  ఇప్పటికే తిరుమల వెంకన్నకు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారికి, కురవి వీరభద్ర స్వామికి పెట్టిన మొక్కులను కేసీఆర్ తీర్చుకున్నారు.

మహిళలు బట్టలు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు

Submitted by arun on Mon, 06/25/2018 - 16:01

విజయవాడలోని దుర్గ గుడిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పెళ్లి బృందంలోని మహిళలు బస చేసిన సీవీ రెడ్డి చారిటీస్‌ డార్మిటరీలో సీసీ కెమెరాలు అమర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునే హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లగేజీ తీసుకెళ్లేందుకు వచ్చిన పెళ్లి బృందం సభ్యులు...సీసీ కెమెరాలను గుర్తించారు. దీనిపై అధికారులను నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం మూడు రోజుల నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదంటున్నారు. ఆలయ ఉద్యోగులు మాత్రం కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు.

పవన్ కల్యాణ్‌తో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ

Submitted by arun on Sat, 06/23/2018 - 14:28

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కొత్తింట్లో భేటీ అయ్యారు. అరగంట పాటు ఇద్దరూ సమావేశమయ్యారు. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇంతలోనే పవన్ తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.

పక్కపక్కనే నిల్చున్నా పలకరించుకోని చంద్రబాబు, పవన్!

Submitted by arun on Fri, 06/22/2018 - 12:51

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ‌్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడ్డారు. అయినా ఒకరిని ఒకరు కనీసం మాట వరసకు కూడా పలకరించుకోలేదు.  ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో వేర్వేరుగా వెళ్లిన ఇద్దరు నేతలు .. వేర్వేరుగానే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం ఇరువురు నేతలు ఒకేసారి బయటకు వచ్చినా ఒకరి వైపు మరోకరు కనీసం చూసుకోలేదు. బాబు స్ధానికులతో మాట్లాడుతుండగానే పవన్ అక్కడి నుంచే వేగంగా బయటకు వెళ్లిపోయారు. బయట పలువురు టీడీపీ నేతలున్నా ఆయన జనసేన కార్యకర్తలతో పాటు వెళ్లిపోయారు.

బెజవాడకు పవన్ షిఫ్ట్

Submitted by arun on Fri, 06/22/2018 - 11:32

ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె నివాసంలో కుటుంబ సమేతంగా కాలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ..ఇకపై అన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.  ఇందుకోసం  ఇంట్లోనే పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్న పోరాట యాత్రకు పవన్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు.