Vijayawada

దుర్గగుడిలో అధికారుల మధ్య ముదురుతున్న వివాదం

Submitted by arun on Mon, 11/05/2018 - 15:14

ఇంద్రకీలాద్రిపై అధికారుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా అసిస్టెంట్‌ ఈవో అచ్యుతరామయ్యపై ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించేలా వ్యాఖ్యానించారంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఏఈవోపై కేసు నమోదు చేశారు. ఇటు మెమెంటోల కొనుగోళ్లు అక్రమాలపై విచారణ జరుగుతుందని దీనికి సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని ఈవో తెలిపారు. 

పవన్ కల్యాణ్ ట్రైన్ జర్నీ..

Submitted by arun on Fri, 11/02/2018 - 12:31

పవన్ కల్యాణ్ మరో దఫా ప్ర‌జా పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇవాల్టి నుంచి పోరు బాట పడుతున్నారు. తుని నుంచి శ్రీకారం చుట్టే ఈ యాత్ర‌ను పవన్ వినూత్నంగా ప్రారంభించబోతున్నారు. తుని వెళ్ళడానికి పవన్ రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. వివిధ వర్గాల ప్రజలను, అభిమానులను కలుసుకుంటూ ఇవాళ మధ్యాహ్నం పవన్ విజ‌య‌వాడ నుంచి రైలు ప్రయాణం ప్రారంభిస్తారు. ఇందుకు జన్మ‌భూమి ఎక్స్ ప్రెస్ వేదిక కాబోతోంది. 

దుర్గగుడిలో ప్రొటోకాల్‌ వివాదం...ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర అవమానం

Submitted by arun on Tue, 10/16/2018 - 12:49

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ప్రోటోకాల్‌ వివాదం రేగింది. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర  అవమానం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్‌ ఉన్న ఆయన రాకముందే అసిస్టెంట్‌ ఈవో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తీవ్ర వివాదాస్పదమైంది.  అధికారలు తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. 

ప్రాణం తీసిన ఐటీ నోటీసులు

Submitted by arun on Tue, 10/16/2018 - 11:03

ఐటీ నోటీసులు విజయవాడలో ఓ వ్యాపారి ప్రాణాలు తీశాయి. ఆటోనగర్ లో లారీ బాడీబిల్డింగ్  వర్క్ షాప్  నిర్వహిస్తున్న సాధిక్ కు పన్ను చెల్లించాలని ఇటీవల ఐటీ అధికారుల నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న సాదిక్ రెండు రోజుల క్రితం స్క్రూ బిడ్జి  దగ్గర బందర్  కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఐటీ అధికారుల వేధింపులతో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 
 

Tags

విజయవాడకి ఎందుకా పేరు

Submitted by arun on Fri, 10/12/2018 - 17:20

విజయవాడ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా..  విజయవాడ అనే పేరు వెనుక అనేక పురాణములు ఉన్నాయి. అందులో ఒకటి దుర్గ దేవత రాక్షసుడిని హతమార్చి, కొంతకాలం ఈ ప్రదేశంలో విశ్రమించిందని ప్రసిద్ది. అలాగే  ఆమె విజయం సాధించినప్పుడు ఈ ప్రదేశం విజయవాడ "ప్లేస్ అఫ్ విక్టరీ" అని పిలువబడుతుంది అని కొందరి నమ్మకం. శ్రీ.కో.

Tags

ఎన్నికల వేళ తెరపైకి మరో కొత్త పార్టీ...ఓట్లతో సత్తా చూపుతామని శపధం

Submitted by arun on Mon, 10/01/2018 - 10:28

విజయవాడలో సమావేశమైన భార్యా బాధితుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అది తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చాలని డిసైడ్ అయింది. అన్ని చట్టాలు భార్యలకు అనుకూలంగానే ఉన్నాయని, భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని భార్యా బాధితుల సంఘం ఆరోపించింది. తెలుగు రాష్ట్రాలలో ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి తద్వారా భార్యా బాధితుల సంఘం వెల్లడించింది.

మార్పులతో పార్టీకి కొత్త తలనొప్పులు...విజయవాడ ఈస్ట్ అండ్‌ వెస్ట్‌కి తగిలిన సెగ

Submitted by arun on Thu, 09/20/2018 - 10:48

సర్వేలు, సమీకరణాలు అంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చడం వైసీపీలో గందరగోళానికి దారితీస్తోంది. కృష్ణాజిల్లాలో తాజాగా జరిగిన నాయకత్వ మార్పు పార్టీ నేతలను అయోమయంలోకి నెట్టింది. విజయవాడ సెంట్రల్‌లో రాజుకున్న నిప్పు ఇప్పుడు జిల్లా మొత్తం అంటుకుంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చే పని మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చిన రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లా నుంచి ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.

ప్రణయ్‌ హత్య తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్న ప్రేమజంటలు

Submitted by arun on Wed, 09/19/2018 - 10:52

తీవ్ర సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణ‍య్‌ హత్యతో ప్రేమజంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకొచ్చారు. ప్రణయ్ మర్డర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రేమజంటలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రణయ్‌ హత్య తర్వాత ఆందోళనకు గురైన ఓ ప్రేమజంట మీడియా ముందుకొచ్చింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు మూడు నెలలుగా తమ బంధువులు బెదిరిస్తున్నారంటూ నవ దంపతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉద్యోగుల ఇబ్బందులకన్న, ప్రభుత్వ ప్రసన్నతే మిన్నలా

Submitted by arun on Mon, 08/13/2018 - 13:44

AP ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబుకి అవమానమా,

ప్రభుత్వ ఉపాధ్యాయుల విజయవాడలో చూసింది ఆగ్రహామా,

"అశోక్ బాబు వెనక్కి వెళ్లు" అని అందరు కలిసి అరిచారు,

మాట్లాడటానికి కూడా అనుమతించక ఇబ్బంది పెట్టారు,

ఉద్యోగుల ఇబ్బందులకన్న, ప్రభుత్వ ప్రసన్నతే మిన్నలా చేస్తున్నాడని.  శ్రీ.కో 

విజయవాడలో సరోగసి దందా...ఇంజక్షన్ ఇవ్వబోతుండగా భయభ్రాంతులకు గురైన మహిళ

Submitted by arun on Sat, 08/11/2018 - 14:04

విజయవాడలో సరోగసి దందా బయటపడింది. కార్తీకదత్తా ఐవీఎఫ్‌ సెంటర్‌లో అద్దె గర్భం దందా నడుస్తోంది. గుంటూరు నుంచి మహిళలను తీసుకొచ్చి అద్దె గర్భం కోసం మహిళలతో బేరసారాలు చేస్తున్నారు. అయితే అద్దె గర్భానికి ఓ మహిళ నిరాకరించడంతో కార్తీకదత్తా ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నర్సింగ్‌ కోసమని చెప్పి గుంటూరు నుంచి ముగ్గురు మహిళలను తీసుకొచ్చిన కార్తీకదత్తా ఐవీఎఫ్‌ సెంటర్‌ యాజమాన్యం ఏమీ చెప్పకుండా ఏదో ఇంజక్షన్‌ ఇవ్వబోతుండగా ఓ మహిళ భయబ్రాంతులకు గురైంది. బాధితురాలు డయల్‌ 100కి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.