24

'స్పైడ‌ర్‌'లో ఆ సీన్స్ లేవు

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 15:05

పొగ‌త్రాగే స‌న్నివేశాలు, మందు తాగే స‌న్నివేశాలు లేకుండా సినిమాలు ఉంటాయా? అది కూడా బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు ఉండే సినిమాల్లో. అంటే.. దానికి స‌మాధానం ఉండ‌వు అనే వినిపించేది. అయితే ఇప్పుడిప్పుడే ఈ త‌ర‌హా సినిమాలకు బ్రేక్ ప‌డుతోంది. గ‌తేడాది వ‌చ్చిన '24' సినిమాలో సూర్య త్రిపాత్రిభినయం చేస్తే.. అందులో ఆత్రేయ అనే పాత్ర విల‌న్‌. అయితే ఎక్క‌డా మందు, పొగ తాగే స‌న్నివేశాలు లేకుండా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ సినిమాని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు.

అప్పుడు సూర్య‌తో.. ఇప్పుడు విజ‌య్‌తో..

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 15:05

2016లో జ‌రిగిన ఓ విష‌య‌మే.. 2017లోనూ స‌మంత‌కి రిపీట్ కాబోతోంది. కాస్త‌వివ‌రాల్లోకి వెళితే..  2016లో సూర్య త్రిపాత్రాభిన‌యం చేసిన '24' చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టించిన స‌మంత‌.. ఇప్పుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న 'మెర్స‌ల్' చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయా హీరోల త్రిపాత్రాభిన‌యంతో పాటు మ‌రో రెండు కామ‌న్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి స‌మంత‌కి.

'మ‌నం' డైరెక్ట‌ర్ స్టైల్ మార్చాడు

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 11:25

'ఇష్క్‌', 'మ‌నం', '24'.. ఇలా ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని డిఫ‌రెంట్‌ స‌బ్జెక్ట్‌ల‌తో సినిమాలు చేసి ద‌ర్శ‌కుడిగా మెప్పించాడు విక్ర‌మ్ కుమార్‌. శ్రియ తొలి తెలుగు చిత్రం 'ఇష్టం'కి ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రించిన విక్ర‌మ్‌.. ఆ త‌రువాత‌ త‌మిళ‌, హిందీ చిత్రాల వైపు దృష్టి పెట్టాడు. మ‌ళ్లీ 'ఇష్క్‌'తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన‌ విక్ర‌మ్ కి ఓ అల‌వాటు ఉంది. 

సూర్య‌@ 20  

Submitted by nanireddy on Wed, 09/06/2017 - 10:10

'గ‌జిని'తో తెలుగువారికి చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. 'శివ‌పుత్రుడు', 'య‌ముడు', 'వీడొక్క‌డే', 'బ్ర‌ద‌ర్స్‌', '24' త‌దిత‌ర చిత్రాల‌తో త‌న మార్కెట్ స్థాయిని మ‌రింత పెంచుకున్నాడు. ఇప్ప‌టికి 40 చిత్రాలు పూర్తిచేసిన సూర్య‌.. ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 41వ చిత్రం చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం 'తాన సేరంద్ర కూట‌మ్' అనే పేరుతో తెర‌కెక్కుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కానుంది. ఇదిలా ఉంటే.. సూర్య తొలి (త‌మిళ‌) చిత్రం 'నేర‌క్కు నేర్' విడుద‌లై నేటితో (సెప్టెంబ‌ర్ 6)కి స‌రిగ్గా 20 ఏళ్లు అవుతోంది.