Karnataka

బీజేపీకి షాక్‌

Submitted by arun on Wed, 06/13/2018 - 15:04

కర్ణాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప  ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. తాజా గెలుపుతో కాంగ్రెస్‌ బలం 80కి చేరింది. జయనగర బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ స్థానానికి జూన్‌ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్‌ నమోదైంది.
 

‘నేను సీఎం కావడం మా నాన్నకు ఇష్టం లేదు’

Submitted by arun on Tue, 06/12/2018 - 17:26

తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతల​​కు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతోనే ఆయనీ సూచన చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘‘నాకు ఇప్పటికే రెండుసార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇటువంటి సమయంలో నేను సీఎం కావడం అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయనీ సూచన చేసి ఉండొచ్చు’’ అని వివరించారు.

పించన్ ఇవ్వడం లేదని కుష్టురోగి పాముతో ఆఫీసుకు వచ్చినవేళ...

Submitted by arun on Sat, 06/09/2018 - 12:54

కర్ణాటక రాష్ట్రంలో ఓ కుష్ఠి రోగి తన సమస్యను వినూత్నంగా పరిష్కరించుకున్నాడు. గత 8 నెలలుగా తనకు పెన్షన్ రాకపోవడంతో మెడలో పామును వేసుకుని పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాడు. అధికారులకు దడ పుట్టించాడు. అనుకున్నది సాధించాడు. 

నా లవర్‌తోనే చనువుగా ఉంటావా..!

Submitted by arun on Wed, 06/06/2018 - 15:38

తన గర్ల్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటున్నాడని ఆమె స్నేహితుడిని కత్తితో పొడిచాడో ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగేరె కేటీజే నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ లింగరాజు​కుమారుడు రాకేశ్‌ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని రాకేశ్‌ తెలుసుకున్నాడు. తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్‌. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్‌ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

కర్నాటకలో కాలా మూవీ విడుదలకు లైన్ క్లియర్

Submitted by arun on Tue, 06/05/2018 - 16:40

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీ కర్ణాటకలో విడుదలకు లైన్‌ క్లియరైంది. సినిమా విడుదలకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. కావేరీ జలాలను తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాలంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ అనుకూల సంస్థలు కాలా విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో కాలా మూవీ విడుదలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ...ఎలాంటి అవాంచనాలు కలకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

కర్ణాటకలో వింతజీవి.. కలకలం

Submitted by arun on Tue, 06/05/2018 - 13:16

ఓ వింత ఆకారాన్ని పట్టుకున్నారని అది దెయ్యమని కొందరు కాదు కాదు ఏలియన్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ జీవికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడలెత్తిస్తున్నాయి. పంజాలోని ఓ మారు మూల ప్రాంతమని లేదు లేదు కర్ణాటకలోని ఓ మారు మూల గ్రామం అని ప్రచారం చేస్తున్నారు. పశువులపై దాడి చేస్తున్న ఆ వింతజీవిని జనం పట్టుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆ దృశ్యాలు మాత్రం నిజం కాదని ఏదో షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినవనే మరో ప్రచారమూ సాగుతోంది.

కర్నాటక ప్రభుత్వంలో కలకలం

Submitted by arun on Mon, 06/04/2018 - 10:55

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. లింగాయత్ కోటాలో పదవిని ఆశించిన ఎస్ఆర్ పాటిల్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెబుతున్నారు. కానీ, కారణం అది కాదని, జేడీఎస్- కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించారని చెబుతున్నారు. ఆ పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీ పదవులకు రిజైన్ చేసినట్టు చెబుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ఆయన సీనియర్ నేత, ఆ రాష్ర్ట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా!

బీజేపీకి కష్టకాలం మొదలైందా..ఉప ఎన్నికల్లో వరుస ఓటమికి కారణమేంటి..?

Submitted by arun on Fri, 06/01/2018 - 11:07

నాలుగేళ్ళ ఏడాది క్రితం వరకు తనకు ఎదురు లేదని భావించిన బీజేపీకి కష్టకాలం మొదలైందా..? ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడానికి కారణమేంటి..? మోడీ మేనియా తగ్గిందా..? అమిత్‌ షా మ్యాజిక్ పని చేయడం లేదా..? విపక్షాల ఐక్యతే కమల నాథుల కొంప ముంచుతోందా..? మొత్తంగా 2019 ఎన్నికల్లో మోడీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనా..?

మంత్రి కాబోతుండగా డీకే శివకుమార్ కు ఊహించని షాక్

Submitted by arun on Thu, 05/31/2018 - 17:21

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ, జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయనకు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి ఆయనకు సంబంధించిన వ్యక్తుల నివాసాలపై సెర్చ్ వారెంట్ తో అకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలతో శివకుమార్ షాక్ కు గురయ్యారు. తన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ అయిన డీకే సురేష్ తో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను తమకు నచ్చని వారిపై ఉసిగొల్పుతోందని ఆయన చెప్పారు.

పంతం నెగ్గించుకున్న జేడీఎస్‌

Submitted by arun on Thu, 05/31/2018 - 15:36

కర్నాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మంత్రి పదవుల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు హోంశాఖ ఇచ్చేందుకు అంగీకరించిన కుమారస్వామి .. కీలకమైన  హోంశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థికశాఖను సీఎం కుమారస్వామి తీసుకోనుండగా, హోం శాఖ కోసం కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌తో పాటు మరి కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఆర్థిక శాఖ జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు రానున్నట్లు తేలింది. ఈ రోజు సాయంత్రం కర్ణాటక మంత్రివర్గంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మిగతా శాఖల బాధ్యతలు ఎవరెవరు చేపట్టనున్నారన్న విషయాన్ని వెల్లడించి, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.