hindupuram

బాలయ్య బాబు డాన్స్

Submitted by arun on Sat, 06/30/2018 - 15:20

ఆడేపల్లి గ్రామంలో మన బాలయ్య,

ఆడెనుగా నలుగురితో కలిసి కృష్ణాయ్యలా!

అదిరిపోయే డైలాగుల ముద్దుల మామయ్య,

అన్నగారి చిత్రంతోఎన్ని సిత్రాలొ రామయ్యలా!

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన బాలయ్య

Submitted by arun on Fri, 06/29/2018 - 17:07

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామబాట పట్టారు. మొన్న పల్లె నిద్ర చేసిన ఆయన.., ఇవాళ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పాతచమలపల్లి, దేమకేతేపల్లి, టేకులోడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆడేపల్లి గ్రామంలో గిరిజన మహిళలతో బాలకృష్ణ సరదాగా నృత్యం చేశారు. 


 

హిందూపురంలో బాలయ్య బ్యాటింగ్‌

Submitted by arun on Sat, 12/30/2017 - 14:07

అనంతపురం జిల్లా హిందూపురంలో టాలీవుడ్‌ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  సందడి చేశారు. హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన నందమూరి బసవతారకరామా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్‌ షాట్స్‌ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్‌ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు మైదానానికి తరలివచ్చారు.