Kadiyam Srihari

7 నుంచి 12వ తరగతి చదువుతున్న వారికి హెల్త్‌కిట్స్: మంత్రి కడియం

Submitted by arun on Thu, 06/07/2018 - 15:41

ఈ ఏడాది నుంచే 84 చోట్ల జూనియర్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి  కడియంశ్రీహరి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కడియం... 84 కేజీబీవీలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. విద్యార్థులు శారీరక, మానసిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని..  అన్ని హాస్టళ్లలో ఒకే రకమైన మెనూను అమలు చేస్తున్నామన్నారు. అంతే కాక 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య కిట్‌లు అందిస్తామన్నారు. ఉపాధ్యాయ నిమామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్ణయం తీసుకోగానే కాంగ్రెస్ వారే కోర్టులో కేసులు వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Submitted by arun on Fri, 04/13/2018 - 10:22

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో 62.3 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,55,789 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,29,378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,88,772 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

చంద్రబాబు గాలి తీసేసిన కడియం!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:37

కడియం శ్రీహరి.. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రే కావొచ్చు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడే అయి ఉండొచ్చు. కానీ.. ఒకప్పుడు టీడీపీలో కూడా కడియం శ్రీహరి అగ్ర నాయకుడిగా ఎదిగారు. మంత్రి అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా గెలిచి.. రాజీనామా చేసి చివరికి ఎమ్మెల్సీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. అలాంటి చంద్రబాబు మాజీ అనుచరుడు కడియం ఇప్పుడు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ సర్కార్

Submitted by arun on Thu, 02/22/2018 - 10:50

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు హైల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ అందించనున్నారు.

మందకృష్ణపై టీఆర్ఎస్‌‌ ఎదురుదాడి

Submitted by arun on Sat, 12/30/2017 - 11:42

మందకృష్ట మాదిగపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేయాల్సింది గల్లీలో కాదు.. ఢిల్లీలో అని హితవు పలికారు. కేసీఆర్‌ను తిడుతూ బీజేపీ నేతలతో కలిసి తిరిగితే సమస్య పరిష్కారమవుతుందా అని  ప్రశ్నించారు. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లేందుకు జనవరి 5 లోపు పీఎంవో నుంచి పిలుపు రాకపోతే.. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో.. కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కడియం.