kerala

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Submitted by arun on Tue, 05/29/2018 - 14:02

ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ ఒకటిన కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయంటూ భారత వాతావరణ శాఖ ప్రకటించినా ...మూడు రోజుల ముందుగానే పలకరించాయి. దీంతో వచ్చే నెల ఐదున తెలంగాణను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. 

కర్ణాటకలో నిఫా వైరస్ కలకలం : ఇద్దరి శరీరంలో వ్యాధి లక్షణాలు

Submitted by arun on Wed, 05/23/2018 - 15:08

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బుధవారం(మే-23) కర్ణాటకకు చెందిన హెల్త్ అధికారి తెలిపారు. పూర్తి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం వారి రక్త నమూనాలు మణిపాల్ పంపించాం అని.. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న ఇద్దరిని..

మహిళలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారా?

Submitted by arun on Sat, 04/07/2018 - 14:38

నిజమా... లేడీస్‌ జీన్స్‌ వేసుకోవద్దా? వేసుకుంటే నపుంసకులు పుడతారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు కేరళ ప్రొఫెసర్‌ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు? పుట్టకతోనే హిజ్రాలుగా పుడతారా? ఇంటర్‌ సెక్స్‌ అనే అరుదైన కేసుకు జీన్స్‌కు ఎందుకు లింక్‌ పెట్టారు?

పేరు డాక్టర్‌ రజిత్‌కుమార్‌. కేరళలో ప్రొఫెసర్‌. అధ్యాపక వృత్తిలో ఉన్న రజిత్‌కుమార్‌ అంత చదువుకొనీ ఇలా మాట్లాడరని చర్చించుకుంటుంది మహిళాలోకం. కేరళలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ తీసుకుంటున్న రజిత్‌కుమార్‌ తమను తీవ్రంగా అవమానంచారంటారు ట్రాన్స్‌జెండర్లు. 

చెట్టుకు క‌ట్టేసి సెల్ఫీలు దిగి

Submitted by arun on Fri, 02/23/2018 - 12:56

దుకాణాలలో వస్తువులను దొంగిలిస్తున్నాడనే ఆరోపణతో కొంతమంది ఓ వ్యక్తిని కట్టేసి కొట్టిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. అయితే సదరు వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇదిలాఉండగా ఆ వ్యక్తిని కట్టేసి కొడుతుండగా కొంతమంది యువకులు సెల్ఫీలు దిగుతూ మరోవైపు పైశాచిక ఆనందాన్ని పొందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 27 ఏళ్ల యువకుడు మతిస్థిమితం లేని వాడు. కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గల అత్తపాడి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. అయితే, అతడు ఆ గ్రామంలోని దుకాణాల్లో తినుబండారాలు దొంగిలించి జీవనం సాగిస్తున్నాడని నలుగురు చెబుతుండటంతో అతడిని ప్రత్యేకంగా పట్టుకున్నారు.

బీజేపీలో చేరితే మా నాన్నను చంపేస్తారా?

Submitted by arun on Sat, 02/10/2018 - 15:56

కేరళలో ఓ బాలిక వీడియో సంచలనంగా మారింది. సీపీఎం కార్యకర్తల మూలంగా తన కుటుంబానికి ముప్పు పొంచి ఉందని సదరు బాలిక ఓ వీడియోను రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో రాజకీయంగా ఒక్కసారిగా పెను దుమారం చెలరేగింది. కేరళ ఉత్తరాదిలో ఒక మారుమూల పంచాయతీ గ్రామంలో సీకే సుకుమారన్ ఇటీవల బీజేపీ సభ్యత్వం పుచ్చుకున్నారు. రెండు పార్టీల్లో అక్కడి జరిగే ఆధిపత్య పోరులో ఇటువంటివన్నీ సర్వసాధారణం. కాకపొతే.. ఈ సుకుమారన్ అనే సన్నకారు కార్యకర్త మీద అక్కడి కమ్యూనిస్టులు కత్తి కట్టేశారు. కత్తీకొడవలి వదిలిపెట్టి కమలంపార్టీలో కూర్చుంటావా.. నీకెన్ని దమ్ములు అంటూ.. బెదిరింపులకు దిగేశారు.

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు

Submitted by arun on Tue, 01/30/2018 - 18:11

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు....మచ్చుకైన లేడు చూడు...మానవత్వం ఉన్నవాడు...అని అందెశ్రీ ఎప్పుడో పాట రాసేశారు. అచ్చంగా కేరళో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళలో నాలుగంతస్థుల భవనం మీద నుంచి ఓ వ్యక్తి...ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాడు. వాహనదారులు, పాదాచారులు చూస్తుండగానే కిందపడిపోయాడు. రోడ్డు మీద ఉన్న వారికి కాసేపు ఎలా పడ్డాడో అర్థం కాలేదు.

కొడుకు శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి..!

Submitted by lakshman on Fri, 01/19/2018 - 07:30

ఓ క‌న్న‌త‌ల్లి త‌న కొడుకును అత్యంత దారుణంగా హ‌త్య చేసి చంపేసింది. ఏమీ తెలీయ‌న‌ట్లుగానే కొడుకు క‌నిపించ‌డంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో క‌న్న‌త‌ల్లే  కొడుకును హ‌త్య చేసింద‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. 

లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Submitted by lakshman on Mon, 09/25/2017 - 21:39
ఆ 46 ఏళ్ల వ్యక్తి నక్క తోకను తొక్కాడో లేక తథాస్తు దేవతలు దీవించారో తెలియదు కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. అదీ లాటరీ టికెట్ రూపంలో. లాటరీ టికెట్ అనగానే ఏ లక్ష రూపాయలో, రెండు లక్షల రూపాయలో...

రెండున్నర గంటలు నడి ఎండలో ఇలా..!

Submitted by lakshman on Thu, 09/14/2017 - 21:36
కేరళలో ఇటీవల కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. పయ్యనూరులో జరుగుతున్న ఈ శోభాయాత్రలో ఆకు ఆకారంపై చిన్ని కృష్ణుడు కూర్చున్నట్లుగా ఓ బాలుడు కనిపించడం వివాదాస్పదంగా...

కుక్క చనిపోతే ఊరుఊరంతా శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టారు!

Submitted by lakshman on Wed, 09/13/2017 - 20:33

కేరళ: రోడ్డు మీద ఒక శవం కనిపిస్తేనే మనకెందుకొచ్చిందిలే అని దులిపేసుకుపోతున్న రోజులివి. అలాంటిది ఓ వీధి కుక్క చనిపోతే ఊరుఊరంతా శోకసంద్రంలో మునిగిపోవడం ఈరోజుల్లో వింతే. అలాంటి వింత ఘటనే కేరళలోని కుంజిపల్లి గ్రామంలో జరిగింది. సెప్టెంబర్ 8న ఈ ఊళ్లో ఓ వీధికుక్కను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వీధికుక్క అంటే ఈ గ్రామస్తులు కోపగించుకుంటారు. దాని పేరు అలీ అప్పు. ఒక వీధికుక్కపై ఎందుకంత ప్రేమని అడిగితే ఆ ఊరి జనం చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.