chittoor

అగ్నికి ఆహుతైన కుటుంబం...

Submitted by chandram on Sun, 11/11/2018 - 16:29

వారికదే చివరిరాత్రి అయ్యింది. పడుకున్నవారు పడుకున్నట్లే సజీవదహనం అయ్యారు. తెల్లవారే సరికి బూడిదగా మిగిలారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో భార్య భర్తతో పాటు ఇద్దరు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. అయితే వీరిది హత్యా, లేక ఆత్మహత్యా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్‌ సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతుంటే కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే వీరి మరణానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. 
 

ఎంపీ శివప్రసాద్‌పై తమన్నా‌ ఫిర్యాదు

Submitted by arun on Mon, 08/13/2018 - 14:40

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వర్షాకాల సమావేశాల్లో తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణంలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణలో తన నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయన శుక్రవారం హిజ్రా వేషంలో ఆందోళన నిర్వహించారు.

సి.కె. బాబు పయనమెటు?

Submitted by arun on Thu, 07/26/2018 - 13:12

చిత్తూరులో రాజకీయం క్షణానికో రకంగా మారుతోంది. నియోజక వర్గం గడప దాటని సి.కె. బాబు వైపు ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లా చూస్తోంది. నమ్ముకున్న కాంగ్రెస్ ను విభజన పాతరేసింది. పార్టీ మారడం ఇష్టం లేని నేతలు  సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోగా కొత్త పార్టీలు పుట్టుకొచ్చి స్థానికంగా బలపడుతుండటంతో చిత్తూరు రాజకీయాల్లో దిగ్గజం లాంటి సి.కె. బాబు ఎటు వెళ్లాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారా? సి.కె. బాబు చూపు ఎటు?

చిత్తూరు జిల్లాలో దారుణం: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

Submitted by arun on Thu, 05/24/2018 - 12:36

చిత్తూరు జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో దారుణం జరిగింది.  బాలికకు డబ్బు ఆశగా చూపి ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా వెలుగుచూసింది  స్ధానికంగా ఉన్న బాలికను తొలుత లోబర్చుకున్న యువకుడు  ...తన స్నేహితులతో విషయం చెప్పడంతో  బ్లాక్ మెయిల్ కు దిగిన నలుగురు స్నేహితులు  అత్యాచారానికి పాలడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ నాలుగు నెలలుగా ఇదే తరహాలో అత్యాచానికి పాల్పడుతూ వచ్చారు.   నిన్న ఈ విషయం తెలుసుకున్న  బాలిక తల్లి  నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Sun, 03/25/2018 - 11:24

చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు సేలం నుంచి తిరుపతి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు రేణిగుంట చంద్రగిరి మార్గంలో అదుపుతప్పి  20 అడుగుల లోతు గొయ్యిలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సహాయంతో పైకి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రజాసంకల్పయాత్రకు 50 రోజులు

Submitted by arun on Tue, 01/02/2018 - 10:48

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర 50వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా సీటీఎం నుంచి జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. పులవాండ్లపల్లి, వాల్మీకిపురం, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిలవారిపల్లె మీదుగా జగన్‌ పాదయాత్ర సాగనుంది. జిల్లాకో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన బాబు మాట తప్పారని, రుణమాఫీ విషయంలో అదే జరిగిందని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు కోసం వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
 

బాబు జిల్లాలో జగన్

Submitted by arun on Fri, 12/29/2017 - 18:48

అన్ని జిల్లాలూ ఒక ఎత్తు చిత్తూరు జిల్లా మరో ఎత్తు అంటున్నారు వైసీపీ నేతలు. జగన్‌ పాదయాత్ర మూడు జిల్లాల్లో కంప్లీట్‌ చేసుకొని చిత్తూరు జిల్లాలోకి ఎంటరవడంతో సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకి షాకిచ్చినట్లే 2019లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు.