YS Jagan Mohan Reddy

రేపే ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం

Submitted by chandram on Sun, 11/11/2018 - 16:56

ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 17రోజుల విరామం అనంతరం రేపట్నుంచి ప్రజాసంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. దాదాపు 17రోజుల చికిత్స, విరామం తర్వాత మళ్లీ రేపట్నుంచి జనంతో మమేకమవడానికి సిద్ధమవుతున్నారు. గాయం నుంచి కోలుకున్న జగన్‌ పాదయాత్ర కోసం బయల్దేరి వెళ్లారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయల్దేరిన జగన్‌ ఈ రాత్రికే విశాఖ నుంచి విజయనగరం జిల్లా చేరుకోనున్న జగన్‌. రేపు ఉదయం మక్కువ నుంచి పాదయాత్రను తిరిగి కొనసాగించనున్నారు.

వైఎస్‌ జగన్‌ను పరామర్శించిన మోహన్‌బాబు

Submitted by arun on Fri, 11/02/2018 - 15:17

విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ కోలుకుంటున్నారని.. వందేళ్లు బతుకుతారని ఆకాంక్షించారు. కాంగ్రెస్, టీడీపీ పరస్పరం సహకరించుకోవడంపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధిగా అడగ్గా.. దయచేసి తనను వదిలేయాలని, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని మోహన్‌బాబు చెప్పారు.

రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మద్దతు ఏ పార్టీకంటే...

Submitted by arun on Sat, 07/21/2018 - 11:50

రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఒక్క మాటతో తేల్చేశారు. కాకినాడ పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సంత‌కం చేస్తారో వారికే మ‌ద్ద‌తిస్తామని ఈ సందర్భంగా తేల్చిచెప్పేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు పేల్చిన జగన్‌‌

Submitted by arun on Tue, 06/05/2018 - 19:33

తన చేతికి గడియారం ఉండదు... వేలికి ఉంగరం ఉండదు.... మెడలో బంగారు గొలుసు ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై... వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. వేలికి ఉంగరం, మెడలో గోల్డ్‌ చైన్‌ ఉండదు కానీ... రెండెకరాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆస్తి మాత్రం సంపాదించారని అన్నారు. చంద్రబాబు చేతికి గడియారం ఉండదు కానీ వేలకోట్ల హెరిటేజ్‌ కంపెనీ... రాజభవనంలాంటి ఇల్లు... ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల నల్లధనం మాత్రం ఉన్నాయన్నారు. అమ్మాయిల వంక చూడనంటూ... 70ఏళ్ల వయసులో చంద్రబాబు చెప్పడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. చంద్రబాబు మద్యం తాగరు కానీ...

పిల్లలను బడికి పంపితే రూ.15వేలిస్తాం : వైఎస్‌ జగన్‌

Submitted by arun on Fri, 01/05/2018 - 13:53

ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని పాద‌యాత్ర ద్వారా గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  శుక్రవారం ఉదయం 53వ రోజు పాదయాత్రను ఆయన పుంగనూరు నియోజకవర్గం కురవల్లి శివారు నుంచి ప్రారంభించారు. పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. గండ్లపల్లి, కంభంవారిపల్లి మీదుగా కందూరి క్రాస్‌ చేరకున్న వైఎస్‌ జగన్‌ ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మన గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలి

Submitted by arun on Fri, 01/05/2018 - 12:01

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని, వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.

అయనకు సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు : మంత్రి సునీత

Submitted by arun on Fri, 12/29/2017 - 18:24

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రాప్తాడులో రుణమాఫీ పరిష్కార వేదికను ప్రారంభించిన మంత్రి.. రైతు రుణపత్రాలు పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ సొమ్ముఅందజేస్తామన్నారు. జగన్‌ అవాస్తవాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్ధితిలో లేరని సునీత అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.