kerala

తెరుకుచున్న 'శబరిమల' తలుపులు

Submitted by chandram on Fri, 11/16/2018 - 19:54

మండల పూజల కోసం శబరిమల ఆలయం మరోసారి తెరుచుకుంది. భక్తుల శరణుఘోష మధ్య ప్రధాన అర్చకుడు కందరవు రాజీవరు ఆలయం ద్వారాలను తెరిచారు. ఈ సారి రెండు నెలలకు పైగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. మరోవైపు సుప్రీం ఆదేశాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అయ్యప్పను దర్శించుకునేందుకు భూమాత బ్రిగేడ్‌ సంస్థ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్‌ స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగి చూశారు. 

నేటి నుంచి శబరిమలలో పూజలు

Submitted by chandram on Fri, 11/16/2018 - 12:05

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్‌.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు.

శబరిమల కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Submitted by chandram on Tue, 11/13/2018 - 17:43

అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 49 పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత తీర్పుపై మాత్రం ప్రస్తుతం స్టే ఇవ్వలేమని పేర్కొంది.

వయసు 96.. మార్కులు 98

Submitted by arun on Fri, 11/02/2018 - 10:19

మనో బలం ముందు వయో భారం గడ్డి పోచ వంటిదని నిరూపించిన బామ్మను కేరళ ప్రభుత్వం సత్కరించింది. అక్షరలక్షం అక్షరాస్యత కార్యక్రమంలో జరిగిన పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించిన కార్తియాని అమ్మను ముఖ్యమంత్రి పినరయి విజయన్ సన్మానించారు. 

స్వామి సందీపానంద ఆశ్రమంపై దాడి... వాహనాలకు నిప్పు

Submitted by arun on Sat, 10/27/2018 - 11:55

కేరళలో స్వామి సందీపానంద గిరి స్వామి ఆశ్రమాన్ని తగులబెట్టారు. భగవద్గీత స్కూల్ డైరక్టర్‌గా స్వామి సందీపానంద కొనసాగుతున్నారు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సందీపానంద స్వామి మద్దతు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు స్వామి ఆశ్రమంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కుందమన్‌కడవు ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో రెండు కార్లు, ఓ స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శుక్రవారం అర్థరాత్రి 2.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లె, శబరిమల తంత్రితో పాటు పాండలం రాజ కుటుంబమే ఈ దాడికి కారణమంటూ సందీపానంద ఆరోపించారు.

హెల్మెట్ ఏదీ?.. అంటూ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికి రూ.2 వేల జరిమానా విధించిన పోలీసులు!

Submitted by arun on Mon, 10/08/2018 - 12:40

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అది లేకుండా బండెక్కితే భారీ జరిమానా తప్పదు. అయితే, ఈ నిబంధన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు. అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు.

Tags

శబరిమలపై సుప్రీం తీర్పును నిరసిస్తూ భారీ ర్యాలీ

Submitted by arun on Thu, 10/04/2018 - 11:05

కొందరు మహిళలు ఎన్నాళ్లో వేచిన సమయం శబరిమల ఆలయ ప్రవేశం. ఆ తీర్పు రానే వచ్చింది. అయితే ఇప్పుడా తీర్పుపై జరగాల్సిన చర్చ జరుగుతుంది. సుప్రీం తీర్పును స్వాగతించిన వారు కొందరైతే వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. కేరళలో చట్టానికి వ్యతిరేకంగా, సాంప్రదాయమే పాటిస్తామంటూ కొందరు మహిళలు సేవ్‌ శబరిమల పేరుతో నిరసనలు చేపట్టారు.

సుప్రీం కోర్టు శబరిమల ఆయల తాజా తీర్పుపై హిందూ మహిళా సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అన్నీ వయసుల మహిళలు ఆలయంలోని వెళ్గొచ్చని తీర్పునివ్వగా ఈ తీర్పును మహిళా సంఘాలు స్వాగతిస్తే, హిందూ మహిళా సంఘం మాత్రం తాము ఆలయంలోకి వెళ్లమని చేప్తోంది.

Tags

కేరళలో ఎల్లోఅలర్ట్‌.. మళ్లీ భారీ వర్షసూచన...

Submitted by arun on Mon, 09/24/2018 - 17:52

వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ఆ విపత్తు నుంచి తేరుకోకముందే, మరో ముప్పు ముంచుకొచ్చింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, కేరళలోని ఏడు జిల్లాల్లో 64.4 మిల్లీమీటర్ల నుంచి 124.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంవో వెల్లడించింది.

కేరళను వణికిస్తోన్న ర్యాట్ ఫీవర్

Submitted by arun on Tue, 09/04/2018 - 10:30

వరదలతో అతాలకుతలమైన కేరళ వాసులను కొత్త సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయ్. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో లెప్టోస్పిరోసిస్‌ వణికిస్తోంది. తీవ్రజ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. లెప్టోస్పిరోసిస్‌తో ఇప్పటి వరకు  2వందల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరితే 10 మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన వారిలో ఐదుగురు కార్మికులు పునరావాస పనుల్లో పాల్గొన్నారు.