kerala

కేరళను వణికిస్తోన్న ర్యాట్ ఫీవర్

Submitted by arun on Tue, 09/04/2018 - 10:30

వరదలతో అతాలకుతలమైన కేరళ వాసులను కొత్త సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయ్. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో లెప్టోస్పిరోసిస్‌ వణికిస్తోంది. తీవ్రజ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. లెప్టోస్పిరోసిస్‌తో ఇప్పటి వరకు  2వందల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరితే 10 మంది మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన వారిలో ఐదుగురు కార్మికులు పునరావాస పనుల్లో పాల్గొన్నారు.

కేరళ వర్షాలపై నాసా శాటిలైట్ వీడియో

Submitted by arun on Thu, 08/23/2018 - 12:53

నైరుతి రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. ఈ మేరకు భారత దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది. భారత్‌లో ఇది వర్షాలకు అనుకూల సమయమన్న నాసా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కేరళలో ఎడతెరపి లేకుండా వందల సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.

కేరళ: యూఏఈ 700 కోట్ల సాయం తిరస్కరణ

Submitted by arun on Thu, 08/23/2018 - 10:55

మలయాళ సీమను ఆదుకునేందుకు యూఏఈ ప్రకటించిన 700 కోట్ల భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విదేశాలు అందించే నగదు విరాళాన్ని తీసుకునే అవకాశాలు లేకపోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వార్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముంపు తెచ్చిన ముప్పు...వైపరీత్యాన్ని అంచనా వేయలేదా?

Submitted by arun on Sat, 08/18/2018 - 16:28

కేరళలో జల విలయానికి కారణాలేంటీ ? ఎడతెరపి లేని వర్షాలకు వరద నీరు తోడయిందా ? నదులు, డ్యాంలు నిండిపోయి నీళ్లు రావడమే కారణమా ? వరదలను ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయిందా ? సర్కార్‌ ముందే మేల్కొని ఉంటే ఇంతలా ప్రాణ నష్టం జరిగేది కాదా ? భారీగా నదులు, ఉప నదులు ఉన్నా కేరళ అతలాకుతలమైంది ? కేంద్రం కూడా సకాలంలో స్పందించలేదా ? ఎందుకిలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

కేరళలో భారీ వర్షాలకు కారణం ఏంటి..?

Submitted by arun on Sat, 08/18/2018 - 09:07

కేరళ భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలోని 44 నదులు పొంగిప్రవహిస్తుండటంతో అనేక డ్యాముల ప్రాజెక్టులను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఉత్తరాన కాసర్‌గోడ్‌ నుంచి దక్షిణం చివర ఉన్న తిరువనంతపురం వరకు అన్ని జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. 1924 అనంతరం ఇంత భారీగా వర్షపాతం రావడం ఇదే కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు

Submitted by arun on Sat, 08/11/2018 - 17:13

కేరళపై వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. వరుణుడి ఉగ్రరూపానికి కేరళలోని చాలా జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది.  దీంతో సగం కేరళ వరద గుప్పిట్లోనే చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 11జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అతలాకుతలమైన కేరళలో కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది.  

కేరళలో భారీ వర్షాలు..26 మంది మృతి

Submitted by arun on Fri, 08/10/2018 - 10:20

భారీ వర్షాలతో.. కేరళ అల్లకల్లోలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు వానకష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లోనే ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు భారీ వర్షాలకు రాష్ట్రంలోని 24 డ్యాముల గేట్లను ఎత్తివేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద డ్యాముగా పేరుగాంచిన చెరుతోని డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. ఇక వరద దెబ్బకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. అలాగే భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. 

మరో రికార్డు సాధించిన తెలంగాణ

Submitted by arun on Mon, 07/23/2018 - 12:45

తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు సాధించింది. సుపరిపాలనలో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకు సాధించింది. అత్యవసర మౌలిక వసతులు, మానవాభివృద్ధి సహకారం, సామాజిక భద్రత, మహిళా-శిశు సంక్షేమం, శాంతిభద్రతల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయకల్పన వంటి 30 అంశాల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ థర్డ్‌ ప్లేస్‌లో నిలిచింది. వరుసగా మూడో సంవత్సరం కూడా కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు సెకండ్‌ ప్లేస్‌లో నిలువగా ఆంధ్రప్రదేశ్‌కు 9వ స్థానం దక్కించుకుంది. ఇక సుపరిపాలన ర్యాంకుల్లో మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బీహార్‌ అట్టడుగున నిలిచాయి.
 

స్టెప్పులతో అదరగొట్టిన వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్

Submitted by arun on Tue, 06/05/2018 - 12:38

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమే. లేటు వయసులో...డ్యాన్స్‌ వేస్తూ ఫోకస్ అవుతున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా స్టెప్పులేసి...కెవ్వు కేక అంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్‌ సంజయ్‌ శ్రీవాస్తవ్‌ గోవిందా పాటలకు స్టెప్పులేసి...విదిషా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తాజాగా ఓ వైల్డ్ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌...భార్యతో కలిసి వేసిన స్టెప్పులకు జనం వావ్ ఏం డ్యాన్సంటున్నారు.