Venkaiah Naidu

ప్రకృతి వ్యవసాయం పరిశిలించిన ఉపరాష్ట్రపతి

Submitted by arun on Thu, 08/23/2018 - 15:26

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని,

నర్సింహపాలెంలో ప్రకృతి వ్యవసాయం,

ఎన్నో దాని గురించి తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి,

రైతులతో సమావేశమయ్యారు, మన 

అద్బుత వాచస్పతి మన వెంకయ్యగారు.  శ్రీ.కో. 

వెంకయ్య ఎదుగుదలలో వాజ్‌పేయి కీలకపాత్ర

Submitted by arun on Sat, 08/18/2018 - 09:22

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నో పదవులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. అయితే అటల్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయికి లక్షలాది ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వాజ్‌పేయికి కన్నీటితో వీడ్కొలు పలికారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. అయితే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాజ్‌పేయి అంత్యక్రియల్లో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

ప్రోటోకాల్ పాట్లు...ప్రోటోకాల్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 07/24/2018 - 10:41

ప్రోటోకాల్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ వల్ల అందరితో తీరిగ్గా గడపలేకపోతున్నానని చెప్పారు. ఏ కార్యక్రమానికైనా హాజరైనప్పుడు ముఖ్యమైన వ్యక్తులతో కాసేపు మాట్లాడలేకపోతున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు : వెంకయ్య

Submitted by arun on Thu, 03/29/2018 - 12:33

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్టీఆర్‌....బయోపిక్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్‌లో....ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు షూటింగ్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కు తేజ దర్శకత్వం వహిస్తుండగా...బుర్రా సాయిమాధవ్‌ మాటలు, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్, వారాహి చలనచత్రం, విబ్రీ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయ్. 

ఎంపీ ఇంట్లో ఉపరాష్ట్రపతి బూట్లు మాయం

Submitted by arun on Fri, 01/19/2018 - 16:50

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొన్ని అధికారిక కార్యక్రమాల నిమిత్తం నేడు బెంగళూరులో పర్యటిస్తున్నారు. వెంకయ్యనాయుడుకు నగరంలో వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంటికి అతిథిగా వెళ్లి..తిరిగొచ్చేలోపు వేసుకున్న బూట్లు మాయమైపోయాయి. దీంతో వెంకయ్య ఒకింత అసహనానికి గురయ్యారు. నిత్యం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే వెంకయ్యనాయుడు. తీరా ఆయన బూట్లే పోవడంపై ఖాకీలు తలలు పట్టుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి బెంగళూరు వెళ్లిన వెంకయ్య..కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్‌లతో కలిసి ఎంపీ పీసీ మోహన్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య బయటకొచ్చేసరికి షూస్ కనిపించలేదు.

ఆ ప్రకటన చూసి నేనూ మోసపోయా

Submitted by arun on Fri, 12/29/2017 - 17:53

నకిలీ ప్రకటనలకు తను కూడా మోసపోయానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ నకిలీ ప్రకటనలపై లేవనెత్తిన చర్చలో భాగంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. సులువుగా బరువు తగ్గడానికి వచ్చిన ఓ ప్రకటనను చూసి మోసపోయానన్నారు. వెయ్యి రూపాయల మందులతో బరువు తగ్గొచ్చన్న ప్రకటనకు డబ్బులు చెల్లించి ఆర్డర్‌ బుక్‌ చేశానన్నారు. ట్యాబ్లెట్లు అందిన తర్వాత  మెయిల్‌ వచ్చిందని, అందులో మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే మీకు అవసరమైన ఒరిజనల్‌ ట్యాబ్లెట్లు పంపిస్తామని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయానని గ్రహించి వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు.