dog

కుక్క వర్సెస్‌ నాగుపాము

Submitted by arun on Wed, 10/24/2018 - 13:53

నాగుపాము, కుక్క మధ్య జరిగిన విరోచిత పోరాటం  వైరల్‌గా మారింది. కర్ణాటకలోని  హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు  మధ్య పెద్ద గొడవే జరిగింది. అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది. తన జోలికి రావద్దని నాగుపాము కుక్కను బెదిరిస్తూ పొదల్లోకి జారుకుంది.

వెంకన్నపై భక్తిని చాటుకున్న శునకం...తమిళనాడు నుంచి తిరుమల వరకు...

Submitted by arun on Tue, 10/02/2018 - 16:24

ఏడుకొండల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు.. తాను కూడా, శ్రీవారికి భక్తురాలినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశుని దర్శనం కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా.. 400 కిలో మీటర్లు నడిచింది. 8 రోజుల పాటు నడిచి.. తమిళనాడు నుంచి ఏడుకొండలకు చేరుకుంది. తిరుమలకు చేరుకున్న ఈ శునకాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్బారు. తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన ఓ భక్తబృందం పాదయాత్రగా తిరుమలకు బయలుదేరింది. అయితే, వీరికి మార్గమధ్యలో ఓ శునకం కనిపించింది. ఆకలితో ఉన్నదానికి రెండు బిస్కెట్లు వేశారు. అక్కడి నుంచి ఆ కుక్క వారితో పాటు పాదయాత్రగా.. తిరుమలకు వరకు వచ్చింది.

కుక్క VS పాము...తల్లి శునకంపైకి పామును ఊసిగొల్పిన స్థానికులు

Submitted by arun on Thu, 09/20/2018 - 13:11

ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి శునకాన్ని కూడా పాము కాటేసేందుకు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు కాపాడారు. 
భద్రక్ లో కొద్ది రోజుల క్రితం ఓ శునకం పిల్లలను కనింది. రాత్రి వేళ కుక్క పిల్లల వద్దకు భారీ నాగు పాము వచ్చింది. పాము దాడి నుంచి పిల్లలను తల్లి శునకం అడ్డుకుంది. కాసేపటికి పాము మళ్లీ బుసలు కొట్టింది. కుక్క ఎదురుతిరగడంతో పాము వెనుదిరిగే ప్రయత్నం చేసింది. అయితే, ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధిస్తున్నస్థానికులు పామును మళ్లీ శునకంపైకి ఊసిగొల్పారు. 

Tags

కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్‌

Submitted by arun on Fri, 08/03/2018 - 12:27

ముద్దుగా పెంచుకున్న కుక్క  వల్ల ఓ యజమాని కాళ్లు, చేతులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ వెంట తిరిగే పెంపుడు కుక్క‌లను య‌జ‌మానులు ముద్దు చేస్తుంటారు. ఆ మూగ‌జీవులు కూడా య‌జ‌మానితో పాటు అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో చాలా ద‌గ్గ‌ర‌గా మెలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ వ్య‌వహారం అనుకోని ప్ర‌మాదాల‌కు కూడా దారి తీస్తుంటుంది. అమెరికాలో ఓ వ్య‌క్తికి ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. అమెరికా విస్‌కాన్సిన్‌కు చెందిన గ్రేగ్‌ మంటఫేల్‌(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే అతని రెండు చేతులను మోచేతుల వరకూ తొలగించారు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు.

బైరవుడు, ఫైథాన్‌ మధ్య సాగిన భీకర పోరు

Submitted by arun on Mon, 07/30/2018 - 13:52

ఒక్కోసారి కొమ్ములు తిరిగిన వీరులకైనా ఓటమి తప్పదు. అది మనుషులైనా అడవి జంతువులైనా ఒక్కటే సూత్రం. సర్ప జాతిలోనే డేంజర్‌ లిస్ట్‌లో ఉన్న ఫైథాన్‌ అంటే ఎవరైనా హడలిపోవాల్సిందే. సైజ్‌లోనే కాదు వెయిట్‌లోను తనకు తానే సాటి అనిపించుకుంటుంది కొండచిలువ. పైగా మనుషులను అమాంతం మింగే ఈ పామును చూస్తేనే జనం వ‌ణుకిపోతారు. అలాంటి భయంకరమైన కొండ చిలువకే పట్టపగలు చుక్కలు చూపించింది శునకం.
 

Tags

యజమాని ప్రాణాలకు.. తన ప్రాణాలు అడ్డుపెట్టింది

Submitted by arun on Tue, 07/24/2018 - 13:38

లయన్స్‌తో  పోరాడి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ  పెట్ డాగ్.  ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని రక్షించింది. మృగరాజులను సైతం ముప్పతిప్పలు పెట్టింది.  అది ఎక్కడో కాదు గుజరాత్‌లోని అంబార్ది గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశ్వాసానికి మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిందని కుక్కను ప్రతి ఒక్కరూ  ప్రశంసిస్తున్నారు. 

దిగులు చెందుతున్న రమణదీక్షితులు పెంపుడు కుక్కలు

Submitted by arun on Fri, 06/29/2018 - 15:01

విశ్వాసానికి ప్రతీకలు కుక్కలు. యజమానుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తాయి. రెండురోజులు కనిపించకపోతే తల్లడిల్లిపోతుంటాయి. తిండి తినకుండా దిగాలుగా పడి ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడి ఇంటి కుక్కల పరిస్థితి అలాగే ఉంది. ఆయన ఇంటి వద్ద సరిగ్గా ఉండకుండా బయట ప్రాంతాలకు వెళ్తుండటంతో ఆయన పెంపుడు కుక్కలు దిగులు చెందుతున్నాయి.

గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన కుక్క

Submitted by arun on Tue, 06/26/2018 - 14:59

మాడ్రిడ్‌లో ఓ పోలీస్ డాగ్ తెలివి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అది తన ట్రైనర్ పాలిట సేవరే (రక్షకురాలే) అయింది. ఎక్సర్ సైజు సందర్భంగా హఠాత్తుగా కింద పడిపోయిన అతగాడు మరణించాడేమోననుకుని పరుగున వచ్చి అతడ్ని సేవ్ చేసేందుకు నానా పాట్లూ పడింది. మ్యాడ్రిడ్ పోలీసులు ఓ కుక్కకు గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ చేయడంలో దానికి ఇచ్చిన ట్రైనింగ్‌ను పరీక్షించారు పోలీసులు. ఈ నేపథ్యంలో..ట్రైనర్ శిక్షణలో భాగంగా కావాలనే గుండె పోటు వచ్చినట్టు కుప్పకూలగానే.. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అతడి ఛాతి మీద ముందు కాళ్లతో బాదింది.

పోలీసులకు వింత పరిస్థితి.. కుక్కను స్టేషన్‌‌కు తీసుకెళ్లిన పోలీసులు

Submitted by arun on Sun, 12/17/2017 - 11:38

ఉత్తరప్రదేశ్‌‌ పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. బదౌన్‌కు చెందిన రెండు వర్గాలు కుక్క మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగాయి. ఇది కాస్తా శృతి మించడంతో గొడవకు దిగాయ్. చివరికి కుక్క కథ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. అసలు ఓనరు ఎవరో తేల్చేందుకు కుక్కను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు వర్గాలను సుదీర్ఘంగా విచారించిన తర్వాత కుక్కను అసలు యజమానికి అప్పగించారు పోలీసులు. 
 

కుక్క చనిపోతే ఊరుఊరంతా శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టారు!

Submitted by lakshman on Wed, 09/13/2017 - 20:33

కేరళ: రోడ్డు మీద ఒక శవం కనిపిస్తేనే మనకెందుకొచ్చిందిలే అని దులిపేసుకుపోతున్న రోజులివి. అలాంటిది ఓ వీధి కుక్క చనిపోతే ఊరుఊరంతా శోకసంద్రంలో మునిగిపోవడం ఈరోజుల్లో వింతే. అలాంటి వింత ఘటనే కేరళలోని కుంజిపల్లి గ్రామంలో జరిగింది. సెప్టెంబర్ 8న ఈ ఊళ్లో ఓ వీధికుక్కను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వీధికుక్క అంటే ఈ గ్రామస్తులు కోపగించుకుంటారు. దాని పేరు అలీ అప్పు. ఒక వీధికుక్కపై ఎందుకంత ప్రేమని అడిగితే ఆ ఊరి జనం చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.