south india

రోడ్డుపై గోతుల్లో ఏపీది మొద‌టిస్థానం

Submitted by admin on Sun, 09/10/2017 - 18:46

హైదరాబాద్‌ః ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంచుకున్న దారులు గతుకులమయంగా తయారయ్యాయి. రహదారుల మీద గుంటలు, వర్షాకాలంలో వాటి వల్ల జరిగే ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఈ గతుకులుగుంటల రోడ్లకు సంబంధించిన లెక్కలు ఏపీ ప్రజలను మరింత భయపెడుతున్నాయి. ఇప్పటివరకూ ఏపీలో ఈ గతుకుల రోడ్లు 930 మంది చావుకు కారణమయ్యాయి. తెలంగాణలో కూడా ఇలాంటి రోడ్లపై ప్రయాణించడం వల్ల 886 మంది చనిపోయారు. స్పీడ్ బ్రేకర్లు సరిగా లేకపోవడం వల్ల ఏపీలో 2016 సంవత్సరంలోనే 201 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.