tirumala

బ్రహ్మోత్సవాల వెనుకున్న అసలు చరిత్ర ఏంటి...బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి?

Submitted by arun on Tue, 09/11/2018 - 09:55

తిరులేశుని సన్నిధి... బ్రహ్మోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోవత్సవాలంటే ఎందుకింతటి విశిష్టతో మీకు తెలుసా? ఆ లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుడికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం వెనుక వాస్తవ చరిత్ర ఏంటి? అసలు ఇంతకీ తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి. 9రోజులపాటు జరిగే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్రపై hmtv ప్రత్యేక కథనం.

తిరుమల సంప్రోక్షణ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు

Submitted by arun on Tue, 07/17/2018 - 10:04

తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ, సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. సంప్రోక్షణ సమయంలోనూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని, గతంలో మహా సంప్రోక్షణ సమయంలో పాటించిన నిబంధనలను అనుసరించాలని ఆయన సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, పూజాది కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 07/16/2018 - 10:27

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాసంప్రోక్షణ  పేరుతో తిరుమల ఆలయాన్ని తొమ్మిది రోజులు పాటు మూసివేయడంపై పలు అనుమానాలకు  తావిస్తోందని ఆరోపించారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించకపోవడం దారుణమన్నారు.  వెంకన్నను దర్శించుకోవడం కుదరదు కొండకు రావొద్దని టీటీడీ చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.  టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

తిరుమలలో మరో అపచారం

Submitted by arun on Mon, 07/02/2018 - 10:36

తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. జీఎన్‌సీ టోల్‌గేట్‌ నుంచి వెళ్లే రింగ్‌రోడ్డుపై కోడిమాంసం చెల్లాచెదురుగా పడి ఉంది. అందులోనూ గరుడ పోలీసు విశ్రాంతి భవనం ముందే మాంసం పడిఉండటం భక్తులను మరింత విస్మయానికి గురి చేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

పొరపాటున నోరు జారాను...క్షమించండి: ఎంపీ మురళీమోహన్

Submitted by arun on Sat, 06/23/2018 - 15:22

‘వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అని పొరపాటుగా మాట్లాడినందుకు ఆయనను క్షమించు స్వామీ అని వేడుకున్నాను’ అని తెలిపారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ కావాలని నేను మాట్లాడలేదు. పొరపాటు జరిగింది అంతే. ఆ మాటను పట్టుకుని చాలా మంది సోషల్ మీడియాలో రచ్చ చేశారు. నా పొరపాటుకు చింతిస్తూ స్వామిని క్షమించమని వేడుకున్నాను ’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడికి కులాన్ని అంటగట్టే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులంతా తనను క్షమించాలని ఎంపీ మురళీమోహన్ కోరారు.

తిరుమలపై కేంద్రం కన్నేసిందా...? పర్యవసానాలు ఏంటి?

Submitted by santosh on Sat, 05/05/2018 - 17:09

టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిదిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాలంటిని రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి.

పవన్‌పై ఎమ్మెల్యే రోజా కామెంట్స్

Submitted by arun on Mon, 02/19/2018 - 11:17

పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్దంగా ఉందని టీడీపీ, కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగట్టే సత్తా పవన్ కల్యాణ్ కుందా అని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరింది. ఇవాళ తిరుమలకు వచ్చిన ఆమె.. వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకుంది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జేఎఫ్ సీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 

ఆ వార్తల్లో నిజం లేదు : కె.రాఘవేంద్ర రావు

Submitted by arun on Thu, 01/25/2018 - 12:55

గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలలో, సోషల్ మీడియా లో 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు తి.తి.దే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాది మంది ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె.రాఘవేంద్ర రావు ఖండించారు. ఎస్.వి.ఎస్.సి ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానల్ లో స్వామివారి పై మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటి ని అలరిస్తూ స్వామివారి సేవ లో తరించాలన్నది ఒకటే తన కోరిక అని 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.


 

తిరుపతి లడ్డు ప్రసాదం ప్రాముఖ్యత

Submitted by lakshman on Wed, 09/13/2017 - 19:48

దైవ ప్రసాదాల్లో తిరుపతి లడ్డుది ప్రత్యేక స్థానం. తిరుపతి వెళ్లి తిరిగొస్తూ లడ్డు ప్రసాదం తీసుకురాకపోతే ఏదో కోల్పోయినట్లు చాలామంది భావిస్తుంటారు. అంతలా తిరుమల శ్రీవారి లడ్డుకు దేశ వ్యాప్తంగా పేరుంది. రుచిలో, సువాసనలో తిరుమల లడ్డుతో సరితూగే ప్రసాదం లేనేలేదు. అందుకే తిరుమల లడ్డుకు పేటెంట్ రైట్స్ కూడా పొందటం జరిగింది. అంటే ఈ లడ్డు తయారీని ఎవరూ అనుకరించకూడదని అర్థం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారు చేసి, ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు.