West Godavari

నా జోలికొస్తే తోలు తీస్తా

Submitted by arun on Thu, 07/26/2018 - 10:32

జగన్ విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేరన్నారు. రాజకీయాలు చేసేందుకు వేల కోట్లు అవసరం లేదని, గూండాలు అక్కర్లేదని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోందని పవన్ కల్యాణ్ అన్నారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరు. పారిపోతారు. అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పారు. ఇసుక మాఫియా, దోపిడీలు చేసే నాయకులకే ఇంత ధైర్యం ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకెంత తెగింపు ఉండాలి. దూరం నుంచి చూస్తే నేను మెతకగానే కనబడతా.

వైసీపీ బంద్‌...పవన్‌ యాత్రకు బ్రేక్‌

Submitted by arun on Tue, 07/24/2018 - 10:20

జనసేన అధినేత పవన్‌ పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. వైసీపీ బంద్‌ నేపథ్యంలో ప్రజా పోరాట యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌... భీమవరంలో ప్రజాసంఘాలతో సమావేశం కానున్నారు. మరోవైపు తుందుర్రులో ఆక్వాపార్క్‌ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా పవన్‌ యాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసులో కొత్త మలుపు

Submitted by arun on Tue, 06/26/2018 - 13:11

ఏడాదిన్నర క్రితం ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. రోడ్డుప్రమాదంగా ఆనాడు కేసును క్లోజ్‌ చేసినా.... సీఐడీ రంగప్రవేశంతో అసలు నిజం బయటపడింది. శ్రీగౌతమిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు సీఐడీ గుర్తించింది. కొన్ని నెలలుగా దర్యాప్తు చేస్తోన్న సీఐడీ అధికారులు శ్రీగౌతమిది హత్యేనని తేల్చారు. శ్రీగౌతమి హత్యలో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీఐడీ వైజాగ్‌కి చెందిన ఇద్దర్ని నరసాపురానికి చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

30 ఇయర్స్‌ బేబీ

Submitted by arun on Sat, 01/20/2018 - 15:21

ఆ నవ్వులు మనసును దోచేస్తాయి..... చిన్నిచిన్ని చేతులు ఊపుతూ.... ముద్దు బొద్దుగా ఉండే ఆ పాపను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది.... ఎత్తుకుని ఆడించాలనిపిస్తుంది.... కానీ మీరు చూస్తున్నది ఏడాది పాపను కాదు.... ముప్ఫై ఏళ్ల యువతిని.... అవును మీరు వింటున్నది నిజమే... మీరు చూస్తున్న ఈ అమ్మాయి చిన్నారి కాదు.... 30ఏళ్ల యువతి.... భగవంతుడు చల్లగా చూసుంటే మరో ఇద్దరు చిన్నారులకు తల్లి కావాల్సిన ఈమె.... ఇప్పటికీ తన తల్లి ఒడిలో పసిపాపగానే మిగిలిపోయింది.
   

దారుణం.. కన్నకూతుర్ని చంపేందుకు యత్నించిన కసాయి తండ్రి

Submitted by arun on Fri, 12/29/2017 - 12:38

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతురిని చంపేందుకు యత్నించాడో కసాయి తండ్రి.  కోరుకుండ మండలం జంబూపట్నంలో వెలుగు చూసిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.  టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న వీర వెంకటలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.  వీర వెంకటలక్ష్మి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి 8 ఏళ్ల క్రితం మరో పెళ్లి చేసుకుంది. అయితే వెంకటరెడ్డి తీరు నచ్చకపోవడంతో తల్లి కూతురు దూరంగా ఉంటున్నారు. దీంతో కక్ష పెంచుకున్న వెంకట రెడ్డి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో దాడికి పాల్పడ్డాడు.  పాప కేకలు విని  స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.