CM Chandrababu Naidu

అశోక్‌బాబు ప్రజాసేవలోకి రా.. : చంద్రబాబు

Submitted by arun on Sat, 06/02/2018 - 15:21

ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మరో ఏడాదిలో రిటైరవుతున్నారని, కాబట్టి ప్రజాసేవలోకి (రాజకీయాల్లోకి) రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని అన్నారు.

చంద్ర‌బాబు బ్లేమ్ గేమ్ బాగానే ఆడుతున్నారే : ప్రకాష్ జవదేకర్

Submitted by lakshman on Wed, 04/04/2018 - 20:19

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానం, కేంద్రం ఏపీకి చేస్తున్న సాయంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీయేత‌ర పార్టీల‌కు చెందిన ముఖ్య‌మంత్రుల్ని, ఎంపీల‌తో భేటీ అవుతున్నారు. కేంద్రం తీరును తూర్పార‌బ‌డుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సహయం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌పై  బీజేపీ కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ఘాటుగా స్పందించారు. 

శ్రీదేవి మృతిపై చంద్రబాబుకూ డౌటా?

Submitted by arun on Wed, 02/28/2018 - 16:35

దిగ్గజ నటి శ్రీదేవి మరణంపై అనేక రకాల అనుమానాలు పొడసూపిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆ ప్రభావంతో కొంత అనుమానాస్పదంగా మాట్లాడారు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఆ నటికి నివాళిగా నిన్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు చంద్రబాబు సహా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు. అదే సమయంలో శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని అన్నారు.

కేంద్రంపై విరుచుకుప‌డ్డ సీఎం చంద్ర‌బాబు

Submitted by arun on Mon, 02/19/2018 - 15:26

సీఎం చంద్రబాబు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలు కావడం లేదని, సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మనోభావవాలు దెబ్బతినకుండా కేంద్ర వ్యవహరించాలని సూచించారు.

ప్రతిపక్ష నేత జగన్‌పైనా సీఎం మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసమంటున్న జగన్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ చట్టాలు తెలుకొని మాట్లాడాలని హితవు పలికారు. టీడీపీ దూరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 

సీఎం కేసీఆర్, సీఎం చంద్ర‌బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు

Submitted by lakshman on Tue, 02/13/2018 - 09:02

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల 31 మంది ముఖ్యమంత్రులలో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన ఆరోపణ కాదు... నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేసే ఎన్నికల ప్రమాణ పత్రాలలో స్వయంగా వారే పేర్కొన్న వాస్తవం. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), జాతీయ ఎన్నికల పరిశీలన సంస్థ (ఎన్‌ఈడబ్ల్యూ)ల సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో...

రాష్ట్రంలో టీడీపీని ఓడించే శక్తి ఏపార్టీకి లేదు: చంద్రబాబు

Submitted by arun on Sun, 01/21/2018 - 15:07

ఏపీలో టీడీపీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు అలా లేదని, పనితీరునే ప్రజలు ప్రమాణంగా తీసుకుంటున్నారని అన్నారు.
నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదిరిస్తారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. 
 

సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల సెగ!

Submitted by arun on Wed, 01/17/2018 - 17:30

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు మత్స్యకారుల సెగ తగిలింది. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నోవాటెల్‌ హోటల్‌కు రానున్న నేపథ్యంలో హోటల్‌ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హోటల్‌కు ఎదురుగా ఉన్న సముద్రంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున జలదీక్ష చేపట్టారు. తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ మత్స్యకారులు గతకొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీక్ష చేపట్టారు మత్స్యకారులు.
 

హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం

Submitted by arun on Thu, 12/28/2017 - 18:02

ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం జరిగింది. హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. పోలీస్‌ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్‌ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్‌ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. చినరాజప్ప రాకపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విషయం తెలుసుకుని పోలీస్‌ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.