love

ఒకమ్మాయి ఇద్దరబ్బాయిల కథ.. చివరకు...

Submitted by arun on Mon, 10/01/2018 - 13:52

సినిమా స్క్రిప్ట్‌కు మించిన రియల్‌ స్టోరీ.. ఇప్పటి ట్రెండ్‌కు ఏమాత్రం తగ్గని ప్రేమకథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఒకమ్మాయి ఇద్దరబ్బాయిల కథ.. చివరకు మంటల్లో కాలిపోయింది. ఇద్దరి ప్రేమికుల ప్రాణాలను బలిగొంది. ఒళ్లు గగుర్పొడిచే ట్రాజెడీగా.. ముగిసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన రియల్‌ లవ్‌ స్టోరీపై హెచ్‌ఎంటీ ప్రత్యేక కథనం.

Tags

ప్రేమించలేదని గొంతు కోశాడు

Submitted by arun on Fri, 08/31/2018 - 09:56

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వినాయకనగర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదంటూ ఓ విద్యార్థిని గొంతు కోసేశాడు. టెన్త్ విద్యార్థిని నిఖితను ప్రేమించాలంటూ  అరవింద్ అనే యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. అందుకు నిఖిత నిరాకరించడంతో ఉన్మాదిలా మారి ఆమెను హతమార్చాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

Tags

ప్రేమోన్మాదానికి మరో యువతి బలి

Submitted by arun on Fri, 07/06/2018 - 16:38

ప్రేమోన్మాది వేధింపులు మరో యువతిని బలి తీసుకున్నాయి. నల్గొండ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్వేత తుప్రాన్ పేటలోని నేతాజీ కాలేజీలో ఎంబీఎ చదువుతుంది. ఈమెకు  భరత్ అనే యువకుడితో పరిచయం ఉంది. ప్రేమించమని శ్వేతను వేధిస్తున్నాడు. ఇటీవల శ్వేతకు మరో యువకుడితో  నిశ్చితార్థం జరిగింది. గత నెల 30న మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు శ్వేత వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భరత్.. అశోకా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాడు. పరీక్ష అనంతరం బైక్ పై బలవంతంగా తీసుకెళుతున్న భరత్ తో శ్వేత గొడవపడింది. ఇద్దరీ పెనుగులాటలో శ్వేత బైక్ పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది.

ఇది ప్రేమ వివాహం కాదు: రేణూ దేశాయ్‌

Submitted by arun on Tue, 06/26/2018 - 11:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్...గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. మ‌రికొద్ది రోజుల్లో మ‌రో వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇటీవ‌లె రేణు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. తాజాగా త‌న రెండో వివాహం గురించి ఓ ఆంగ్ల ప‌త్రికతో రేణు మాట్లాడారు.
 

ప్రేమ వ్యవహారంలో పోలీసుల పంచాయితీ.. యువతి మృతి

Submitted by arun on Sat, 05/26/2018 - 10:37

ప్రేమ వ్యవహారంలో పోలీసుల పంచాయితీ ఆపై యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ఆగ్రహించిన గ్రామస్థులు ఠాణాపై దాడి చేశారు. శుక్రవారం రాత్రి అనంతపురం జిల్లా తాడిమర్రి పోలీసుస్టేషన్‌పై మోదుగులకుంట గ్రామానికి చెందిన వందల మంది దాడి చేయడంతో పోలీసులు భయంతో స్టేషన్‌ లోపలకు వెళ్లి తలుపులు బిగించుకున్నారు. ఎస్సైపై దాడి చేయడం, పోలీసు జీపు అద్దాలు పగలగొట్టడంతో పాటు స్టేషన్‌లోని సామగ్రి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వరకూ ఈ ఆందోళన కొనసాగింది. 

ప్రేమలో పడిన కాజల్ అగర్వాల్.. ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు..!

Submitted by arun on Mon, 04/02/2018 - 16:28

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది! అయితే వ్యక్తి ప్రేమలో మాత్రం కాదండోయ్.. తాను ఆత్మీయంగా పెంచుకునే గుర్రం(ఖలీసి) తో ప్రేమలో పడింది. అవును.. ఈ విషయాన్ని కాజలే స్వయంగా ప్రకటించింది.‘ఖలీసి’ అనే గుర్రం అంటే తనకు చాలా ఇష్టమని అగ్ర కథానాయిక కాజల్‌ తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్రంతో ఆప్యాయంగా దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘రోజు ముగిసే సరికి కాళ్లకు మురికి అంటుకుంటుంది. శిరోజాలు పాడైపోతాయి. కానీ కళ్లల్లోని మెరుపు అలానే ఉంటుంది.. ఖలీసి (గుర్రం)తో  ప్రేమలో ఉన్నా’ అని ఆమె పోస్ట్‌ చేశారు. గుర్రం కళ్లను ఈగల నుంచి రక్షించేందుకు దానికి మాస్క్‌ వేశారు.

యువ‌తి శీలానికి వెల‌క‌ట్టిన పెద్ద‌లు

Submitted by arun on Tue, 01/30/2018 - 11:25

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన ఓ యువతి శీలానికి పెద్దలు వెలకట్టారు. తల్లిదండ్రులు లేని యువతిని ఓ యువకుడు నమ్మించి ప్రేమపేరుతో గర్భవతిని చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు. దీంతో పెద్దలను  ఆశ్రయిస్తే.. శీలానికి వెలకట్టారు. 2లక్షల 25వేలు ఇప్పిస్తామని సలహా ఇచ్చారు. అందుకు నిరాకరించిన యువతి మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని పోలీసులను ఆశ్రయించింది.

ప్రేమోన్మాదానికి మరో యువతి బలి

Submitted by arun on Fri, 12/22/2017 - 10:54

ప్రేమోన్మాదానికి మరో మహిళ బలైంది. మృతువుతో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంధ్యారాణి చనిపోయింది. 70 శాతం కాలిన గాయాలైన సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో సంధ్యారాణిపై కార్తీక్ అనే వ్యక్తి నిన్న రాత్రి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినా శరీరమంతా కాలిపోయి ఉండడంతో ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు. 

లవర్ కోసం కోటి నగలు కొట్టేసింది!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 20:00
  • ప్రేమ కోసం నగల చోరీ
  • కోటి విలువైన వజ్రాల హారం మాయం
  • మింత్ర సీఈవో ఇంట్లో పనిమనిషి నిర్వాకం
  • పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలు

బెంగళూరు: ప్రేమ కోసం.. ప్రేమించిన వారి సంతోషం కోసం ఏమైనా చేయొచ్చనే మాటలను స్ఫూర్తిగా తీసుకుందో ఏమో కానీ ఓ యువతి తన ప్రియుడి కోసం దొంగతనానికి పాల్పడింది. తను పనిచేసే ఇంట్లో కన్నం వేసి రూ. కోటి విలువైన నగలను తస్కరించింది. ఇంట్లో తన పని చక్కబెట్టుకున్న తర్వాత ఉద్యోగం మానేస్తానంటూ చెప్పింది.

చెల్లి పెళ్లైన రెండురోజులకే బావను చంపేశాడు

Submitted by lakshman on Wed, 09/13/2017 - 18:35
నగరంలో దారుణ ఘటన జరిగింది. పెద్దల అంగీకారం లేకుండా తన చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో బావమరిదే బావను హతమార్చిన ఘటన వెలుగులోకొచ్చింది. మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో...